Begin typing your search above and press return to search.

'అందుకే ఆ ఉగ్రవాది నన్ను రే*ప్ చేయలేదు'

గత ఏడాది అక్టోబరు ఏడున ఇజ్రాయెల్ మీద దాడి చేసి.. అనేక మందిని బంధీలుగా చేసుకొని వెళ్లటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Jan 2024 5:43 AM GMT
అందుకే ఆ ఉగ్రవాది నన్ను రే*ప్ చేయలేదు
X

ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది ఇజ్రాయెల్ మీద హమస్ తీవ్రవాదుల దాడి. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో చోటు చేసుకున్న దాడి.. అనంతరం పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ కు చెందిన వారిని బందీలుగా చేసుకొని ఉంచటం తెలిసిందే.ఈ సందర్భంగా వారెంతలా వేధింపులకు గురి చేశారన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా హమస్ చెర నుంచి విడుదలైన ఇజ్రాయెలి ఫ్రెంచ్ టాటోఆర్టిస్టు మియా స్కెమ్ తనకు ఎదురైన షాకింగ్ అనుభవాల్ని పంచుకుంది.

గత ఏడాది అక్టోబరు ఏడున ఇజ్రాయెల్ మీద దాడి చేసి.. అనేక మందిని బంధీలుగా చేసుకొని వెళ్లటం తెలిసిందే. అందులోని పలువురిని పలు విధాలుగా హింసించిన ఉదంతాలు వెలుగు చూశాయి. అయితే.. తనను కిడ్నాప్ చేసుకున్న ఉగ్రవాది తనపై అత్యా*చారం చేయటానికి ప్రయత్నించిన విషయాన్ని వెల్లడించారు. అయితే.. అతడి ప్రయత్నాలు ఫలించలేదని.. కారణం.. అతడి ఇంట్లో ఉగ్రవాది భార్య.. పిల్ల ఉండటంతో.. వారి ఇంట్లో ఉన్న 54 రోజుల్లో తనపై రే*ప్ చేయటానికి అవకాశం లభించలేదని చెబుతున్నారు.

బాధితురాలి మాటల్లో చూస్తే.. ''మ్యూజిక్ ఫెస్టివల్ లో కిడ్నాప్ చేశారు. అనంతరం చీకటి గదిలో పడేశారు. అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. నిత్యం ఒక ఉగ్రవాది గమనిస్తూ ఉండేవాడు. రే*ప్ చేయటానికి ఎత్తులు వేసేవడు. కానీ.. అతడి ఎత్తులు ఫలించలేదు. అతడి భార్య.. పిల్లలు ఉండటంతో అత్యాచారం చేయటం సాధ్యం కాలేదు. అతడి చూపులు తెగ ఇబ్బంది పెట్టేవి. ఒక రోజు భార్య బయటకు వెళ్లిన టైంలో ఆమె తనకు ఇష్టం లేదని చెప్పాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరోవైపు నన్ను ఎప్పుడు చంపేస్తారో అన్న ఆందోళన నిత్యం వెంటాడుతూ ఉండేది’’ అంటూ తన షాకింగ్ అనుభవాన్ని చెప్పుకొచ్చారు.

ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక తీవ్రమైన భయాందోళనలకు గురైనట్లుగా పేర్కొన్నారు. హమస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన తర్వాత.. తాము తీసుకొచ్చిన బందీలు క్షేమంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేసేందుకు ఒక వీడియోను విడియోను విడుదల చేశారు. అందులో మియా స్కెమ్ ను గుర్తించిన వారు ఆమె సజీవంగా ఉండటంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాను హమస్ చెరలో ఉన్నప్పుడు చాలా విషయాల్ని భయంతో తాను చెప్పలేదని.. త్వరలోనే తాను అన్ని విషయాల్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఉగ్రవాదుల చేతుల్లో నుంచి బయటపడిన ఆమె.. ఇన్ స్టాలో ఒక పోస్టు పెట్టుకొచ్చారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నట్లే తాను కూడా ‘మళ్లీ మేం డ్యాన్స్ చేస్తాం’ అంటూ కొత్త పచ్చబొట్టు వేసుకోవటం గమనార్హం. మొత్తంగా హమస్ తీవ్రవాదుల చెర నుంచి ఎలా బయటపడింది?.. ఎలా తనను ట్రీట్ చేసేదన్న అన్ని విషయాలను ఎగ్జాంఫుల్ గా ఉందని చెబుతున్నారు.