Begin typing your search above and press return to search.

పదేళ్ళు సీఎం గా.... రేవంత్ టార్గెట్...!

టోటల్ గా చూస్తే పదేళ్ళు సీఎం గా తానే ఉంటాను అని రేవంత్ ఫుల్ క్లారిటీ ఇచ్చారన్న మాట.

By:  Tupaki Desk   |   14 Feb 2024 8:46 PM IST
పదేళ్ళు సీఎం గా.... రేవంత్ టార్గెట్...!
X

ఈసారి వచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ పదేళ్ల పాటు నిలబెట్టుకుంటుందని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ధీమాగా చెప్పారు. జనాలు ఆశీర్వదిస్తే పదేళ్ళు కూడా తానే సీఎం గా ఉంటాను అని చెప్పారు. టోటల్ గా చూస్తే పదేళ్ళు సీఎం గా తానే ఉంటాను అని రేవంత్ ఫుల్ క్లారిటీ ఇచ్చారన్న మాట.

తెలంగాణా ఎన్నికలు జరిగినవి 2023లో అంటే దానికి 10 ఏళ్ళు కలిపితే 2033 దాకా తెలంగాణా సీఎం సీటు ఖాళీ లేదు ఉండబోదు అని పక్కాగా రేవంత్ రెడ్డి చెప్పేశారు అన్న మాట. అది విపక్షంలో బీఆర్ఎస్ తో పాటు స్వపక్షంలోని ఆశావహులకు కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పేసినట్లే అంటున్నారు.

మరి ఇంత ధీమా రేవంత్ లో ఎలా కలిగింది అంటే అది ఆయనకు జనాల మీద ఉన్న నమ్మకం కావచ్చు. లేదా తన పాలన బాగా ఉందని ఒక గొప్ప ఆత్మవిశ్వాసం కావచ్చు. తెలంగాణాలో బీఆర్ఎస్ తరువాత కాంగ్రెస్ ని కొట్టే పార్టీ ఏదీ సమీప భవిష్యత్తులో రాదు అన్న విశ్వాసం కావచ్చు.

ఏది ఏమైనా ఇక బీఆర్ఎస్ కి నో చాన్స్ అనేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆయన సీఎం గా బాధ్యతలు చేపట్టేనాటికి వయసు 55 ఏళ్ళు. మరో రెండు దశాబ్దాల పాటు తాను చురుకైన రాజకీయం చేయగలను అని ఆయన ఎన్నికల సందర్భంగా పలు సందర్భాలలో మీడియా ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు. ఇపుడు ఎటూ సీఎం సీటు దక్కింది. ఆ సీటులో జాగ్రత్తగా కుదురుకుంటే ఇక రేవంత్ రెడ్డి స్పీడ్ కి బ్రేక్ వేసేవారు ఎవరూ ఉండరని అంటున్నారు.

మరో వైపు చూస్తే రేవంత్ రెడ్డికి అన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. దగ్గరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని సర్వేలు చెబుతున్నాయి. ఈ టాస్క్ ని కూడా విజయవంతంగా రేవంత్ రెడ్డి పూర్తి చేస్తే ఇక ఆయనకు తొలి టెర్మ్ లో ఎదురు ఉండదనే అంటున్నారు.

మరో వైపు చూస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ తోనే ఢీ కొట్టి విపక్ష నేతను చేశారు. ఈసారి కనుక ఎంపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలిచి తన సత్తా చాటకపోతే ఆ పార్టీకి ఇబ్బందులు గుమ్మంలోనే పొంచి ఉండడం ఖాయం. ఈ లెక్కలు విశ్లేషణలు అన్నీ చూసుకునే రేవంత్ రెడ్డి చాలా ధీమాగా చెబుతున్నారు. పదేళ్ళు తానే సీఎం అని ఆయన అంటున్నారు.

ఇక కేసీఆర్ ఎలా అధికారంలోకి వస్తారో తాను చూస్తాను అని కూడా రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. కేసీఅర్ డబుల్ స్పీడ్ తో అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ఆ స్పీడ్ ఏంటో కూడా చూస్తామని రేవంత్ రెడ్డి గట్టిగానే రెట్టిస్తున్నారు. అసలు అసెంబ్లీ ముఖం చూడని వారికి అసెంబ్లీకే రాని వారికి అధికారం ఎందుకు అని పూర్తిగానే గాలి తీసేశారు రేవంత్ రెడ్డి. పోలీసు అభ్యర్ధులకు నియామకపత్రాలు ఇచ్చే కార్యక్రమంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.