Begin typing your search above and press return to search.

మై హోమ్ బూజా 35వ అంతస్తు నుంచి దూకిన టెన్త్ విద్యార్థి!

ఈమధ్య కాలంలో ఆత్మహత్యలే సమస్యలకు ప్రాథమిక పరిష్కారాలు అన్న స్థాయిలో జనాల ఆలోచనా విధానం మారిపోయిందని అంటున్నారు నిపుణులు. మరి ముఖ్యంగా టీనేజ్ యువత పూర్తిగా క్షణికావేశంలోనో.

By:  Tupaki Desk   |   26 Sep 2023 12:06 PM GMT
మై హోమ్  బూజా 35వ అంతస్తు నుంచి దూకిన టెన్త్  విద్యార్థి!
X

ఈమధ్య కాలంలో ఆత్మహత్యలే సమస్యలకు ప్రాథమిక పరిష్కారాలు అన్న స్థాయిలో జనాల ఆలోచనా విధానం మారిపోయిందని అంటున్నారు నిపుణులు. మరి ముఖ్యంగా టీనేజ్ యువత పూర్తిగా క్షణికావేశంలోనో.. లేక, వారి సమస్యలు చెప్పుకునేటంత చనువు తల్లితండ్రులతో లేకో తెలియదు కానీ... ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఎంతోమంది నిపుణులు, వైద్యులు, కౌన్సిలింగ్ సెంటర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా పదో తరగతి చదువుతున్న ఒక బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునేటంత ఆలోచన కూడా రాకూడని వయసులో.. చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాల్సిన ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన ఆ బాలుడు వారు నివశిస్తున్న భారీ భవంతిపైకి ఎక్కి దూకు చనిపోయాడు.

వివరాళ్లోకి వెళ్తే... రేయాన్ష్ రెడ్డి (14) అనే బాలుడు ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. గచ్చిబౌలిలోని మై హోమ్ బూజాలో అతని కుటుంబం నివసిస్తోంది. ఈ క్రమంలో ఆన్‌ లైన్‌ గేంస్ కూ బానిసైన ఆ విద్యార్థి.. చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేశాడని తెలుస్తుంది. దీంతో ఈ బానిసత్వం రాను రానూ అతనిని ఆందోళనకు గురి చేసిందట.

చివరకు ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇందులో భాగంగా జే బ్లాక్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న రాయదుర్గం స్టేషన్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రేయాన్ష్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఆన్ లైన్ గేంస్ బానిస కావడంతో పాటు చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సమయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.