శ్రమదానంలో 'ఫోటో' ప్రమాదం... కాలుజారిన డాక్టర్ వీడియో వైరల్!
అవును... మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో ఒక ఆలయ నిర్మాణంలో ఒక ప్రమాదం జరిగింది.
By: Tupaki Desk | 17 July 2025 2:00 AM ISTసాధారణంగా ఇటీవల కాలంలో ఎలాంటి చిన్న పని చేసినా, చిన్న సాయం చేసినా వెంటనే దాన్ని ఫోటోల్లో బందించుకోవాలని.. సోషల్ మీడియాలో షేర్ చేయాలనే తాపత్రయం చాలా మందికి ఉండటం సహజంగా మారిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలోనే.. ఓ ఆలయ పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ చేసిన ఫోటో ప్రయత్నానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అవును... మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో ఒక ఆలయ నిర్మాణంలో ఒక ప్రమాదం జరిగింది. ఇందులో భాగంగా... నిర్మాణ సమయంలో శ్రమదానం చేస్తున్న డాక్టర్ ప్రఫుల్ల శ్రీవాస్తవ.. 6 అడుగుల లోతైన గుంతలో పడిపోయారు. శ్రమదానం చేస్తున్నప్పుడు ఆయన ఆ క్షణం కెమెరాలో ఫోటో తీయబడింది.. కానీ మరుక్షణమే లోతైన గుంతలోకి జారిపోయాడు.
వివరాళ్లోకి వెళ్తే... సియోనిలోని ఒక ఆలయంలో నిర్మాణ పనుల సమయంలో డాక్టర్ శ్రీవాస్తవ్ అక్కడే ఉన్నారు. ఈ పనుల్లో శ్రమదానంలో భాగంగా ఆయనా ఓ చేయి వేయాలనుకున్నట్లున్నారు. ఈ సమయంలో.. గుంతలోకి ఒక గమేలాతో కాంక్రీటు పోస్తున్నాడు. ఈ సమయంలో... 'ఫోటో సరిగా రాలేదు ఇంకో బకెట్' ఇవ్వండి అని అడిగారు.
దీంతో... కార్మికుడి నుండి మరొక బమేలా కాంక్రీట్ అడిగారు డాక్టర్ శ్రీవాస్తవ. దాన్ని గుంతలో పోయడం ప్రారంభించిన వెంటనే అతని కాళ్ళ క్రింద ఉన్న మట్టి కూలిపోయింది. దీంతో.. ఆయన నేరుగా 6 అడుగుల లోతైన గుంతలో పడిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
అయితే... అదృష్టవశాత్తూ ఆయనకు స్వల్ప గాయాలే అయ్యాయి. ఆయనను వెంటనే గుంతలోనుంచి పైకి తీసిన స్థానికులు... ఎటువంటి తీవ్రమైన గాయం కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు! ఈ సంఘటన మొత్తం అక్కడ ఉన్న ఒకరి మొబైల్ కెమెరాలో రికార్డ్ చేయబడింది. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.
కాగా... చిత్రగుప్త ఆలయ పునరుద్ధరణ కమిటీకి డాక్టర్ ప్రఫుల్ శ్రీవాస్తవ ఛైర్మన్ అని అంటున్నారు. ఆయన ఉదయం పూజలు చేయడానికి ఆలయానికి వెళ్లారు. ఆ స్థలంలో స్తంభాలను నింపే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో... మొదటి కాంక్రీట్ పోసిన తర్వాత, రెండవవ సారి పోస్తున్నప్పుడు ఆయన ఒక్కసారిగా గుంతలో పడిపోయాడు.
