Begin typing your search above and press return to search.

యూఎస్ లో తెలుగు విద్యార్థిపై దాడి... రక్తంతోనే రియాక్షన్ వీడియో!

అవును... అమెరికాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న నేరాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 5:50 AM GMT
యూఎస్ లో తెలుగు విద్యార్థిపై  దాడి... రక్తంతోనే రియాక్షన్  వీడియో!
X

అమెరికాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అక్కడున్న ఇండియన్ స్టూడెంట్స్ పై జరుగుతున్న దాడులు, హత్యలు ఇక్కడున్నవారిని తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రోజు రోజుకీ ఇలా దాడుల బారిన పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగిపోతూ ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో తాజాగా మరో తెలుగు విద్యార్థిపై చికాగోలో దారుణంగా దాడి జరిగింది.

అవును... అమెరికాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న నేరాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ లోని లంగర్ హౌజ్ కి చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అనే విద్యార్థి చికాగోలోని క్యాంప్‌ బెల్ ఏవ్‌ లోని తన ఇంటి దగ్గర ముసుగు దొంగలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు! ఇది దోపిడీకోసం జరిగిన దాడిగా చెబుతున్నారు!

ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు, దాడి అనంతరం అలీ మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అలీని అతని ఇంటి సమీపంలో దొంగలు వెంబడించడం కనిపిస్తుంది. మరో వీడియోలో.. తల, ముఖం గాయాలతో రక్తస్రావం అవుతున్న అలీ తనపై గుర్తు తెలియని దొంగలు ఎలా దాడి చేశారో వివరించాడు.

అయితే... ఈ దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన అలీని వెంటనే ఆసుపత్రికి తరలించారు.. అతను ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిపై స్పందించిన అలీ... తన చేతిలో ఆహార ప్యాకెట్‌ తో ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని అలీ వీడియోలో చెప్పారు. అయితే... క్యాంప్‌ బెల్ అవెన్యూలోని అతని ఇంటి సమీపంలో ముగ్గురు అలీని వెంబడించినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది!

కాగా... గత వారం మరో భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి శవమై కనిపించిన సంగతి తెలిసిందే. ఒహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ లో చదువుకుంటున్న శ్రేయాస్ రె డ్డి తల్లిదండ్రులు హైదరాబాద్‌ లో నివసిస్తున్నారు. దీనికి ముందు.. జనవరి 16న జార్జియాలో హర్యానాకు చెందిన వివేక్ సైనీ అనే విద్యార్థి... పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్న చోట ఒక వ్యక్తి చేతిలో కొట్టి చంపబడిన సంగతి తెలిసిందే.