Begin typing your search above and press return to search.

దేశ వ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ.. తెలుగు రాష్ట్రాల మాటేంటి?

ఇక బదిలీల విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు జడ్జిలు ఇతర హైకోర్టులకు బదిలీ అయ్యారు.

By:  Tupaki Desk   |   19 Oct 2023 4:27 AM GMT
దేశ వ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ.. తెలుగు రాష్ట్రాల మాటేంటి?
X

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జోరు నడుస్తున్న వేళ.. సుప్రీంకోర్టు దేశ వ్యాప్తంగా ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా పదహారు మంది హైకోర్టు జడ్జిలను బదిలీ చేయగా.. అందులో నలుగురు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.

అయితే.. ఇదేమీ ప్రత్యేకంగా చేసిన బదిలీలు కావు. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 16 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ తాజాగా నోటిఫై చేశారంతే. హైకోర్టు జడ్జిల బదిలీలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవీ చంద్రచూడ్ తో సంప్రదింపులు జరిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓకే చేశారు.

ఇక బదిలీల విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు జడ్జిలు ఇతర హైకోర్టులకు బదిలీ అయ్యారు.

క్ర.స హైకోర్టు జడ్జి ప్రస్తుతం పని చేస్తున్నది బదిలీ స్థానం

01. జస్టిస్ కేసర్ వాణి అలహాబాద్ కలకత్తా

02. జస్టిస్ రాజ్ మోహన్ సింగ్ పంజాబ్ - హర్యానా మధ్యప్రదేశ్

03. జస్టిస్ నరేందర్ జీ కర్ణాటక ఏపీ

04. జస్టిస్ సుధీర్ సింగ్ పాట్నా పంజాబ్ -హర్యానా

05. జస్టిస్ ఎంవీ మురళిధరన్ మణిపూర్ కలకతా

06. జస్టిస్ మధురేష్ ప్రసాద్ పాట్నా కలకత్తా

07. జస్లిస్ అరవింద్ సింగ్ సాంగ్వాన్ పంజాబ్ -హర్యానా అలహాబాద్

08. జస్టిస్ అవనీష్ జింగాన్ పంజాబ్ - హర్యానా రాజస్థాన్

09. జస్టిస్ అరుణ్ మోంగా పంజాబ్ -హర్యానా రాజస్థాన్

10. జస్టిస్ రాజేంద్ర కుమార్ అలహాబాద్ మధ్యప్రదేశ్

11. జస్టిస్ నాని టాగియా గౌహతి పాట్నా

12. జస్టిస్ సి. మానవేంధ్రనాథ్ రాయ్ ఏపీ గుజరాత్

13. జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ తెలంగాణ రాజస్థాన్

14. జస్టిస్ అనుపమ చక్రవర్తి తెలంగాణ పాట్నా

15. జస్టిస్ లపితా బెనర్జీ (అదనపు) కలకత్తా పంజాబ్ - హర్యానా

16. జస్టిస్ దుప్పల వెంకట రమణ(అదనపు) ఏపీ మధ్యప్రదేశ్