చాట్ జీపీటీ వెర్షన్ : చంద్రబాబు vs కేసీఆర్ vs జగన్.. ఎవరు నిజంగా యువత భవిష్యత్తును మారుస్తున్నారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలో చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు నాయకులు తమదైన శైలిలో పాలనను నడిపిస్తున్నారు.
By: Tupaki Desk | 28 July 2025 8:00 PM ISTతెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలో చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు నాయకులు తమదైన శైలిలో పాలనను నడిపిస్తున్నారు. అయితే, యువత భవిష్యత్తుకు ఎవరు మెరుగైన దారి వేస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేటి ప్రపంచం కేవలం రోడ్లు, పెన్షన్లు, రేషన్లతో సరిపుచ్చుకునేది కాదు. కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేషన్, డిజిటల్ ఇన్నొవేషన్‌లు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్నాయి. దేశం ముందుకు వెళ్లాలంటే యువతను గ్లోబల్ స్కిల్స్‌తో సిద్ధం చేయడం అత్యవసరం. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నాయకుల విధానాలను చాట్ జీపీటీ విశ్లేషించింది. . అభివృద్ధి, సంక్షేమం, ఐటీ, విద్య వంటి రంగాల్లో వారి విధానాలు భిన్నంగా ఉన్నా, 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడంలో ఎవరి విజన్ ఎంతవరకు ఉందని ఏఐ ‘చాట్ జీపీటీ’ని ప్రశ్నించగా అది ఆసక్తికర సమాధానాన్ని విశ్లేషణను అందించింది. చాట్ జీపీటీ విశ్లేషణ ఎలా ఉందో తెలుసుకుందాం.
-చంద్రబాబు నాయుడు.. విజన్ విత్ టెక్నాలజీ
చంద్రబాబు నాయుడుకు టెక్నాలజీ పట్ల ఉన్న విజన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చిన ఘనత ఆయనకు దక్కుతుంది. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, విశాఖను ఫిన్‌టెక్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనులు ప్రారంభమయ్యాయి. AI స్కిలింగ్ సెంటర్లు, గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు తిరిగి ఊపందుకున్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగు యువత, ఇంజనీర్లు మాత్రం "బాబు వద్దే గ్లోబల్ దృష్టికోణం ఉంది" అని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తు అవసరాలను ముందుగానే గుర్తించి, దానికి తగ్గ ప్రణాళికలు రచించడంలో చంద్రబాబుకు ఉన్న పట్టు యువతకు అనుకూలంగా మారుతుందన్నది చాట్ జీపీటీ వాదన.
- కేసీఆర్.. స్టార్టప్‌లు, ఐటీ, మెట్రో గ్లామర్
తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లోని ఐటీ, స్టార్టప్ రంగాలు విస్తృతంగా వృద్ధి చెందాయి. టీ-హబ్ , టాస్క్, AI మిషన్ తెలంగాణ వంటి కార్యక్రమాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అమెరికా, యూరప్‌లోని టెక్ కంపెనీలు హైదరాబాద్‌ను తమ పెట్టుబడులకు ఎంపిక చేసుకోవడం కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది పాలనలో తీసుకున్న గణనీయమైన నిర్ణయాల ఫలితం. అయితే, ఈ వృద్ధి ఎక్కువగా పట్టణ కేంద్రాలకే పరిమితమవుతోందన్న విమర్శ ఉంది. గ్రామీణ యువతకు మాత్రం ఈ ప్రయోజనాలు తక్కువగానే కనిపిస్తున్నాయని చాట్ జీపీటీ ఆందోళన వ్యక్తం చేసింది.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఐటీ రంగంలో వృద్ధి అసమానతలు తెలంగాణలో ఒక సవాలుగా నిలుస్తున్నాయని చాట్ జీపీటీ తెలిపింది..
-జగన్ మోహన్ రెడ్డి.. సంక్షేమంపైనే ఫోకస్, స్కిల్స్‌కు గ్యాప్
జగన్ పాలనలో వైఎస్సార్ చేయూత, వాలంటీర్లు, అమ్మఒడి వంటి సంక్షేమ పథకాలు గ్రామీణ, పేద ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. విద్యను ఉచితంగా అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి ప్రయత్నాలు ప్రశంసనీయం. అయితే, డిజిటల్ జాబ్స్, టెక్ స్కిల్స్, ఇన్నొవేషన్ ఎకోసిస్టంపై దృష్టి సారించడంలో కొంత వెనుకబడి ఉన్నారని చాట్ జీపీటీ అభిప్రాయపడింది. యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ, ఐటీ ఉద్యోగాల్లో అవకాశం లేని స్థితిలో ఉన్నారనే ఆందోళన జగన్ పాలనలో వ్యక్తమైంది. సంక్షేమం ముఖ్యమైనదే అయినా, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంపై మరింత దృష్టి సారించాలనేది చాట్ జీపీటీ కోరిక.
-ఎవరు నిజంగా యువత భవిష్యత్తును మారుస్తున్నారు?
చంద్రబాబు: భవిష్యత్తు అవసరాలను ముందే అర్థం చేసుకుని, AI, ఫిన్ టెక్, డిజిటల్ స్కిల్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టే నాయకుడు.
కేసీఆర్ / కేటీఆర్: ఇప్పటికే హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ నెట్‌వర్క్‌లో స్థిరం చేసిన నాయకత్వం.
జగన్: పేదలకు విద్య, సంక్షేమం అందించినా, టెక్-ఫోకస్, నైపుణ్యాల పెంపుదలలో వెనుకబడిన పాలన.
ఈ మూడు అభిప్రాయాలను చాట్ జీపీటీ క్లుప్తంగా వ్యక్తపరిచింది.
చాట్ జీపీటీ ఎన్ని వివరణలు, విశ్లేషణలు ఇచ్చినా కూడా.. పాలకులు ఎవరనేది ముఖ్యం కాదు, వారి విజన్, దాని అమలు తీరు, యువతకు అందే ప్రత్యక్ష ప్రయోజనం ఎంత అన్నదే అసలైన విషయం. అసెంబ్లీలో ఎవరు పెద్దగా అరిచారనే దానికంటే, యువతను ఎవరు నిశ్శబ్దంగా భవిష్యత్ ప్రపంచానికి సిద్ధం చేస్తున్నారో మనం గమనించాలి. AI, డిజిటలైజేషన్, గ్లోబల్ మార్కెట్లు... ఇవన్నీ కొత్త శక్తులుగా మారుతున్న ఈ కాలంలో పాలకుడు ముందుచూపుతో ఉండాలి, దానిని సమర్థవంతంగా అమలు చేయగలగాలి . ఇప్పుడు యువత అడగాల్సిన ప్రశ్న "నా భవిష్యత్తు కోసం నా ఈ రోజు ఎవరు సిద్ధం చేస్తున్నారు?" అని.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే తెలుగు రాష్ట్రాల యువత నిజమైన పురోగతిని సాధించగలదు.
