Begin typing your search above and press return to search.

మంత్రులకు ఆగస్టు గండం...రఘురామకు కిరీటం ?

కానీ కొందరు మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విధంగా సంతృప్తికరంగా లేరు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 July 2025 11:00 PM IST
మంత్రులకు ఆగస్టు గండం...రఘురామకు కిరీటం ?
X

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయి పదమూడు నెలలు పూర్తి అయ్యాయి. అయితే ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ కూర్పులో కొత్త ప్రయోగం చేశారు. సీనియర్లను కాదని జూనియర్లకు చాన్స్ ఇచ్చారు. మరో వైపు చూస్తే చాలా మంది మంత్రులు పనితీరు మార్చుకోవడం లేదు. ఏడాది పై దాటినా ప్రభుత్వ లక్ష్యాలు అవసరాలు ప్రాధాన్యతలు గురించి పూర్తిగా ఎక్సర్ సైజ్ చేయడం లేదు అని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

మంత్రులు అంటే స్టేట్ వైడ్ ఫోకస్ ఉండాలి, ఇంచార్జి హోదాలో జిల్లాలను నడిపించాలి. అటు అభివృద్ధి సంక్షేమం కో ఆర్డినేట్ చేయాలి. విపక్షాన్ని ఎక్కడికక్కడ చెక్ పెడుతూ ముందుకు సాగాలి. ఎత్తులు రాజకీయ వ్యూహాలలో అగ్ర భాగాన ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలీ అంటే పై స్థాయిలో చంద్రబాబు ఎంతలా కష్టపడుతున్నారో అది గ్రౌండ్ లెవెల్ దాకా రీచ్ అయ్యేలా మంత్రులు ముఖ్య పాత్ర పోషించాలి.

కానీ కొందరు మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విధంగా సంతృప్తికరంగా లేరు అని అంటున్నారు. పనితీరు మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా కూడా మంత్రులు కొందరి వైఖరిలో మార్పు లేదు. ఇలాగైతే పాలన కష్టమే అన్న భావన కూడా పెద్దలలో ఏర్పడుతోంది. అంతే కాదు విపక్షానికి ఒక్కసారి ఎదిగేందుకు చాన్స్ ఇస్తే ఇక ఇబ్బంది స్టార్ట్ అవుతుందని కూడా లెక్క వేస్తున్నారు.

దీంతోనే మంత్రులకు పదే పదే హెచ్చరికలు చేస్తూ వస్తున్నరు. మరాలని దిశా నిర్దేశం కూడా చేశారు. అయితే ఇప్పటికీ మారని వారి విషయంలో వేటు తప్పదని అంటున్నారు. ఉన్న కొద్దీ నష్టమే తప్ప మరేమీ లేదని ఒక కృత నిశ్చయానికి చంద్రబాబు వచ్చారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కూటమి మంత్రివర్గంలో భారీ మార్పు చేర్పులకు చంద్రబాబు సిద్ధపడుతున్నారని అంటున్నారు.

ఇక దీనికి సంబంధించి ముహూర్తం కూడా నిర్ణయించేశారు అని అంటున్నారు. దానికి శ్రావణమాసం చక్కని శుభ సమయంగా కూడా భావిస్తున్నారుట. ఇక ఆంగ్ల ఏడాదిలో చూస్తే కనుక ఆగస్టు 8 నుంచి 15ల మధ్యలో మంచి ముహూర్తం ఉందని ఆ సమయంలో ఎపుడైనా మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు.

ఇక ఏకంగా ఆరు నుంచి ఎనిమిది మంత్రి ప్రస్తుత మంత్రులు అవుట్ అవుతారని అంటున్నారు. ఈ మంత్రులలో ఒక్క ఉత్తరాంధ్రా నుంచే ముగ్గురు ఉంటారని చెబుతున్నారు. వారి ప్లేస్ లో సీనియర్ నేతలు అయిన కిమిడి కళా వెంకటరావు, కొణతాల రామకృష్ణ, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ లకు చాన్స్ ఇస్తారని అంటున్నారు.

అలాగే జనసేన నుంచి కందుల దుర్గేష్ ని తప్పిస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది. నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అలాగే బీజేపీ కి ఒక మంత్రి పదవిని ఖాయం చేశారు అని అంటున్నారు. గోదావరి జిల్లాలలో మంత్రి సుభాష్ ని తప్పిస్తున్నారు అని అంటున్నారు అలాగే ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామ క్రిష్ణంరాజుకు మంత్రిగా బంపర్ ఆఫర్ ఇస్తున్నారు అని అంటున్నారు మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేదు. ఆ లోటు రఘురామతో తీరుస్తారు అని అంటున్నారు.

అదే విధంగా డిప్యూటీ స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమిస్తారు అని అంటున్నారు. ఇక నెల్లూరు జిల్లా నుంచి ప్రశాంతి రెడ్డికి చాన్స్ దక్కుతుందని చెబుతున్నారు. అలాగే రాయలసీమ నుంచి ఒక మంత్రిని తీసేసి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డికి మంత్రిగా అవకాశం ఇస్తారు అని చెబుతున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. అయితే ఒక మంత్రిని తప్పించి ఆయన ప్లేస్ లో మరో సీనియర్ కి చాన్స్ ఇస్తారు అని అంటున్నారు.

ఇక కూటమి ప్రభుత్వంలో ఎనిమిది మంత్రుల దాకా అవుట్ అవుతారని చెబుతున్నారు. మిగిలిన వారి విషయం తీసుకుంటే కనుక వారి శాఖలలో భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా చాలా మంది మంత్రులకు ఆగస్టు గండం పొంచి ఉందని అంటున్నారు. అదే టైం లో సీనియర్లకు పెద్ద పీట వేసేలా కూర్పు ఉంటుందని అంటున్నారు.