Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్‌లో మ‌రో వికెట్ డౌటేనా? సీఎంను క‌లిసిన ఎమ్మెల్యే

కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ కారుకు.. ఇబ్బందులు మ‌రింత‌గా పెరుగుతున్నాయి

By:  Tupaki Desk   |   3 March 2024 8:34 AM GMT
బీఆర్ఎస్‌లో మ‌రో వికెట్ డౌటేనా?  సీఎంను క‌లిసిన ఎమ్మెల్యే
X

కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ కారుకు.. ఇబ్బందులు మ‌రింత‌గా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు దృష్టి సారించిన విషయం తెలిసిందే. కొంద‌రు మాజీలు ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ కండువా కూడా క‌ప్పేసుకున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా మ‌రో ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావు కూడా బీఆర్ ఎస్‌కు దూర‌మ‌య్యే ప‌రిస్తితి క‌నిపిస్తోంది. తాజాగా ఆయ‌న సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. స‌కుటుంబ స‌మేతంగా సీఎం నివాసానికి వ‌చ్చిన తెల్లం.. అభివృద్ధి ప‌నుల కోస‌మే వ‌చ్చిన‌ట్టు అంద‌రూ చెప్పే మాట‌ల‌నే చెప్పారు.

భద్రాచలం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ టికెట్‌పై గెలిచిన తెల్లం వెంకటరావు.. కొన్నాళ్లుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈయ‌న మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డికి స‌న్నిహితుడ‌నే పేరుంది. ఎన్నిక‌ల వేళ ఆయ‌న‌కు ఫండింగ్ చేశార‌నే టాక్ కూడా వినిపించింది. ఇప్పుడు అదే పొంగులేటిని వెంట‌బెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డిని కల‌వ‌డం.. ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇలా ఆయన సీఎంను కలవడం ఇది రెండోసారి.

గతంలో బీఆర్ ఎస్‌లోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కానీ, కాంగ్రెస్‌లో ఆయనకు సీటు దక్కలే దు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరి టికెట్ దక్కించుకొని గెలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోకవర్గాలు ఉండగా.. భద్రాచలంలో మాత్రమే బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది.

కొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని రెండోసారి కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పార్లమెంటు ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే ఇతర పార్టీల నుంచి చేరికలు ప్రారంభం అయ్యాయి. తాజాగా అందుకే తెల్లం వెంకట్రావు కూడా చేరిపోయే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.మ‌రోవైపు.. ఎవ‌రు పోయినా ఫ‌ర్వాలేద‌న్న‌ట్టుగామాజీ మంత్రి కేటీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.