Begin typing your search above and press return to search.

కొత్త మంత్రుల జాబితా విడుదల... భట్టికి డిప్యూటీ కన్ ఫాం!

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.

By:  Tupaki Desk   |   7 Dec 2023 5:16 AM GMT
కొత్త మంత్రుల జాబితా విడుదల... భట్టికి డిప్యూటీ కన్  ఫాం!
X

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ సమయంలో ఆయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలుస్తుంది.

అవును... తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తోపాటు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలుస్తుంది! ఇదే సమయంలో వీరితో పాటు మంత్రులుగా ఉత్తం కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్‌ బాబు, దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, సుదర్శన్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

ఇలా మంత్రులుగా ఎంపికైన వారందరికీ రేవంత్ రెడ్డే స్వయంగా ఫోన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో ప్రమాణస్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎం హోదాలో తొలి సంతకం ఆరు గ్యారెంటీల అమలుపైనే చేయబోతున్నారని అంటున్నారు.

మరొపక్క ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ సమయంలో... వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. మరి కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకోనున్నారు