Begin typing your search above and press return to search.

తెలంగాణ ఓటర్ల సెంటిమెంట్ ను సెటిలర్లు ఫాలో కాలేదా?

ఇదంతా చూసినప్పుడు.. బీఆర్ఎస్ అధిక్యతలో ఉన్న 39 స్థానాల్లో 14 స్థానాలు గ్రేటర్ నుంచి వచ్చినవి కావటం గమనార్హం

By:  Tupaki Desk   |   3 Dec 2023 8:43 AM GMT
తెలంగాణ ఓటర్ల సెంటిమెంట్ ను సెటిలర్లు ఫాలో కాలేదా?
X

అందరు ఒకదారిలో ఉంటే.. తెలంగాణలో సెటిల్ అయిన సెటిలర్లు మాత్రం మరోవైపు ఉంటారన్న వాదన మరోసారి నిజమైందా? అంటే.. అవుననే మాట వినిపిస్తోంది. తాజాగా వెల్లడైన ఫలితాల్ని చూస్తున్నప్పుడు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి తెలంగాణలో మొత్తం 119 స్థానాల్లో అధికార బీఆర్ఎస్ 39 స్థానాల్లో అధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ నాలుగుస్థానాల్లో విజయం సాధించింది. మరో 60స్థానాల్లో అధిక్యతలో ఉంది. బీజేపీ పది స్థానాల్లో అధిక్యతలో ఉండగా.. మజ్లిస్ ఒక స్థానంలో విజయం సాధించగా.. నాలుగు స్థానాల్లో అధిక్యతలో ఉంది. ఒక స్థానంలో ఇతరులు ఉన్నారు.

ఇదంతా చూసినప్పుడు.. బీఆర్ఎస్ అధిక్యతలో ఉన్న 39 స్థానాల్లో 14 స్థానాలు గ్రేటర్ నుంచి వచ్చినవి కావటం గమనార్హం. అంతేకాదు.. ఉమ్మడి.. రంగారెడ్డి.. మెదక్ జిల్లాల్లోనూ ఎక్కువ స్థానాలు వచ్చిన పరిస్థితి.మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా.. గ్రేటర్ పరిధిలోని 14 నియోజకవర్గాల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో సెటిలర్లే ఎక్కువగా ఉండటం తెలిసిందే. ఇదంతా చూస్తే.. సెటిలర్లు అధికార బీఆర్ఎస్ కు అండగా నిలిస్తే.. తెలంగాణ ప్రజలు మాత్రం కాంగ్రెస్ కు తోడుగా నిలిచారు.

మరో లెక్కలో చూసినప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఊపు ఎక్కువగా ఉన్న చోట బీఆర్ఎస్ విజయం సాధిస్తే.. తెలంగాణవాదం ఎక్కువగా వినిపించే ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ కు పట్టం కట్టిన వైనం కనిపించకమానదు. ఈ ఎన్నికల ఫలితాల్ని చూసినప్పుడు.. తెలంగాణ ఓటర్లకు సెటిలర్ల ఓటర్లకు మధ్య సెంటిమెంట్ సింక్ కాదన్నది విషయం మరోసారి నిరూపితమైందని చెప్పాలి. మొత్తంగా తెలంగాణ ఓటర్లు మొత్తం ఒకవైపు నిలిస్తే.. సెటిలర్లు ప్రభావం చూపే నియోజకవర్గాల్లో మరోలాంటి ఫలితం రావటం ఆసక్తికరంగా మారింది.

అయితే.. ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పెద్దగా బలంగా లేకపోవటం.. ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువమంది గెలుపు ధీమాలోకి వెళ్లిపోయి.. డబ్బులు ఖర్చు విషయంలోనూ వెనకడుగు వేయటం కూడా ఒక కారణంగా చెప్పాలి. దీనికి తోడు.. గ్రేటర్ పరిధిలోని ఎక్కువ నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్ల చీలిక కూడా కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందని చెప్పాలి.