Begin typing your search above and press return to search.

2023 పొలిటికల్ బ్యూటీ : కాంగ్రెస్ కి తెలంగాణా సింహాసనం...!

దక్షిణాదిన ఈ రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ కి అత్యంత కీలకమైనవి అని వేరేగా చెప్పాల్సిన అవసరం ఏవరికీ లేదు

By:  Tupaki Desk   |   1 Jan 2024 1:30 AM GMT
2023 పొలిటికల్ బ్యూటీ :  కాంగ్రెస్ కి తెలంగాణా సింహాసనం...!
X

తెలుగు రాజకీయాల్లో 2023 కి ఒక పేజి ఉంది అనిపించుకుంది. మొత్తం రాజకీయ చరిత్రలో ఈ పేజీ ఎపుడూ గుర్తుకు వచ్చేలా నమోదు చేసి వెళ్తోంది 2023 సంవత్సరం. నిజానికి చూస్తే 2023 అంతా ఉల్టా పుల్టాగానే సాగింది. దేశంలో కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్ కి తీపి దక్కితే మరికొన్ని చోట్ల చేదు దక్కింది.

ఇక తెలుగు రాజకీయాలను కీలక మలుపు తిప్పి 2023 కనుమరుగు కాబోతోంది మరీ ముఖ్యంగా తీసుకుంటే 138 ఏళ్ళ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ కి 2023 తెలంగాణా కర్నాటక బహుమతులుగా దక్కాయి. దక్షిణాదిన ఈ రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ కి అత్యంత కీలకమైనవి అని వేరేగా చెప్పాల్సిన అవసరం ఏవరికీ లేదు

ఇదిలా ఉంటే తెలంగాణాను 2014లో కాంగ్రెస్ యూపీయే ప్రభుత్వానికి సారాధ్యం వహిస్తూ అందించింది. అయితే అపుడు మాత్రం కాంగ్రెస్ కి ప్రజలు విజయం అందించలేదు. ఆ తరువాత రెండు సార్లు కాంగ్రెస్ ని ఓడించారు. కానీ 2023 మాత్రం కాంగ్రెస్ కి తెలంగాణా సింహాసనాన్ని అప్పగించడం ద్వారా మేలి మలుపు తిప్పారు.

ఆ విజయం కూడా ఆషామాషీ కానే కాదు, బీఆర్ఎస్ అనే పటిష్టమైన పార్టీ దానికి అధినాయకుడిగా కె చంద్రశేఖరరావు ఉన్నారు. ఆయన రాజకీయ చాతుర్యాన్ని ఎవరూ ఎపుడూ తక్కువగా అంచనా వేయలేదు. ఆయన అపర చాణక్యాన్ని సైతం ఒంటి చేత్తే నెట్టేసి కాంగ్రెస్ అధికారం అందుకోవడమే 2023 అందిచంచిన పొలిటికల్ బ్యూటీగా చెప్పుకోవాలని అంటున్నారు.

కేసీఆర్ ఏకంగా పదేళ్ల పాటు ఎదురులేకుండా పాలించారు. తనదైన శైలిలో ఆయన తెలంగాణాను రూల్ చేశారు. బీఆర్ఎస్ ఓడుతుందని కానీ కేసీఆర్ ఓడిపోతారు అని కానీ ఎవరూ నమ్మలేని పరిస్థితి ఉంది. అలా ఆయన రాజకీయ బాహుబలిని తాను అనిపించారు. అదే విధంగా కాంగ్రెస్ పరిస్థితి కూడా ఆరేడు నెలల ముందు దాకా సాదా సీదాగానే ఉంది.

బీఆర్ ఎస్ ని దించేసి తాము గద్దెనెక్కుతామని బీజేపీ ఉరకలు వేసింది. అయితే తెలంగాణా రాజకీయం ఉప ఎన్నికల వేళ బీజేపీ వైపు మొగ్గింది. దాంతో బీఆర్ ఎస్ కి బీజేపీయే ఆల్టర్నేషన్ అని అంతా అనుకున్నారు. కానీ భారీ ట్విస్ట్ మాత్రం 2023 ఎండింగ్ లో ఇచ్చేసింది.

అలా కాంగ్రెస్ వాయువేగంతో దూసుకుని వచ్చింది. అంతే వేగంతో బీజేపీ వెనక్కి పోయింది. ఏ విధంగా చూసినా కూడా 2023 రిమార్కబుల్ ఇయర్ గానే తెలంగాణా రాజకీయాల్లో ఉందని చెప్పాలి. ఇక కాంగ్రెస్ గెలుపు వెనక మొత్తం క్రెడిట్ ని రేవంత్ రెడ్డికి ఇవ్వవచ్చు అని అంటున్నారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన తీరు జనాలతో కనెక్ట్ అయిన విధానం. ఆయన రాజకీయ వ్యూహాలు అందరినీ కలుపుకుని పోయే వైఖరి ప్రత్యేకించి తెలంగాణా ప్రజలలో కేసీఆర్ కి ధీటైన నేత అనిపించేలా ఆయన కలుగచేసిన నమ్మకం ఇవన్నీ కలసి కాంగ్రెస్ కి కుర్చీని అందించాయని చెప్పాల్సి ఉంది.

తెలంగాణా సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ పోటీ చూస్తే బీఆర్ఎస్ బీజేపీల మధ్యన నువ్వా నేనా అన్నట్లుగానే సాగింది. ఒక దశలో అయితే కాంగ్రెస్ తెలంగాణా ఎన్నికల రేసు నుంచి తప్పుకుందా అనిపించేసింది. కానీ అలాంటి పరిస్థితి నుంచి పడి లేచిన కడలి తరంగం మాదిరిగా కాంగ్రెస్ ని పరుగులెత్తించి విజయం దిశగా తీసుకెళ్ళిన ఘనత మాత్రం రేవంత్ రెడ్డిదే అని అంటున్నారు అంతా.

ఇక దానికి ముందు కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకమైన వర్కింగ్ కమిటీ సమావేశాలు సెప్టెంబర్ 16, 17 తేదీలలో తెలంగాణాలో జరగడం, సోనియా నాడు హైదరాబాద్ లో ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రసంగం ఆ పార్టీ ఇచ్చిన వరాలు ఇవన్నీ కూడా బాగా వర్క్ చేశాయి. ఇక బీజేపీ అయితే చివరాఖరులో బండి సంజయ్ ని మార్చేసి విఫల ప్రయోగం చేసి చేతులు కాల్చుకుంది అని అంటున్నారు.

మరో వైపు అధికార బీఆర్ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు జూపల్లి క్రిష్ణా రావు వంటి వారు ఇతర సీనియర్ నాయకులు అంతా బయటకు రావడం ద్వారా గులాబీ పార్టీకి సెగ పుట్టించేశారు. ఓవరాల్ గా చూసుకుంటే బీఆర్ ఎస్ ఓటమిని సవాలక్ష కారణాలు ఉన్నాయి అదే టైం లో కాంగ్రెస్ గెలుపుకు ఎన్నో రీజన్స్ అనుకున్నా రేవంత్ రెడ్డి ఇమేజ్ మాత్రం గట్టిగా పనిచేసింది. కేసీఆర్ ని ఓడించిన నేతగా రేవంత్ రెడ్డి అయితే హిస్టరీనే క్రియేట్ చేశారు. అలా 2023 మెమరబుల్ ఇయర్ గా ఉండిపోతోంది.