Begin typing your search above and press return to search.

వ‌రుస మేనిఫెస్టోలు.. తెలంగాణ ఉక్కిరి బిక్కిరి.. బీఎస్పీ హామీలు ఇవే!

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌.. తాజాగా బీఎస్పీ మేనిఫెస్టోను విడుద‌ల చేశారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 10:29 AM GMT
వ‌రుస మేనిఫెస్టోలు.. తెలంగాణ ఉక్కిరి బిక్కిరి.. బీఎస్పీ హామీలు ఇవే!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి మ‌రింత పెరిగింది. ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. విడ‌త‌ల వారీగా కాంగ్రెస్ పార్టీ జాబితాలు విడుద‌ల చేస్తుండ‌గా.. ఇప్ప‌టికే బీఆర్ ఎస్ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్‌.. అభ్య‌ర్థుల‌కు బీఫారాలు కూడా ఇస్తున్నారు. ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో చోటా పార్టీగా గుర్తింపు ఉన్న బీఎస్పీ(బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ) కూడా ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టింది. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఎలా ఉన్నా.. తాజాగా మేనిఫెస్టో ప్ర‌క‌టించింది.

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌.. తాజాగా బీఎస్పీ మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా మీడియాకు ఈ మేనిఫెస్టోపై వివ‌రా/ అందించారు. ప్ర‌ధానంగా రైతులు, విద్యార్థులు, యువ‌త‌ను కార్న‌ర్ చేసుకున్న‌ట్టుగా ఈ మేనిఫెస్టో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇత‌మిత్థంగా ఇంత అని ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయినా బ‌హుజ‌న రైతు ధీమా పేరిట‌..(రైతు బంధు త‌ర‌హాలో) వారికి ఆర్థిక సాయం చేస్తామ‌ని తెలిపారు.

ఇక‌, కాన్సీరామ్ యువ స‌ర్కారు ఏర్పాటు చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు. ఫూలే విద్యాదీవెన కింద విద్యార్థుల‌ను అన్ని విధాలా ఆదుకుంటామ‌న్నారు. ప్ర‌స్తుతం అమ‌ల‌వుతున్న ధ‌ర‌ణి త‌ర‌హాలో బీఎస్పీ కూడా మ‌రో కార్య‌క్ర‌మాన్ని తెర‌మీదికి తెచ్చింది. దీనికి దొడ్డి కొమ‌ర‌య్య భూహ‌క్కు పేరు పెట్టింది. దీనిని కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇక‌, ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలో కీల‌క హామీలు ఇవీ..

1 ) కాన్షీరామ్‌ యువ సర్కార్

2 ) బహుజన రైతు ధీమా

3 ) ఫూలే విద్యా దీవెన

4 ) బ్లూ జాబ్ కార్డు

5) దొడ్డి కొమరాయ్య భూమి హక్కు

6 ) నూరేళ్లు ఆరోగ్య ధీమా

7 ) చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి

8 ) వలస కార్మికుల‌ సంక్షేమ నిధి

9 ) భీమ్ రక్షణ కేంద్రం

10 ) షేక్ బందగీ గృహ భరోసా