Begin typing your search above and press return to search.

కూరగాయల్ని కొంటున్నారా? టీహైకోర్టు తాజా వ్యాఖ్యలు విన్నారా?

నిత్యవసరాల్లో భాగంగా కూరగాయల్ని కొనేయటం రోజువారీ జీవితంలో భాగం. అయితే.. ఇలా కూరగాయలు కొనే ముందు

By:  Tupaki Desk   |   20 March 2024 4:20 AM GMT
కూరగాయల్ని కొంటున్నారా? టీహైకోర్టు తాజా వ్యాఖ్యలు విన్నారా?
X

నిత్యవసరాల్లో భాగంగా కూరగాయల్ని కొనేయటం రోజువారీ జీవితంలో భాగం. అయితే.. ఇలా కూరగాయలు కొనే ముందు.. వాటిని ఎక్కడ పండించారు? ఎలాంటి నీటితో వాటిని పండించారు? అన్నది కూడా కీలకమే. తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు చెరువులు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఇలాంటిచోట్లే కూరగాయలు.. ఆకు కూరల్ని పండించటాన్ని టీహైకోర్టు ప్రశ్నించింది. తక్షణమే కాలుష్యానికి నకళ్లుగా మారిన చెరువు నీటితో కూరగాయలు.. ఆకు కూరలు పండించటాన్ని అడ్డుకోవాలన్నారు. కాలుష్యంతో నిండిన చెరవులోని నీటితో పండించే కూరగాయలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయని.. అందువల్ల అలాంటివి మార్కెట్ లోకి రాకుండా అడ్డుకోవాలని పేర్కొంది.

హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల దుస్థితిపై అడ్వొకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని సూచనల అమలుకు నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఎఫ్ టీఎల్ ను నిర్దారించటం.. ఆక్రమణలను తొలగించటం.. చెరువుల్లోకి మురుగునీటి సరఫరాను అడ్డుకోవటం.. ఫెన్సింగ్.. సీసీ కెమెరాల ఏర్పాటు లాంటి చర్యలు చేప్టటాలని పేర్కొంది.

హైకోర్టుకు సమర్పించిన తాజా నివేదికలో చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని.. చెరువుల్లో చెత్తాచెదారం.. మురుగునీరు దుర్గందభరింతగా.. ప్రమాదకరంగా మారాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ మురుగునీటితో పండించే ఆకుకూరలు.. కూరగాయలతో పాటు చేపలు వినియోగిస్తున్న ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొంది. వ్యర్థాలు.. పూడికతీతపైనా ఫోకస్ పెంచాలని పేర్కొంది. చెరువులు.. కాలుష్యం.. ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు తదితర కేసుల సత్వర పరిష్కారం కోసం హైకోర్టు పరిధిలో గ్రీన్ బెంచ్ ఏర్పాటు చేయాలన్న అంశం తెర మీదకు వచ్చింది. నిజంగానే ఈ తరహా నిర్ణయం తీసుకుంటే.. పర్యావరణ పరిరక్షణకు.. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై త్వరగా నిర్ణయాలు తీసుకునే వీలుందని చెప్పాలి. తాజాగా టీహైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మురుగునీటితో పండించే కూరగాయల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.