Begin typing your search above and press return to search.

కేసీఆర్ కి ఇంకా పట్టుపోలేదక్కడ ?

ఇక పోతే కేసీఆర్ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జాబ్ హోల్డర్స్ ని గుండెలలో పెట్టుకుని చూసుకున్నారు

By:  Tupaki Desk   |   10 July 2024 3:54 AM GMT
కేసీఆర్ కి ఇంకా పట్టుపోలేదక్కడ ?
X

తెలంగాణా ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టం సకల జనుల సమ్మె. ఆ సమ్మెలో ఉద్యోగస్తులు జాబ్ హోల్డర్స్ పెన్ డౌన్ ప్రకటించి నిరసనలు తెలపడం తెలంగాణా రాష్ట్రం రావడానికి అత్యంత కీలకమైన భూమికగా మారింది. నిజానికి అదొక చారిత్రాత్మక ఘట్టంగా కూడా అభివర్ణిస్తారు.

ఇక పోతే కేసీఆర్ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జాబ్ హోల్డర్స్ ని గుండెలలో పెట్టుకుని చూసుకున్నారు. వాళ్ళు రూపాయి ఇంక్రిమెంట్ అడిగితే రెండు రూపాయలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే జాబ్ హోల్డర్స్ సంఘాలలో కూడా బీఆర్ఎస్ కి మంచి పట్టు ఉంది.

ముఖ్యంగా విద్యుత్ శాఖలో బీఆర్ఎస్ కి అనుకూలమైన ఎంప్లాయీస్ కేసీఆర్ ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక విద్యుత్ శాఖ అంటేనే పవర్ ఫుల్ శాఖ. దాంతో ఎంతో మంది ఎంప్లాయీస్ తన పవర్ ని చూపిస్తూ కావాలనే పవర్ కట్స్ చేస్తూ బీఅర్ఎస్ నాయకులకు సమాచారం అక్కడిది ఎప్పటికప్పుడు ఇస్తున్నారు అని అంటున్నారు. ఇక వాటిని సోషల్ మీడియాలో పోస్టులుగా పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నారు అని అంటున్నారు.

అయితే ఈ విషయాలు అన్నీ కాంగ్రెస్ పెద్దలకూ తెలుసు అని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా సార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు అని కూడా గుర్తు చేసుకుంటున్నారు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి అని అంటున్నారు. ఉద్యోగులతో పెట్టుకుంటే నష్టం తప్ప లాభం లేదు. వారిని సామరస్యంగానే దారికి తెచ్చుకోవాల్సి ఉంది అని అంటున్నారు.

కేవలం విద్యుత్ శాఖ మాత్రమే కాదు కీలకమైన అనేక ప్రభుత్వ శాఖలలో సైతం బీఆర్ఎస్ కి పట్టు ఉంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులను దారికి తెచ్చుకోవడం ఎలా అన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉన్న బిగ్ టాస్క్ అని అంటున్నారు. వారిని అదిలించో బెదిరించో చేయాలనుకుంటే అది ఇంకా బిర్ర బిగుసుకుని పోయేలా చేస్తుంది.

అదే టైంలో వారిని కాంగ్రెస్ ప్రభుత్వం తన విధానాలతో మెప్పించాలి ఒప్పించాలి అని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికలు ఒక ఉదాహరణ అని కూడా గుర్తు చేస్తున్నారు. జగన్ ఉద్యోగులతో పెట్టుకుంటేనే 11 సీట్లకు పరిమితమయ్యారని దారుణ ఓటమి వైసీపీకి సంభవించిందని గుర్తు చేస్తున్నారు.

అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రో ఎంప్లాయీస్ విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. వారి సమస్యలను సానుకూలంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాది అన్న భరోసా వారికి కల్పిస్తే కచ్చితంగా ఉద్యోగులు టర్న్ అవుతారని అంటున్నారు. ఏది ఏమైనా ఇది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఉద్యోగుల తాజా వైఖరి గురించి తెలిసినా ఏమీ బాహాటంగా చేయలేరు. దాంతో వారిని లాలించి ఆదరించి మాత్రమే దగ్గరకు చేర్చుకోవాలని అంటున్నారు. సో ఇది రేవంత్ రెడ్డి నేర్పరితనానికి నైపుణ్యానికీ కూడా ఒక కఠిన పరీక్షగానే చూడాలని అంటున్నారు.