Begin typing your search above and press return to search.

కామారెడ్డిలో కేసీఆర్ కు రేవంత్ షాక్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్ది బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి

By:  Tupaki Desk   |   3 Dec 2023 6:36 AM GMT
కామారెడ్డిలో కేసీఆర్ కు రేవంత్ షాక్!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్ది బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుండడంతో గులాబీ శ్రేణులలో గుబులు మొదలైంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల కౌంటింగ్ పై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అనూహ్యంగా కామారెడ్డిలో కేసీఆర్ వెనుకంజలో ఉండగా...కామారెడ్డితోపాటు కొడంగల్ లో రేవంత్ రెడ్డి భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ పై కూడా రేవంత్ రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కొడంగల్ తో పాటుగా కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి లీడింగ్ లో కొనసాగుతున్నారు. దీంతో కేసీఆర్ కు షాక్ తగిలినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొడంగల్ లో నాలుగో రౌండ్ పూర్తి అయ్యే సరికి రేవంత్ రెడ్డి 10000 ఓట్ల ఆదిత్యంతో ఉన్నారు. కామారెడ్డిలో రేవంత్ 2300 ఓట్ల ఆదిత్యంతో కొనసాగుతున్నారు. ముఖ్యంగా గజ్వేల్ లో కేసీఆర్ కు స్వల్ప మెజారిటీ మాత్రమే లభిస్తున్న నేపద్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

గజ్వేల్ లో కేసీఆర్ పై బిజెపి నేత ఈటల రాజేందర్ తో పాటు కాంగ్రెస్ నేత తూముకుంట నర్సారెడ్డి పోటీ చేయడంతో ఓట్లు చీలే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం 1000 ఓట్ల మెజార్టీతోనే కేసీఆర్ ముందంజలో ఉండటంతో గులాబీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఈటల పోటు వల్ల కేసీఆర్ కు షాక్ తగిలే చాన్స్ ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.