Begin typing your search above and press return to search.

స్టైలిష్ లుక్ లో తెలంగాణ సీఎం... పిక్స్ వైరల్!

అప్పుడప్పుడూ జీన్స్, టీ షర్ట్ లోనూ మిలుక్కుమంటారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా.. ఇప్పుడు సీఎంగా ఉన్న కూడా రేవంత్ డ్రెస్సింగ్ స్టైల్లో మార్పూ లేదు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 5:13 PM GMT
స్టైలిష్  లుక్  లో  తెలంగాణ సీఎం... పిక్స్  వైరల్!
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా.. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూ.ఈ.ఎఫ్.)లో రేవంత్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా... డబ్ల్యూ.ఈ.ఎఫ్. ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా డిప్యూటీ పీఎం మెకోనెన్‌ లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ కొత్త లుక్ లో స్టైలిష్ గా కనిపించారు!


అవును... ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం "ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ" క్యాంపెయిన్ ను విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు.


ఈ సందర్భంగా రేవంత్ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. సాధారణంగా రేవంత్ రెడ్డి బ్లాక్ ఫ్యాంట్, వైట్ షర్ట్ లో కనిపిస్తుంటారు. అప్పుడప్పుడూ జీన్స్, టీ షర్ట్ లోనూ మిలుక్కుమంటారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా.. ఇప్పుడు సీఎంగా ఉన్న కూడా రేవంత్ డ్రెస్సింగ్ స్టైల్లో మార్పూ లేదు. చాలా సాధారణంగానే కనిపిస్తుంటారు. సీఎం అయినప్పటికీ సింపుల్ లుక్ లోనే కంటిన్యూ అవుతున్నారు.

అయితే తాజాగా దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ న్యూ లుక్ తో ఆకట్టుకున్నారు! ఇందులో భాగంగా... కూల్ బ్లేజర్‌ ని ధరించి స్టైలిష్ లుక్‌ లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఈ పిక్స్ ని నెట్టింట వైరల్ చేస్తున్నారు.

కాగా... దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్ర సామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, ఫలితంగా.. భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది.

ఇందులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ తో పాటు నిర్వాహకులు, ఇతర ప్రముఖులతోనూ తెలంగాణ చీఫ్ మినిస్టర్ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా... ఇథియోఫియా డిప్యూటీ ప్రధాన మంత్రి డెమెక్ హసెంటో తో సమావేశమై... పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్ పై చర్చించారు. ఇదే సమయంలో... అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ ప్రెసిడెంట్ శ్రీమతి దేబ్జానీ ఘోష్ తోనూ సమావేశమయ్యారు.