Begin typing your search above and press return to search.

టాప్పింగ్ టిల్లు... కేటీఆర్ పై బీజేపీ ట్రోలింగ్ వీడియో వైరల్!

ఈ క్రమంలో... నామినేషన్ల స్వీకరణ పూర్తవ్వడంతో ఇక అభ్యర్థులంతా ప్రచార కార్యక్రమాలపై దృష్టిసారించారు

By:  Tupaki Desk   |   27 April 2024 12:47 PM GMT
టాప్పింగ్ టిల్లు... కేటీఆర్ పై బీజేపీ ట్రోలింగ్ వీడియో వైరల్!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల సందడి పీక్స్ కి చేరుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందడికాగా.. ఏపీలో అటు లోక్ సభ, ఇటు శాసన సభ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ క్రమంలో... నామినేషన్ల స్వీకరణ పూర్తవ్వడంతో ఇక అభ్యర్థులంతా ప్రచార కార్యక్రమాలపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో... విమర్శలు ప్రతివిమర్శలతో హోరెత్తి పోతుంది రాజకీయ వాతావరణం.

పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బతో ఇబ్బందిపడుతున్న బీఆరెస్స్... లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బలంగా భావిస్తుంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటమి గాలివాటం కాదని నిరూపించుకోవడానికి లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుంది. మరోపక్క తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించాలని బీజేపీ స్కెచ్ చేస్తుంది.

ఈ సమయంలో ప్రత్యర్థులను విమర్శించడానికి, ఇరుకునపెట్టడానికి రకరకాల వ్యూహాలు అమలుచేస్తున్నారు. ఈ విషయంలో టెక్నాలజీని మాగ్జిమం క్యాష్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా... తాజాగా బీఅరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ బీజేపీ డీజే టిల్లు సాంగ్ తో ఒక ట్రోలింగ్ వీడియో చేసింది. ఈ సందర్భంగా... దానికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు!

అవును... "టాప్పింగ్ టిల్లు పేరు, గోడకున్న చెవులే వీడు.. ముచ్చట్లు పెట్టిర్రంటే, చాటు నుండి వినేస్తాడు!" అంటూ డీజే టిల్లు సినిమాలోని టైటిల్ సాంగ్ ని కేటీఆర్ పై ట్రోలింగ్ కి వాడుకుంది బీజేపీ. ఈ సందర్భంగా... కేటీఆర్ ని "ట్యాపింగ్ టిల్లు" అని ప్రస్థావించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో కింద కామెంట్స్ సెక్షన్స్ లో బీఅరెస్స్ వర్సెస్ బీజేపీ అంటూ భారీ వార్ నడుస్తుంది.