వావ్.. వాటే ఫ్యామిలీ: ఒక ఇల్లు.. ముగ్గురు సర్పంచ్ లు
పవర్ ఫుల్ హౌస్ అన్న మాట అప్పుడప్పుడు వింటుంటాం. ఈ ఇంటి గురించి తెలిస్తే.. అసలుసిసలు పవర్ ఉన్న హౌస్ గా అర్థమవుతుంది.
By: Tupaki Desk | 2 Dec 2025 10:50 AM ISTపవర్ ఫుల్ హౌస్ అన్న మాట అప్పుడప్పుడు వింటుంటాం. ఈ ఇంటి గురించి తెలిస్తే.. అసలుసిసలు పవర్ ఉన్న హౌస్ గా అర్థమవుతుంది. ఒకే ఇంట్లో ముగ్గురు సర్పంచ్ లు ఉండే ఆ ఇల్లు మిగిలిన చాలా ఇళ్లతో పోలిస్తే సోస్పెషల్ గా చెప్పాలి. నర్సంపేట మండల పరిధిలో ఉండే ఈ ఇల్లు ఇస్పెషల్ అని చెప్పక తప్పదు. నర్సంపేట మండలంలోని రాజేపేట గ్రామ పంచాయితీ 1970లలో ఏర్పడింది.
ఏజెన్సీ గ్రామమైన రాజుపేటకు ఇప్పటివరకు ఎనిమిదిసార్లు పంచాయితీ ఎన్నికలుజరిగితే.. ఇందులో ఒకే ఇంటి నుంచి ముగ్గురు సర్పంచులు పని చేయటం విశేషం. తల్లి.. కొడుకు.. కోడలు సర్పంచ్ లుగా వ్యవహరించారు. 2001లో కోడలు బానోతు కోమటి సర్పంచ్ గా ఎన్నికై 2006 వరకు పని చేశారు. ఆమె అత్త బానోతు మల్లమ్మ 2006 నుంచి 2011 వరకు సర్పంచ్ గా వ్యవహరించారు. 2019లో కొడుకు బానోతు దస్రు సర్పంచ్ గా గెలిచి.. 2024 వరకు వ్యవహరించారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గ్రామ సర్పంచ గా వ్యవహరించిన తీరు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వీరి గురించి మాట్లాడుకునేలా చేస్తుందని చెప్పాలి.
తెలంగాణలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా సర్పంచ్ గా పోటీ చేసేందుకు వీలుగా నెలకు రూ.32 వేల వరకు జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఎన్నికల బరిలోకి దిగటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. తెలంగాణ సాంస్క్రతిక శాఖ సారథి కళాకారుడిగా పని చేస్తున్న బరిగెల బాబు సర్పంచ్ గా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా కాంట్రాక్టు పద్దతిలో చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఈ మేరకు తెలంగాణ సాంస్క్రతి శాఖ కమిషనర్ కు తన రాజీనామా లేఖ రాశారు. ఆయన గ్రామం సర్పంచ్ గా ఎస్సీ రిజర్వు కావటంతో.. ఆయన పోటీలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉండగా.. బాబు రాజీనామాకు కమిషనర్ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మరి.. ఎన్నికల పోరులో ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తారో చూడాలి.
