Begin typing your search above and press return to search.

అచ్చం కేసీఆర్ లాగానే... ఆ క్ల‌బ్‌లో చేరిపోయిన రేవంత్‌రెడ్డి... !

తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే మాటలు ఒక్కోసారి కోటలు దాటిపోయేవి.

By:  Tupaki Desk   |   9 Jun 2025 9:47 AM IST
అచ్చం కేసీఆర్ లాగానే... ఆ క్ల‌బ్‌లో చేరిపోయిన రేవంత్‌రెడ్డి... !
X

తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే మాటలు ఒక్కోసారి కోటలు దాటిపోయేవి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎన్నో..! అందులో ఒకటి కరీంనగర్‌ను లండన్‌లా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కానీ ప‌దేళ్ల పాలనలో ఆ దిశగా ఆయన చేసింది ఏమీ లేదు. హైదరాబాదులోని ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ గా మారుస్తామని ప్రకటించారు. ఇది ఎంతవరకు జరిగిందో అందరికీ తెలిసిందే. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఆయన చెప్పిన పనుల్లో కొన్ని చేయలేకపోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాట‌లోనే ప్రయాణిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలే ఇస్తున్నారు.. ఎందుకంటే కెసిఆర్ ? చెప్పిన డైలాగులు.. చేసిన‌ ప్రకటనలు పదేపదే చేస్తున్నారు.

తాజాగా నల్గొండ జిల్లా తుర్కపల్లిలో పర్యటించిన రేవంత్ రెడ్డి అచ్చం కేసీఆర్ లాగే తెలంగాణ రాజధాని హైదరాబాదును న్యూయార్కులా, జపాన్ రాజధాని టోక్యోలా డెవలప్ చేస్తామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి గతంలోనూ ఇలాంటి మాటలు చెప్పారు. తమ పోటీ పొరుగు రాష్ట్రాలు ఆయన తమిళనాడు, కర్ణాటకతో కాదు ప్రపంచంతో పోటీ పడతామని గొప్పగా చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటని చూస్తే అప్పు పుట్టడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్న డబ్బులతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్.. డిఏలు ఇవ్వటానికి సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగమాగం అవుతున్న సంగతి తెలిసిందే. కానీ రేవంత్ రెడ్డి మాటలు మాత్రం కోట‌లు దాటేలా ఉన్నాయి అన్న విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

అంతే కాదు మొన్నటి ఎన్నికలలో గెలిచేందుకు ఇచ్చిన హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అమలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చూస్తే అసలు అవి అమలుకు నోచుకుంటాయా లేదో తెలియని పరిస్థితి. ఎన్నికలకు ముందే బిఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల‌ ఊగులోకి నెట్టేసింది అని విమర్శించి భారీ హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని అమలు చేయాలంటే చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి. కేసిఆర్ తన పదేళ్ల కాలంలో ఎలా అయితే బంగారు తెలంగాణ... ప్లాటినం తెలంగాణ అంటూ చెప్పుకుంటూ వెళ్లారో ? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫ్యూచర్ సిటీ , హైదరాబాద్‌ను న్యూయార్క్‌లా, టోక్యోలాగా మారుస్తా అంటూ చెప్పుకుంటూ కాలం గ‌డుపుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చేపట్టిన ఫ్యూచర్ సిటీ , మూసి ప్రక్షాళన ప్రాజెక్టులు ఏ మేరకు ముందుకు ?సాగుతాయో చెప్పటం కూడా కష్టంగానే ఉంది. ఓవైపు అసలు ఏమాత్రం నిధులు లేవు అని చెప్పే రేవంత్ రెడ్డి మరి హైదరాబాదును న్యూయార్క్ ? ఎలా చేస్తారో ఆయనకే తెలియాలి.