Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎవరయ్య జాగీరు?

చిలికి చిలికి గాలివానలా మారిందన్న మాటకు తగ్గట్లే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మొదలయ్యాయి.

By:  Garuda Media   |   4 Jun 2026 9:00 AM IST
తెలంగాణ ఎవరయ్య జాగీరు?
X

చిలికి చిలికి గాలివానలా మారిందన్న మాటకు తగ్గట్లే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మొదలయ్యాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ తనకు వచ్చిన హైలీ సోర్సు ద్వారా.. అమిత్ షా, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ముగ్గురు మాత్రమే పాల్గొన్న భేటీలో జరిగిన విషయాలు ప్రొఫెసర్ గారికి ఎలా తెలిశాయన్న ప్రాధమిక ప్రశ్నకు ఆయన ఇప్పటికే సమాధానం ఇచ్చారు. అమిత్ షాతో జరిగిన భేటీ విషయాల్నిజనసేన కోర్ కమిటీలో పవన్ కల్యాణ్ సూచన మేరకు నాదెండ్ల మనోహర్ షేర్ చేస్తే.. ఆ విషయాల్ని అందులో పాల్గొన్న వారు తనకు చెప్పినట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వెల్లడించారు.

ఆయన మాటలకు జనసేన స్పందించటం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు..తాజాగా తెలంగాణ సెంటిమెంట్ ను పెద్ద ఎత్తున రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు రాజకీయ పార్టీలు ఎవరికి వారు గళాన్ని విప్పుతున్నారు. ఈ సందర్భంలోనే జనేసేన గచ్చిబౌలిలో రెండు వేల మందితో సభను నిర్వహించాలని భావించిన జనసేనాని అందుకు తగ్గట్లే పోలీసు పర్మిషన్ కోసం ప్రయత్నించటం.. అందుకు పోలీసులు నో చెప్పటం తెలిసిందే.

కోర్టు సైతం సానుకూలంగా స్పందించని నేపథ్యంలో.. తన ఇంటి వద్దే మీడియా భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎవరబ్బ జాగీర్ కాదంటూ గళం విప్పారు. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మిస్టర్ పవన్ కల్యాణ్.. తెలంగాణ తమ జాగీర్ అని.. ఇంకెవరిది కాదని తేల్చేశారు. పవన్ నోటి నుంచి వచ్చిన జాగీర్ మాటపై అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ సైతం పవన్ వ్యాఖ్యల్ని వ్యతిరేకించారు.

ఇదంతా ఓకే అనుకునే వేళలో.. కొన్ని సందేహాలు తెర మీదకు వచ్చాయి. బరాబర్.. తెలంగాణ ఎవరి జాగీర్ అనే దానికి తెలంగాణ నేపథ్యం ఉన్న నాలుగున్నర కోట్ల మందిది తెలంగాణ జాగీర్ గా పేర్కొన్నారు. అంటే.. తెలంగాణ అన్నది తెలంగాణ నేటివ్ వాళ్లదే అనే వాదనను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కాకుంటే.. ఒకే ఒక్క సమస్య తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణను వ్యతిరేకించిన గళాలు ఉండనే ఉన్నాయి. మరి.. వారిది కూడా తెలంగాణ జాగీరేనా? అన్నది ప్రశ్న. ఎందుకంటే..తెలంగాణ ఉద్యమ సమయంలో కొత్త రాష్ట్ర ఏర్పాటును సుతారం ఒప్పుకోకపోవటమే కాదు.. వ్యతిరేకిస్తూ ఓపెన్ గా మాట్లాడేసిన సీపీఎంతో పాటు మజ్లిస్ పార్టీల సంగతేంటి? ఆ పార్టీల అధినేతలు.. కీలకనేతలు.. కార్యకర్తలు.. ఇతరులు అందరూ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారే కదా? సీపీఎం గురించి మళ్లీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ ఉద్యమాన్ని నిండుగా.. తమ సొంత రాష్ట్ర ప్రయోజనాల్ని.. తమ సొంత రాష్ట్ర ప్రజల మనోభావాల్ని పక్కన పెట్టేసి.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆంధ్రోళ్లు ఎందరో ఉన్నారు? మరి.. వారి సంగతేంటి? అలాంటి వారిని ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు వ్యతిరేకించటం.. విమర్శలు చేయటాన్ని వారు భరించారు. అలాంటప్పుడు తెలంగాణ ఎవడి జాగీర్ అన్న ప్రశ్నకు వస్తే.. తెలంగాణలోని 4.5 కోట్ల మందికి చెందుతుందని చెప్పే సోకాల్డ్ నేతలకు సూటిప్రశ్న. తెలంగాణ ఉద్యమ వేళలో.. తెలంగాణ సాధన కోసం పోరాడిన తెలంగాణేతరులు, తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఒక్కటే అవుతారా? ఇప్పుడు రాజకీయ నేతల సూత్రాల ప్రకారం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే తెలంగాణ ప్రజలు తప్పించి.. తెలంగాణ మీద ఎంత అభిమానం ఉన్నా.. ఆరాధన ఉన్నప్పటికి తెలంగాణ జాగీరు వారికి చెందదా?

ఒకవేళ.. అదే నిజమైతే.. తెలంగాణను వ్యతిరేకించిన వారందరికి తెలంగాణ జాగీరే అవుతుంది. కదా? డెవలప్ మెంట్ మీద ఫోకస్ అంతకంతకూ పెంచాల్సిన వేళ.. అందుకు భిన్నంగా తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నాలకు తీవ్రమైన భావోద్వేగాలకు గురై.. లేని సందేహాల్ని మనసుల్లో పెట్టుకోవటం తెలంగాణ ఫ్యూచర్ కు మేలు చేస్తుందా? అన్నది మరో ప్రశ్న. మొత్తంగా చూస్తే.. తెలంగాణ జాగీర్ తెలంగాణలో పుడితేనే సరిపోదు. దానికి సంబంధించి హక్కులు తెలంగాణను నిస్వార్థంగా ప్రేమించేటోళ్లు.. అభిమానించేటోళ్లకు మాత్రమే చెల్లుతుంది. ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసే దమ్ము.. ధైర్యం తెలంగాణ వాదం గురించి అదే పనిగా మాట్లాడే నేతలకు ఉందా? అన్నది ఇప్పుడు అసలుసిసలైన ప్రశ్న.