Begin typing your search above and press return to search.

టచ్ చేసి చూడు...బీఆర్ఎస్ కి బండి భారీ సవాల్

ఇలాంటివి తాము అసలు సహించేది లేదని కూడా పేర్కొన్నారు. ఇక కేంద్ర మంది బండి సంజయ్ అయితే మాస్ వార్నింగ్ ఇచ్చేశారు.

By:  Tupaki Desk   |   7 July 2025 10:51 PM IST
టచ్ చేసి చూడు...బీఆర్ఎస్ కి బండి భారీ సవాల్
X

తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సెంటిమెంట్ రాజకీయాలకు తెర తీస్తున్నారు. ఎపుడో వెనకటి కాలం వద్ద ఆగిపోయిన తెలంగాణా ఆంధ్రా సెంటిమెంట్లను ముందుకు తెస్తున్నారు. బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆంధ్ర జ్యోతి పేరుని తెలంగాణా జ్యోతిగా మార్చుకోమని డిమాండ్ చేయడంతో వివాదం ముదిరింది. దానికంటే ముందు ఒక టీవీ చానల్ మీద బీఅర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో ఆ హీట్ ఇంకా పెరుగుతోంది.

ఆంధ్రా మీడియా అంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. తెలంగాణా మీద ప్రేమ ఉంటే ఈ గడ్డ మీద తమ పేర్లను ఆంధ్రాకు బదులుగా తెలంగాణాగా మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు ఆంధ్రా మీడియా మీద దాడులు తప్పవని బీఆర్ఎస్ నుంచి హాట్ వార్నింగ్స్ వస్తున్న నేపధ్యంలో బీజేపీ సీన్ లోకి ఎంటర్ అయింది.

ఇలాంటి హెచ్చరికలు మీడియా మీద పనికి రాదు అని బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు పేర్కొన్నారు. ఇలాంటివి తాము అసలు సహించేది లేదని కూడా పేర్కొన్నారు. ఇక కేంద్ర మంది బండి సంజయ్ అయితే మాస్ వార్నింగ్ ఇచ్చేశారు.

ఆంధ్రా మీడియా హౌస్ మీద దాడి చేసి చూడాలని బీఆర్ఎస్ ని గద్దించారు. మీరు దాడి చేసిన రెండు గంటల లోపలే మేము బీఆర్ఎస్ కేంద్ర కార్యలయం మీద దాడి చేస్తామని అన్నారు. ఇది పక్కా అన్నారు. మా క్యాడర్ వస్తారు, మీ క్యాడర్ ని తెచ్చుకోండి చూసుకుందామని కూడా ఆయన ఓపెన్ చాలెంజ్ ని విసిరారు. నిజానికి బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో దారుణంగా ఓడిన తరువాత మళ్ళీ పాత కాలం నాటి తెలంగాణా సెంటిమెంట్ ని రాజేస్తోంది అని అంటున్నారు.

ఒకనాడు బీఆర్ఎస్ ని జాతీయ పార్టీగా పేర్కొంటూ ఆంధ్రాలో మహారాష్ట్రలో పోటీ చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇపుడు మళ్ళీ ఇదేంటి అని నెటిజన్ల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నారు. బీఆర్ఎస్ తెలంగాణా వాదం సెంటిమెంట్ ని కనుక ముందుకు తీసుకుని వస్తే కనుక అది గులాబీ పార్టీకి బూమరాంగ్ అవుతుందని కూడా అంటున్నారు.

మరో వైపు చూస్తే బీఆర్ ఎస్ దాడులు చేస్తామని అనడం దానికి బీజేపీ ప్రతి దాడులు చేస్తామనడంతో టెన్షన్లు ఒక్కసారిగా తెలంగాణాలో పెరిగిపోతున్నాయి. ఒక వైపు నదీ జనాలు ఆంధ్రా వాటా తెలంగాణా వాటా అంటూ రాజకీయ రచ్చ రేపుతున్నారు. ఇపుడు ఈ విధంగా అంటే బీఆర్ఎస్ కి తెలంగాణా సెంటిమెంట్ ఊతంగా మారుతుందా అన్నదే చర్చగా ఉంది. మరి ఈసారి ఆ ఓల్డ్ స్ట్రాటజీ ఆ సెంటిమెంట్లు వర్కౌట్ అవుతుందా అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుతుందో.