Begin typing your search above and press return to search.

కవిత డౌట్ నిజమేనా.....బీజేపీతో బీఆర్ఎస్ ?

ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు బీజేపీ అత్యంత బలమైన పార్టీగా దేశంలో ఉంది. దాంతో ఎన్డీయేలో కొత్త మిత్రులు చేరుతారా అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   27 May 2025 8:15 AM IST
కవిత డౌట్ నిజమేనా.....బీజేపీతో బీఆర్ఎస్  ?
X

దేశంలో బీజేపీకి దూరంగా ఉంటే రాజకీయం చేయడం చాలా కష్టమన్న సత్యాన్ని తలపండిన రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా గ్రహిస్తున్నారు. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి కూటమిగా కానీ వేరే విధంగా కానీ అధికారంలోకి వస్తుందన్న సూచనలు కానీ నమ్మకాలు కానీ కనిపించడం లేదు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో ఒక వ్యవస్థీకృతమైన సంస్థాగత నిర్మాణంతో పాటు ఎత్తులు వ్యూహాలు ఎన్నో అమ్ముల పొదిలో ఉంచుకున్న బీజేపీకి ఇది అక్షరాలా కలసి వస్తున్న కాలం. ఇలాంటి రోజు వస్తుందని జనసంఘ్ ఏర్పాటు నాడు ఆ పార్టీ నేతలు ఊహించి ఉండరు. కానీ అది జరుగుతోంది.

ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు బీజేపీ అత్యంత బలమైన పార్టీగా దేశంలో ఉంది. దాంతో ఎన్డీయేలో కొత్త మిత్రులు చేరుతారా అన్న చర్చ సాగుతోంది. తెలంగాణాలో బీఆర్ఎస్ బీజేపీ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉందని విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. మరో వైపు చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఇదే విషయం తన లేఖ ద్వారా అన్యాపదేశంగా చెప్పారు అని గుర్తు చేస్తున్నారు.

తెలంగాణాలో బీజేపీ నెమ్మదిగా విస్తరిస్తోంది. అదే సమయంలో తనదైన రాజకీయ వాటాను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అని అంటున్నారు. ఇక 2028లో కనుక త్రిముఖ పోటీ జరిగితే బీజేపీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుందని విశ్లేషణలు ఉన్నాయి. దాంతో పాటుగా బీఆర్ఎస్ కి అది శాశ్వతంగా అధికారాన్ని దూరం చేసే విధంగా మారుతుందని అంటున్నారు.

బహుశా ఇలాంటి ఆలోచనలు అంచనాలతోనే కేసీఅర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీ మీద పెద్దగా విమర్శలు చేయకుండా కాంగ్రెస్ నే టార్గెట్ చేశారు అని అంటున్నారు. ఇక తెలంగాణాలో చూస్తే బీజేపీ తో కలసి జనసేన టీడీపీ కలసి ఎన్డీయే కూటమిని కొనసాగిస్తారు అన్న వార్తలు మొన్నటి దాకా వినిపించాయి. కానీ ఇపుడు చూస్తే టీడీపీ అక్కడ పార్టీ నిర్మాణం విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అని అంటున్నారు.

దానికి కారణం బీజేపీ నేతలు టీడీపీతో పొత్తుకు సుముఖంగా లేకపోవడమే అని అంటున్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ ని ఎన్నికల వేళకు ఎలాగైనా దువ్వి తమ వైపు తిప్పుకోగలమన్న ఆలోచనలు కమలం పార్టీ నేతలకు ఉన్నాయని అంటున్నారు. దాంతోనే తెలంగాణా రాజకీయ దృశ్యం ప్రస్తుతానికి కనిపించీ కనిపించినట్లుగా ఉందని అంటున్నారు

ఇక చూస్తే ప్రాంతీయంగా బలమైన పార్టీగా ఉంటూ రూరల్ బెల్ట్ లో గట్టిగా ఉన్న బీఆర్ ఎస్ అర్బన్ బెల్ట్ లో బీజేపీ పవర్ ఫుల్ గా ఉంది. ఈ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్ ని ఊడ్చి ఓడించగలవన్న చర్చలూ ఉన్నాయని అంటున్నారు. ఇక కేటీఆర్ ని తన రాజకీయ వారసుడిగా సీఎం గా చూసుకోవాలన్న కేసీఆర్ కూడా ఎన్నికల ముందర సంచలన నిర్ణయం ఏదైనా పొత్తుల విషయంలో తీసుకుంటారు అన్న ప్రచారం ఉంది. ఏది ఏమైనా కవిత చెప్పిన జోస్యమనాలో లేక సందేహం అనాలో అదే నిజం అవుతుందా అంటే మరో రెండేళ్ల కాలం వేచి చూస్తేనే కాని విషయం బోధపడదు అని అంటున్నారు.