ఎన్నికల ఎఫెక్ట్: రామచందర్‌రావు సరికొత్త వ్యూహం!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు రంగం రెడీ అయింది. ఇప్పటికే హైకోర్టు తీర్పుతో కదిలిన ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది.
By: Tupaki Desk | 9 July 2025 7:00 PM ISTతెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు రంగం రెడీ అయింది. ఇప్పటికే హైకోర్టు తీర్పుతో కదిలిన ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం దూకుడు ఎలా ఉన్నా.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా ఇప్పటి వరకు స్థానిక ఎన్నికల్లో బీజేపీ పెద్దగా దూకుడు చూపించలేదు. ఒక్క జీహెచ్ ఎంసీ ఎన్నికలు మినహా. పంచాయతీల్లో కమల వికాసం పెద్దగా లేదు.
ఈ నేపథ్యంలో కొత్తగా రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన రామచందర్ రావు.. స్థానిక ఎన్నికల్లో కమల వికాసం ద్వారా తన దూకుడును, తన ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రయత్నాలుముమ్మరం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీకి స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటిదాకా లోకల్ బాడీ ఎన్నికలలో ప్రభావం చూపలేకపోవడం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇవి కీలకంగా మారిన నేపథ్యంలో బీజేపీ చీఫ్ దీనిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం తక్కువగా ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యం లో ఇప్పుడు వచ్చిన అవకాశాన్నిసద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని రామచందర్‌రావు ప్రయ త్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలనిని ర్ణయించారు. అదేవిధంగా ఇక నుంచి ప్రతి ఎన్నికలో పోటీ చేయాలని కూడా తీర్మానం చేసుకున్నారు. బీజేపీ క్షేత్ర స్థాయిలో బలపడాలంటే గట్టిగా కొట్లాడాలన్న భావనతో ముందుకు సాగుతున్నారు.
అదేసమయంలో సర్కారుపై ఇక నుంచి స్థానిక సమస్యల మీద రెగ్యులర్‌గా ఫోకస్ పెట్టి.. సమస్యలను ప్రస్తావించడంతోపాటు.. ప్రజలకు చేరువ య్యలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ బాధ్యతలను ఫైర్ బ్రాండ్లుగా పేరున్న పార్టీ ముఖ్య నేతలకు అప్పగించనున్నారు. అదేసమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావాలంటే బీజేపీకి ఓటేయాలన్న నినాదంతో రామచందర్‌రావు ముందుకు సాగనున్నట్టు తెలుస్తోంది. మరి ఆయన వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
