హైకోర్టు ముహూర్తం పెట్టింది.. ఇక రేవంత్ రెడీయేనా?
తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు ముహూర్తం పెట్టేసింది.
By: Tupaki Desk | 25 Jun 2025 4:08 PM ISTతెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు ముహూర్తం పెట్టేసింది. మూడు మాసాల్లో ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పింది. తాజాగా ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది. అదేసమయంలో 30 రోజుల్లోనే వార్డుల విభజన కూడా పూర్తి చేయాలని ఏక సభ్య ధర్మాసనం తీర్చు చెప్పింది. దీంతో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతారా? లేక.. దీనిని ద్విసభ్య ధర్మాసనం ముందు సవాలు చేస్తారా? అన్నది చూడాలి.
2024, ఫిబ్రవరితోనే తెలంగాణలోని గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు సమయం ముగిసింది. అయితే.. వివిధ కారణాలతో ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహించలేక పోయింది. మరీ ముక్యంగా కుల గణన చేపట్టి దాని ప్రకారం.. ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే.. ఇది మరింత జాప్యం చేసింది. మరోవైపు.. పంచాయతీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలుగా ఉన్న వారు న్యాయ పోరాటానికి దిగారు. ఇది హైకోర్టు వరకు చేరింది. సుమారు ఏడాదికిపైగా కోర్టులో వాద ప్రతివాదాలు జరిగాయి.
ఇటీవల జరిగిన వాదనల్లో తాము ఎన్నికలు నిర్వహించేందుకు 30 రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు తమకు 60 రోజుల సమయం కావాలని కోరారు. ఈ క్రమంలో తాజా హైకోర్టు ఇరు పక్షాలకు మరింత సమయం ఇస్తూ.. 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని పేర్కొంది. అయితే.. వాస్తవానికిపైకి చెబుతున్నట్టు ప్రభుత్వం 30 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని భావించడం లేదు.
కుల గణన, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి కీలక అంశాలను పూర్తి చేసిన తర్వాత.. ఏర్పడే సానుకూలతను తమకు అనుకూలంగా మారే వరకు ఎదరు చూస్తోంది. ఈ క్రమంలో కోర్టు తీర్పు మేరకు ఎన్నికలు నిర్వహిస్తారో.. లేక, అప్పీల్‌కు వెళ్తారో చూడాలి. ఏదేమైనా.. ఇప్పుడు తెలంగాణలో స్థానిక సమరంపై జోరుగా నే చర్చ సాగుతోంది.
