Begin typing your search above and press return to search.

జూబ్లీ హిల్స్ పోరు : బీజేపీ సింగిల్...టీడీపీ మింగిల్ ?

తెలంగాణాలో రాజకీయ సన్నివేశం ఇప్పట్లో మారే అవకాశం కనిపించడం లేదు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఉందో అదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   31 July 2025 8:45 AM IST
జూబ్లీ హిల్స్ పోరు :  బీజేపీ సింగిల్...టీడీపీ మింగిల్  ?
X

తెలంగాణాలో రాజకీయ సన్నివేశం ఇప్పట్లో మారే అవకాశం కనిపించడం లేదు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఉందో అదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో అధికార బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసింది. కాంగ్రెస్ సీపీఐతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. బీజేపీ జనసేనతో కలసి పోటీ చేసింది. తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. మీ ముక్కోణం పోరులో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.

మళ్ళీ అదే సీన్ రిపీట్ :

దాదాపు రెండేళ్ళ తరువాత జూబ్లీ హిల్స్ ఉప పోరుతో రాజకీయ సన్నివేశం అలాగే ఉండేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది. దాంతో అనేక అడ్వాంటేజెస్ ఆ పార్టీకి ఉంటాయి. బీఆర్ఎస్ అయితే పార్లమెంట్ లో పోగొట్టుకున దానిని అసెంబ్లీ ఉప పోరుతో దక్కించుకోవాలని చూస్తోంది. పైగా సిట్టింగ్ సీటు కూడా దాంతో పట్టుదలగా పోరాడే ప్రయత్నం చేస్తోంది. ఇక బీజేపీ అయితే జనసేనను సైతం పక్కన పెట్టి ఈసారి సింగిల్ గానే పోటీకి దిగాలని నిర్ణయించింది.

టీడీపీ మాటేంటి :

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది అని ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే ప్రకటించారు. స్థానిక ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా టీడీపీతో పొత్తులు ఉండవని కూడా తేల్చేశారు. అయితే జూబ్లీహిల్స్ విషయంలో టీడీపీ సంగతేంటి అన్న చర్చ నడుస్తోంది నిజం చెప్పాలీ అంటే ఇక్కడ టీడీపీకి బలం బాగానే ఉంది. ఆ పార్టీ 2014లో పోటీ చేస్తే 50 వేల పై దాటి ఓట్లు వచ్చాయి. 2018లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ కి ఇక్కడ మద్దతు ఇచ్చింది. దాంతో టీడీపీ పోటీకి దిగకపోతే ఓట్లు ఏ వైపు అన్న చర్చ వస్తోంది.

కమలం బలం పెరిగిందా :

మరో వైపు చూస్తే 2023లో జరిగిన ఎన్నికల్లో పాతిక వేల పై చిలుకు ఓట్లను బీజేపీ సాధించింది. ఆ పార్టీ మూడవ స్థానంలో ఉంది. సహజంగా అర్బన్ లో బీజేపీకి బలం ఉంటుంది అయితే జూబ్లీ హిల్స్ లో మాత్రం బీజేపీతో పాటుగా టీడీపీకి బలం ఉంది. ఆ పార్టీతో పొత్తు ఉంటే కనుక బీజేపీకి అది కలసి వస్తుందని అంటున్నారు. అయితే టీడీపీని ఆంధ్రా పార్టీగా బీఆర్ఎస్ ఇప్పటికే చెబుతోంది. బీజేపీ కనుక పొత్తు పెట్టుకుంటే అది బీఆర్ఎస్ కే భారీ రాజకీయ లాభాన్ని కలుగచేస్తుంది అని అంటున్నారు. దాంతో బీజేపీ దూరంగా ఉంటోంది అని చెబుతున్నారు.

అంతర్గతంగా సర్దుబాటు :

అయితే టీడీపీ పోటీలో లేకపోయినా అంతర్గతంగా బీజేపీకి ఓటు సాయం చేయవచ్చు అన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఎన్డీయేగా ఏపీలో కేంద్రంలో బీజేపీ టీడీపీ కలసి ఉన్నాయి. దాంతో బహిరంగంగా పొత్తులు లేకపోయినా ఒక విధంగా అండర్ స్టాండింగ్ అయితే ఉండవచ్చు అని అంటున్నారు. అలా బీఆర్ఎస్ నుంచి విమర్శలు తప్పించుకోవడంతో పాటు తన ఎత్తుగడలను అమలు చేసి జూబ్లీ హిల్స్ లో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.

సైకిల్ ఓట్లు చీలిపోతాయా :

అయితే పొత్తు అన్నది బాహాటంగా ఉంటే ఆ తీరే వేరు. అలా కాకుండా అంతర్గతంగా సర్దుబాటు అంటే మాత్రం సాలిడ్ గా ఓట్లు పడే సీన్ ఉండదని అంటున్నారు. ఇక చూస్తే 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాధ్ 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023లో ఆయన మరోసారి గెలిచారు. దాంతో టీడీపీ ఓట్లు బీఆర్ స్ కి షిఫ్ట్ అయిపోయాయని అంటున్నారు.

అంతే కాదు 2018, 2023లలో టీడీపీ ఇక్కడ నుంచి పోటీ చేయలేదని దాంతో ఆ పార్టీ ఓటింగ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీగా చీలిపోతుందని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తోంది. టీడీపీ సాయం ఎంత అన్నది చూడాల్సి ఉంది. మరో వైపు బీజేపీ ఎంత పుంజుకుంటే ఆ మేరకు బీఆర్ఎస్ నష్టపోయి కాంగ్రెస్ గెలుస్తుంది అన్న లెక్కలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.