ఆకలిని తీర్చే పెద్దన్నగా తెలంగాణ.. తాజాగా భారీ రికార్డు!
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ.. పలు అంశాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటోంది. దేశ ఆకలిని తీర్చే పెద్దన్న పాత్రను తెలంగాణ రాష్ట్రం పోషిస్తున్న విషయాన్ని తాజా రిపోర్టు స్పష్టం చేస్తోంది.
By: Tupaki Desk | 27 May 2025 11:15 AM ISTప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ.. పలు అంశాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటోంది. దేశ ఆకలిని తీర్చే పెద్దన్న పాత్రను తెలంగాణ రాష్ట్రం పోషిస్తున్న విషయాన్ని తాజా రిపోర్టు స్పష్టం చేస్తోంది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా మారుతోంది. అది కూడా ఒక్క బియ్యం పంటతో మాత్రమే కాదు.. ఇతర పంటల దిగుబడి సైతం పెరిగిన విషయాన్ని వెల్లడించింది. సానుకూల వాతావరణం.. ప్రభుత్వ విధానాలు కలవగా రికార్డు స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం. దిగుబడులు పెరిగిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థ గణాంక శాఖ వెల్లడించింది.
2023-24లో 168.75 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ రాష్ట్రం 2024-25లో దాన్ని అధిగమించి ఏకంగా 183.57 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించింది. దీంతో.. దేశంలో అత్యధికంగా బియ్యాన్ని పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ తర్వాత అత్యధికంగా వరిని పండించే రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్.. పశ్చిమ బెంగాల్.. పంజాబ్ రాష్ట్రాలు నిలిచాయి.
సాధారణ సాగు విస్తీర్ణానికి మించి వరి వేయటంతో దిగుమతులు వెల్లువెత్తాయని నివేదిక వెల్లడించింది. గత యాసంగి సీజన్ లో సాధారణ సాగు విస్తీర్ణం 16 లక్షల హెక్టార్లు కాగా.. గత ఏడాది ఏకంగా 24.04 లక్షల హెక్టార్లలో సాగైనట్లుగా గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు 29 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లు తీసుకున్నారని.. ఉచిత కరెంటు సరఫరాతో రైతులు వరి సాగుకే మొగ్గు చూపినట్లుగా గుర్తించారు.
ఖరీఫ్.. రబీలతో కలిపి మొత్తం 275 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చినట్లుగా పేర్కొన్నారు. దీని ద్వారా 183 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయ్యింది. త్రణ.. చిరుధాన్యాలు కలిపి తెలంగాణలో 37.19 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది.ఇందులో కందులు 1.99 లక్షల టన్నులు.. శనగ 1.10 లక్షలటన్నులు.. మినుములు 43,57.. పెసలు 24.170, నూనెగింజలు 5.50 లక్షల టన్నులు పండినట్లుగా రిపోర్టు వెల్లడించింది. మొత్తంగా వ్యవసాయం విషయంలో తెలంగాణ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దూకుడు పెరిగిన వైనాన్ని రిపోర్టు స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.
