రేవంత్ కేబినెట్ లో ఎవరు ఇన్...ఎవరు అవుట్ ?
ఈ రకమైన పరిస్థితులలో తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తొందరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఒక తీపి వార్తను వినిపించారు.
By: Tupaki Desk | 18 May 2025 8:30 AM ISTతెలంగాణ రాష్ట్రంలో మరోసారి మంత్రి పదవుల మీద చర్చ మొదలయింది ఇప్పటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయి దాదాపుగా సంవత్సరం అన్న పైగా కాలం గడిచింది అయితే మంత్రివర్గంలో ఉన్న ఖాళీలు అలాగే ఉన్నాయి వాటి మీద ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు అలాగే జూనియర్లు సైతం మంత్రి పదవవుల కోసం తమదైన ప్రయత్నాలు చేసుకుంటున్నారు అవకాశం వస్తే అందలం ఎక్కాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మహా సముద్రం అక్కడ ఎవరికి ఎప్పుడు ఏ రకంగా అవకాశాలు వస్తాయన్నది ఎవరికీ తెలియదు లాబీయింగ్ తో మంత్రి పదవులు కానీ ఇతర పదవులు కానీ సంపాదించాలని చూసేవారు చాలా మంది ఉంటారు.
పూరిస్తున్న ఈ మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయి అన్నది మాత్రం ఉత్కంఠగా ఉంది అయితే ఇటీవల కలంలో అంటే కొద్ది నెలల క్రితం మంత్రి వర్గం విస్తరణ మీద ఊహాగానాలు వినిపించాయి. ఖచ్చితంగా మంత్రి పదవులు భర్తీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. ఒక విధంగా చూస్తే ముహూర్తం కూడా ఖరారైపోయింది ఇక అమాత్య కుర్చీలను అధిరోహించడమే తరువాయి అన్నట్టుగా పరిస్థితి ఎర్పదింది. అయితే అనూహ్యంగా మంత్రివర్గ విస్తరణ లేదు అన్న చేదు వార్త వినిపించింది దాంతో కాంగ్రెస్ లోనే ఆశావహులు చాలా డీలపడ్డారు ఈ నేపథ్యంలో పార్టీలో ఒకింత అసంతృప్తి కూడా వ్యాపించింది.
ఈ రకమైన పరిస్థితులలో తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తొందరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఒక తీపి వార్తను వినిపించారు. అయితే మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులోగానైనా లేదా జూన్ నెలలోనైనా ఉంటుందని ఉంటుందని ఆయన చెప్పడంతో కాంగ్రెస్ వారు హడావుడి చేస్తున్నారు అయితే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆయన చెప్పడం విశేషం తక్కువ ఖాళీ ఉన్నాయని అదే సమయంలో ఎక్కువమంది ఆ సేవలు ఉన్నారే పిసిసి చీఫ్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలు వేసుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఆయన చెప్పారు.
మంత్రివర్గ విస్తరణ పై తుది నిర్ణయం పార్టీ అధినాయకత్వం తో పాటు ముఖ్యమంత్రి ఆలోచన మీద ఆధారపడి ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన తేనె తుట్టెను కదిలించినట్లు అయింది మంత్రివర్గ విస్తరణ నిజంగా చేపడితే ఖాళీగా ఉన్న ఐదు క్యాబినెట్ వ్యక్తులతో పాటుగా మరికొన్ని ఖాళీలను కూడా చేసి మరి ఒక రకంగా విస్తరిస్తారు అని అంటున్నారు అదే కనుక జరిగితే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో కొందరికి పదవీ నష్టత్వం తప్పదని అంటున్నారు
పార్టీలో సరిగా వ్యవహరించలేనివారు ప్రభుత్వంలో మంత్రులుగా ఉంటూ మంత్రులుగా ఉంటూ తమ పనితీరు మెరుగుపరుచుకొని వారు మీద వేటు పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు దాంతో కొందరు ఇన్ కొందరు అవుట్ అన్నమాట వినిపిస్తోంది అయితే ఎవరు ఇన్ ఎవరు అవుట్ అన్నదే తెలంగాణ కాంగ్రెస్ లో అతిపెద్ద చర్చగా ఉంది
