Begin typing your search above and press return to search.

దుబాయ్ నుంచి వచ్చిన భర్త ఆత్మహత్య... తెరపైకి షాకింగ్ రీజన్!

అయితే ఈ విషయంపై స్పందించిన భార్య... నువ్వు నాకొదు, వెళ్లిపో, చనిపో, నేను మరో వక్తితోనే కలిసి జీవిస్తాను అని భర్తకు చెప్పినట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   12 Jun 2025 10:44 AM IST
దుబాయ్  నుంచి వచ్చిన భర్త ఆత్మహత్య... తెరపైకి షాకింగ్  రీజన్!
X

ఇటీవల కాలంలో పెరుగుతున్న అక్రమ సంబంధాలు, వాటి పర్యవసానాలు, ఫైనల్ గా వాటివల్ల వచ్చే ఫలితాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ చూడని విధంగా అన్నట్లుగా అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకమూల తెరపైకి వస్తున్నాయి. ఘోర ఫలితాలను ఇస్తున్నాయి.

అవును... ఇటీవల కాలంలో రోజు రోజుకీ అక్రమ సంబంధాల వ్యవహారాలు, అవి హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తున్న ఫలితాలు పెరుగుతూ ఉన్నాయి! ఈ క్రమంలో తాజాగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో భర్త దుబాయ్ లో ఉండి కుటుంబం కోసం కష్టపడి వస్తే.. భార్య మాటలు అతనికి ఆత్మహత్య చేసుకునేటంత తీవ్ర మనస్థాపాన్ని కలిగించాయి!

వివరాళ్లోకి వెళ్తే... సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన వ్యక్తి (36).. దుబాయ్ లో పని చేస్తున్నాడు. ఇతడికి కరీంనగర్ లోని బడ్డిపెల్లి గ్రామానికి చెందిన ఆమెతో 2014లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం అతడు.. దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ క్రమంలో అతనికి ఓ షాకింగ్ విషయం తెలిసిందంట. ఇందులో భాగంగా... అతని భార్య.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందట. దీంతో... దంపతుల మధ్య నిత్యం ఫోన్ లో గొడవలు జరిగేవట. ఈ క్రమంలో జూన్ 8న అతడు దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చారు. ఈ సమయంలో ఆమె భార్యతో ఈ విషయం మాట్లాడినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై స్పందించిన భార్య... నువ్వు నాకొదు, వెళ్లిపో, చనిపో, నేను మరో వక్తితోనే కలిసి జీవిస్తాను అని భర్తకు చెప్పినట్లు చెబుతున్నారు. దీంతో.. .తీవ్ర మనస్థాపానికి చెందిన ఆమె భర్త... బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి పొలంలోకి వెళ్లి, అక్కడున బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సమయంలో తమ కుమారుడి ఆత్మహత్యకు కోడలు, మరో వ్యక్తి కారణమని ఆరోపిస్తూ అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు!