Begin typing your search above and press return to search.

కొత్త కూర్పు... ఆసక్తికరంగా తెలంగాణ మంత్రుల హిస్టరీ!

1961 జూన్ 15న జన్మించిన భట్టి విక్రమార్క.. నిజాం కాలేజీలో డిగ్రీ చేశారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ చేశారు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 9:40 AM GMT
కొత్త కూర్పు... ఆసక్తికరంగా తెలంగాణ మంత్రుల హిస్టరీ!
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క తో పాటు మరికొంతమంది కీలక నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో... సీతక్క హైలెట్ గా నిలిచారు. సీతక్క పేరు చెప్పగానే... మైదానంలోని జనం ఆపకుండా నినాదాలు చేయడం గమనార్హం.

ఈ సందర్భంగా తెలంగాణ కేబినెట్ మినిస్టర్ పొలిటికల్ హిస్టరీ ఒకసారి చూద్దాం...

భట్టి విక్రమార్క.:

1961 జూన్ 15న జన్మించిన భట్టి విక్రమార్క.. నిజాం కాలేజీలో డిగ్రీ చేశారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ చేశారు. అనంతరం 2009లో తొలిసారిగా మధిర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో 2009 - 11 మధ్య ఉమ్మడి ఏపీ చీఫ్ విప్ గా పని చేశారు. అనంతరం 2011 - 14లో ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు.

ఇలా 2009 - 23 మధ్య నాలుగు సార్లు మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ ఫాలోవర్ గా ఉంటూ కీలక నేతగా ఎదిగారు.

ఉత్తమ కుమార్ రెడ్డి:

1962 జూన్ 20న జన్మించిన ఉత్తమ కుమార్ రెడ్డి... బీఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గానూ పోటీ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి 1999 - 2009 మధ్య కోదాడ ఎమ్మెల్యేగా పన్నిచేశారు. 2015 - 2021 మధ్య తెలంగాణ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

2009 - 2018 మధ్య హుజూర నగర్ ఎమ్మెల్యేగా గా పనిచేసిన ఆయన... 2019 ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలుపొందారు. తాజాగా హుజూర్ నగర్ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

దామోదర్ రాజనర్సింహం

1958 డిసెంబర్ 5న జన్మించిన దామోదర్ రాజనర్సింహం... రాజనర్సింహం వారసుడిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఇందులో భాగంగా 1989లో తొలిసారి ఆందోల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇదే క్రమంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల కేబినెట్ లలో మంత్రిగా పనిచేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014, 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి:

1963 మే 23న జన్మించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ క్రమంలో 2004 - 2014 మధ్య నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో 2011లో తెలంగాణ కోసం మంత్రిపదవికి రాజీనామా చేశారు.

2018లో నల్గొండ అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలయ్యారు. ఈ అనంతరం 2019లో నల్గొండ ఎంపీగా గెలుపొందారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

దుద్దిళ్ల శ్రీధర్ బాబు:

1969 మార్చి 9న జన్మించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు... ఢిల్లీ యూనివర్శిటీలో విద్యాభ్యాసం అభ్యసించారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి వచ్చి 1999లో తొలిసారి మంథని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో 2009వరకూ వరుసగా గెలిచిన ఆయన ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విప్ గా పనిచేశారు.

2009 - 14లో మంత్రిగా కీలక శాఖలు నిర్వహించారు. ఈ క్రమంలో 2014, 18లో ఓటమి పాలైన శ్రీధర్... తాజ ఎన్నికల్లో గెలిచి మంత్రిగా ఎంపికయ్యారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి:

2014లో ఖమ్మం వైఎస్సార్ సీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 2014 తర్వాత బీఆరెస్స్ లో చేరారు. 2023లో బీఆరెస్స్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో తాజాగా పాలేరు నుంచి గెలిచి మంత్రిగా ఎంపికయ్యారు.

పొన్నం ప్రభాకర్:

1967 మే 8 న జన్మించిన పొన్నం ప్రభాకర్... విద్యార్థి నేతగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఇందులో భాగంగా 1987 - 91 మధ్య ఎన్.ఎస్.యూ.ఐ. జిల్లా కార్యదర్శిగా ఎంపికయ్యారు. అనంతరం 1999 - 2002 వరకూ ఎన్.ఎస్.యూ.ఐ. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

అనంతరం 2002 - 2003 మధ్య యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ క్రమంలో 2009లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. అనంతరం 2014లో అదేస్థానం నుంచి ఎంపీగా, 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఈ క్రమంలో తాజాగా హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు.

కొండా సురేఖ:

1965 ఆగస్టు 19న జన్మించిన కొండా సురేఖ... 1995లో మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004 ఎన్నికల్లో శాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో 2009లో పరకాల నుంచి గెలిచి వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అనంతరం 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఈ సమయంలో 2014లో వరంగల్ తూర్పు నుంచి బీఅరెస్స్ పార్టీ తరుపున పోటీచేసిన సురేఖ ఆ ఎన్నికల్లో గెలిచారు. అనంతరం 2018లో మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో తాజా ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి విజయం సాధించారు.

డి అనసూయ సీతక్క:

1971 జూలై 9న జన్మించిన సీతక్క... 1988లో మావోయిస్ట్ ఉద్యమంలో చేరారు. జన నాట్యమండలి ద్వారా ఆదివాసీల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ఈ క్రమంలో సుమారు 2 దశాబ్ధాల పాటు కామ్రెడ్ గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ పిలుపుతో జనజీవన స్రవంతిలోకి వచ్చారు.

ఈ క్రమంలో 2001లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఆమె 2004లో ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2009లో అదే నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమ్మలో 2014లో ఓటమి అనంతరం కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో 2018లో మరోసారి ములుగు నుంచి గెలిచిన సీతక్క తాజా ఎన్నికల్లోనూ విజయం సాధించారు.

తుమ్మల నాగేశ్వర్ రావు:

1953 నవంబర్ 15న జన్మించిన తుమ్మల నాగేశ్వర్ రావు... 1982లో టీడీపీలో చేరారు. అనంతరం 1985, 1994, 1999, 2009, 2016 ఎన్నికల్లో గెలుపొందారు. ఫలితంగా ఎన్టీఆర్, చంద్రబాబు కేబినేట్ లలో మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి తాజాగా మంత్రిగా ఎన్నికయ్యారు.

జూపల్లి కృష్ణారావు:

1955 ఆగస్టు 10న జన్మించిన జూపల్లి కృష్ణారావు... 1999 - 2014 మధ్య కొల్లాపూర్ లో వరుస విజయాలు సాధించారు. ఈ సమయంలో వైఎస్సార్ కేబినేట్ లో మంత్రిగా పనిచేశారు. 2011లో బీఅరెస్స్ లో చేరారు. ఫలితంగా 2014లోని తెలంగాణ ఫస్ట్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2018లో ఓటమి పాలయ్యారు.

ఈ క్రమంలో 2022లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో తాజాగా కొల్లాపూర్ నుంచి గెలిచిన ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.