Begin typing your search above and press return to search.

మర్డర్ చేసి ఫారిన్ వెళ్లాలని సెట్ చేసుకున్నారట

తేజేశ్వర్ హత్య కేసును విచారిస్తున్న పోలీసులు సైతం నివ్వెర పోయే నిజాలు తాజాగా వెలుగు చూశాయి.

By:  Tupaki Desk   |   25 Jun 2025 11:25 AM IST
మర్డర్ చేసి ఫారిన్ వెళ్లాలని సెట్ చేసుకున్నారట
X

సాదాసీదా మనుషులు కరుడుగట్టిన నేరస్తుల మాదిరి ప్లానింగ్ చేయటం.. వెనుకా ముందు చూసుకోకుండా కర్కశంగా హత్యలు చేయటం.. ఆ నేరం నుంచి శిక్ష పడకుండా తప్పించుకోవటం కోసం చేసే ప్లానింగ్ చూసినప్పుడు.. మరీ ఇంత ముదురు ఆలోచనలా? అంటూ హడలిపోవటం ఖాయం. సంచలనంగా మారిన తేజేశ్వర్ హత్య ఉదంతంలో కొత్త నిజాలు వెలుగు చూసి షాకిస్తున్నాయి. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. ధనవంతుడైన తేజేశ్వర్ ను పెళ్లాడి.. అతడి డబ్బును కొల్లగొట్టి.. ఆపై హత్య చేసి పారిపోవాలనుకున్న ప్లాన్ బెడిసి కొట్టి జైలుపాలైన సంగతి తెలిసిందే.

తేజేశ్వర్ హత్య కేసును విచారిస్తున్న పోలీసులు సైతం నివ్వెర పోయే నిజాలు తాజాగా వెలుగు చూశాయి. తేజేశ్వర్ ను చంపిన తర్వాత తిరుమలరావు.. ఐశ్వర్య కలిసి తొలుత లద్దాఖ్ కు వెళ్లి.. అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం రెండు విమాన టికెట్లు బుక్ చేసుకోవటంతో పాటు.. రూ.20 లక్షలు సమకూర్చుకున్నారు.

తాము సిద్ధం చేసుకున్న డబ్బుల్లో నుంచే రూ.2 లక్షల మొత్తాన్ని సుపారీ గ్యాంగ్ కు ఇచ్చారు. హత్య అనంతరం.. ఆ విషయం బయటకు రావటానికి ముందే విదేశాలకు పారిపోవాలని భావించారు. అయితే.. తేజేశ్వర్ కనిపించకపోవటంతో.. అతడి సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం.. వదిన ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయటంతో పోలీసులు స్పందించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. తిరుమలరావు ఒక్కడే పారిపోయేందుకు ప్రయత్నించగా..అతడ్ని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలో అదుపులోకి తీసుకోవటంతో.. అతడి ప్లాన్ బెడిసి కొట్టింది.

అయితే.. అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు ఇప్పటివరకు ప్రకటించలేదు. విశ్వసనీ సమాచారం ప్రకారం.. బ్యాంకులో పని చేసే తిరుమల రావు తొలుత తన మొదటి భార్యను చంపేసి.. ఆ తర్వాత ఐశ్వర్యను పెళ్లాడాలని భావించాడు.అయితే.. ఐశ్వర్యకు డబ్బులున్న వ్యక్తి సంబంధంరావటంతో.. అతడ్ని పెళ్లాడి..అతడి డబ్బుల్ని తీసుకొని చంపేద్దామని ప్లాన్ చేశారు. బ్యాంక్ లో పని చేసే తిరుమలరావు తన విధుల నిర్వహణలోనూ అవకతవకలకు పాల్పడతారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే.. అత్యాశకు పోవటం.. అంతమొందించే ప్లాన్లు వేసి పోలీసుల కళ్లు గప్పి పారిపోవటటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.