ట్రంప్ హత్యకు డబ్బులివ్వరా? పేరెంట్స్ ను దారుణంగా చంపేసిన టీనేజర్!
ఏం జరుగుతోంది? ఇప్పటి ప్రపంచంలో తెర మీదకు వస్తున్న కొన్ని ధోరణుల్ని చూస్తే షాకింగ్ గా ఉంటోంది.
By: Tupaki Desk | 14 April 2025 11:17 AM ISTఏం జరుగుతోంది? ఇప్పటి ప్రపంచంలో తెర మీదకు వస్తున్న కొన్ని ధోరణుల్ని చూస్తే షాకింగ్ గా ఉంటోంది.తాజాగా అలాంటి సంచలన ఉదంతం తెర మీదకు వచ్చింది. ఒక అమెరికన్ టీనేజర్ తన దేశాధ్యక్షుడు డొనాల్డ్ట్ ట్రంప్ ను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకు అవసరమైన డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రుల్ని అడిగారు. వారు అందుకు ససేమిరా అన్నారు. అంతే.. తల్లిదండ్రులు అన్నది కూడా చూడకుండా వారిని అత్యంత దారుణంగా చంపిన షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది.
గత నెలలో అమెరికా పోలీసులు అరెస్టు చేసిన 17 ఏళ్ల యువకుడ్ని విచారించినప్పుడు ఈ భయంకర నిజాలు బయటకు వచ్చి.. పోలీసులు సైతం అదిరపడ్డ వైనమిది. విస్కాన్సిన్ లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాసన్ పిబ్రవరి 11న తన తల్లిదండ్రుల్ని (తల్లి టటియానా, సవతి తండ్రి డొనాల్డ్ మేయర్) ఇంట్లో అత్యంత దారుణంగా కాల్చి చంపేశాడు. అంతేకాదు.. వారి డెడ్ బాడీలతోనే కొన్ని వారాల పాటు నివసించాడు. అనంతరం భారీగా నగదును.. పాస్ పోర్టు ఇతర వస్తువుల్ని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
ఇంటి నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఇంటి వద్దకు చేరుకొని.. ఇంటి తలుపులు తీయగా.. హత్య జరిగిన వైనం వెలుగు చూసింది. దీంతో రంగంలోకి దిగిన విచారణ అధికారులు నిందితుడు నికిటాను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అతడ్ని విచారించారు.
ఈ సందర్భంగా సంచలన అంశాలు వెలుగు చూశాయి. ఆర్థిక అవసరాలు.. స్వేచ్ఛ కోసమే తన తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకున్నట్లుగా చెప్పాడు. అంతేకాదు దేశాధ్యక్షుడు ట్రంప్ ను చంపేందుకు కుట్ర పన్నిన వైనాన్ని గుర్తించారు. ఇతడు అడిగే డబ్బులు ఇవ్వటానికి వారు ఒప్పుకోలేదు. ఇతగాడి కుట్ర గురించి తల్లిదండ్రులకు తెలియటంతో వారిని చంపేసినట్లుగా గుర్తించారు.
తల్లిదండ్రుల్ని చంపేసిన తర్వాత ఒక డ్రోన్.. ఇతర పేలుడు పదార్థాలతో పాటు ఒక రష్యా వ్యక్తితో కలిసి దారుణమైన ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. తన ప్లాన్ ను అమలు చేసేందుకు అవసరమైన సమాచారం కోసం సోషల్ మీడియా మీద ఆధారపడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు మీద దర్యాఫ్తు అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు.
