Begin typing your search above and press return to search.

వైసీపీ ని టార్గెట్ చేస్తున్న టీడీపీ... లిస్ట్ అపుడేనా...?

తెలుగుదేశం అధినేత ఒక వైపు దూకుడు చూపిస్తూనే మరో వైపు కొన్ని విషయాల్లో జాప్యం చేస్తున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 9:07 AM IST
వైసీపీ ని టార్గెట్ చేస్తున్న టీడీపీ... లిస్ట్ అపుడేనా...?
X

తెలుగుదేశం అధినేత ఒక వైపు దూకుడు చూపిస్తూనే మరో వైపు కొన్ని విషయాల్లో జాప్యం చేస్తున్నారు అని అంటున్నారు. 2024 ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అయితే ఏడాది ముందుగా అభ్యర్ధులను ప్రకటిస్తుందని గతంలో ప్రచారం అయితే సాగింది. అయితే అది జరగలేదు. కనీసం ఆరు నెలలు ముందుగా అయినా అభ్యర్థులను ప్రకటిస్తారు అనుకున్నా అది కూడా నెరవేరలేదు.

ఇపుడు ఎన్నికలు మూడు నెలల ముందుకు వచ్చేసాయి. ఇప్పటికైనా అభ్యర్ధులను ప్రకటిస్తారా అంటే దానికి కూడా చాలా అడ్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. నిజానికి డిసెంబర్ నెలాఖరు నాటికి వంద మంది అభ్యర్థులతో టీడీపీ నుంచి తొలి జాబితా బయటకు వస్తుందని ప్రచారం కూడా జరిగింది. కానీ ఇపుడు చూస్తే అవేమీ కనిపించడంలేదు అంటున్నారు.

దానికి కారణం పొత్తులు ఎత్తుల విషయంలో టీడీపీ ఇంకా వ్యూహాలు రూపొందుకునే ప్రయత్నాలలో ఉండడమే. ఈ రోజుకీ టీడీపీ బీజేపీ కోసం చూస్తోంది అని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ తో కూడా టీడీపీ కలసి ఎన్నికలకు వెళ్లవచ్చు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా కూడా టీడీపీ అభ్యర్ధులు ఎప్పటి మాదిరిగానే ఎన్నికల నోటిఫికేషన్ తరువాతనే బయటకు వస్తారా అన్న చర్చ నడుస్తోంది.

ఇంకో వైపు చూస్తే ఇపుడు వైసీపీ మీద టీడీపీ ఫుల్ ఫోకస్ పెట్టేసింది అని అంటున్నారు. కనీసంగా పాతిక నుంచి ముప్పయి మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ ఈసారి టికెట్ ఇవ్వకపోవచ్చు అని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. నిజానికి బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోక ముందు అయితే వైసీపీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. టికెట్లు నిరాకరించే వారి జాబితా పది లోపే ఉండొచ్చు అని వినిపించేది.

అయితే బీఆర్ఎస్ అనుభవంతో వైసీపీ అలెర్ట్ అవుతోంది. దాంతో ఈసారి పెద్ద నంబర్ లోనే టికెట్ కి నో చెప్పే చాన్స్ ఉందని అంటున్నారు. ఇపుడు దాని మీదనే టీడీపీ దృష్టి పెడుతోందని అంటున్నారు. అంత పెద్ద నంబర్ కి టికెట్లు ఇవ్వకపోతే వారంతా తీవ్ర అసంతృప్తితో ఉంటారని అలా వచ్చిన వారిని తమ వైపు తిప్పుకుని పార్టీలో చేర్చుకునే ఎత్తుగడకు టీడీపీ తెర తీసే చాన్స్ ఉంది అని అంటున్నారు.

ఇక వచ్చిన వారికి వచ్చినట్లుగా టికెట్లు ఇవ్వకుండా అందులో ఎవరైనా అవసరం ఉంటే వారికి టికెట్లు ఇచ్చేందుకు కూడా టీడీపీ యోచిస్తోంది అని అంటున్నారు. మరి ఆ విధంగా చేస్తే మాత్రం అపుడు టీడీపీలో టికెట్లను ఆశించే వారికి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ టికెట్లు ప్రకటించేవరకూ టీడీపీ అభ్యర్ధుల జాబితా బయటకు వస్తుందా అన్నది కూడా డౌట్ గా ఉందిట. ఎందుకంటే వైసీపీని దెబ్బ తీయాలంటే ఆ పార్టీ నుంచి వచ్చే వారిని ఆహ్వానించాల్సిందే అన్నది టీడీపీ చాణక్య వ్యూహం అంటున్నారు. అందుకే అభ్యర్థుల లిస్ట్ లో జాప్యం జరుగుతోంది అంటున్నారు.