Begin typing your search above and press return to search.

టీడీపీది అతి విశ్వాసమా... ఆత్మ విశ్వాసమా...!?

టీడీపీలో గెలిచేస్తాం అన్న భావన ఏర్పడింది. దీని ఆత్మవిశ్వాసంగా చూడాలా లేక అతి నమ్మకంగా చూడాలా అన్నదే ఈ దశలో తెలియడంలేదు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2023 3:26 PM IST
టీడీపీది అతి విశ్వాసమా... ఆత్మ విశ్వాసమా...!?
X

టీడీపీలో గెలిచేస్తాం అన్న భావన ఏర్పడింది. దీని ఆత్మవిశ్వాసంగా చూడాలా లేక అతి నమ్మకంగా చూడాలా అన్నదే ఈ దశలో తెలియడంలేదు అని అంటున్నారు. టీడీపీకి 160 సీట్లకు తగ్గకుండా సొంతంగా వస్తాయని ఆ పార్టీ నేతలు బిగ్ సౌండ్ చేస్తున్నారు. సునామీలా జగన్ వేవ్ 2019 లో ఉన్న వేళ కూడా వైసీపీకి 151 సీట్లు దాటి రాలేదు.

పైగా జగన్ యువకుడు, ఫ్రెష్ గా ఏపీ సీఎం క్యాండిడేట్ గా ఉన్నారు. అయినా సరే ఆయనకు వచ్చింది ఆ స్థాయి ఓటింగ్. ఇక టీడీపీ లైఫ్ టైం లో ఎపుడూ 49 పెర్సెంట్ ఓటు బ్యాంక్ దాటలేదు. ఇక టీడీపీ ఉమ్మడి ఏపీలొ 225 సీట్లు సాధించినా అవన్నీ కూడా ఎంటీయార్ అకౌంట్ లోకే వెళ్తాయి.

చంద్రబాబు చేతిలో టీడీపీ వచ్చాక ఆ పార్టీ ఓటు బ్యాంక్ 45 పెర్సెంట్ పై దాటలేదు సీట్లు కూడా బొటా బొటీగానే ఎపుడూ వచ్చాయి. ఇవన్నీ కూడా పొత్తులు ఎత్తులు కలిపి చూసుకుంటే వచ్చినవి అని గుర్తు చేసుకోవాలి. ఇప్పటికి చంద్రబాబు సీఎం గా అయి ముమ్మారు అయింది.

ఆయన పాలన ఎలా ఉంటుందో ప్రజలు చూశారు. ఉమ్మడి ఏపీ విభజన ఏపీలో కూడా బాబు పాలన సాగింది. బాబు అభివృద్ధి రూట్ సంస్కరణలు అని 2004 దాకా తన విజన్ చూపించారు రెండుసార్లు ఓడిపోగానే 2014లో మాత్రం ఆయన ఉచితాల మీద ఆధారపడ్డారు. ఇక 2019లో ఓడిన తరువాత తొలి మూడేళ్ళూ జగన్ పధకాలను విమరిశించారు. ఏపీ శ్రీలంక అవుతుందని అన్నారు.

ఇపుడు ఆయన జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని అంటున్నారు. అభివృద్ధి విజన్ అయితే బాబుకు పేరుంది కానీ సంక్షేమం విషయంలో ఆయన మీద అంతగా ముద్ర లేదు. కానీ చంద్రబాబు ఇపుడు సంక్షేమ రూట్ అంటున్నారు.

ఈ నేపధ్యంలో ఆయన యాంటీ ఇంకెంబెన్సీ మీదనే ఆధారపడ్డారు. వైసీపీకి ప్రజా వ్యతిరేకత వెల్లువలా ఉందని అనుకుంటున్నారు. అది ఎటూ ఉంటుంది. ఒక ప్రభుత్వం అయిదేళ్ల పాటు ఉంటే అది ఖాయంగా ఎంతో కొంత వస్తుంది. దాంతో పాటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద పాజిటివిటీ కూడా క్రియేట్ అయితేనే అధికారం దక్కుతుంది.

తెలంగాణాలో రెండు సార్లు అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ మీద పూర్తి స్థాయి వ్యతిరేకత లేదు, దాంతో కాంగ్రెస్ కి సింపుల్ మెజారిటీ దక్కింది. ఏపీలో ఫస్ట్ టైం జగన్ సీఎం అయ్యారు. రెండవ చాన్స్ ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ ముమ్మారు పాలన జగన్ ఒకసారి పాలన బేరీజు వేసుకుని ఈసారి తీర్పు ఇస్తారు. అదే జరిగితే వైసీపీకి అడ్వాంటేజ్ అన్న మాట కూడా ఉంది.

ఏది ఏమైనా సర్వేలను మ్ముకుంటూ 160 సీట్లు అని టీడీపీ నిజంగా అనుకుంటోందా లేక పార్టీ జనాలను జనాలను ఆకట్టుకునేందుకే ఈ మాటలు అంటోందా అన్నది చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో జరిగేది అస్క్షరాలా కురుషేత్ర యుద్ధమే. హోరాహోరీ పోరుగానే అది సాగుతుంది అని అంటున్నారు.