Begin typing your search above and press return to search.

ఇద్దరు డాక్టర్ల కోసం టీడీపీ ఆపరేషన్ ....?

ఇలా ఒకేసారి ఇద్దరు డాక్టర్లను గేలం వేస్తూ ఆపరేషన్ ఆకర్ష్ ని టీడీపీ షురూ చేయడంతో వైసీపీ కౌంటర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతోంది అన్నది చర్చగా ఉంది.

By:  Tupaki Desk   |   9 Sep 2023 3:00 AM GMT
ఇద్దరు డాక్టర్ల కోసం టీడీపీ ఆపరేషన్ ....?
X

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ రాజకీయం పదును తేరుతోంది. ఎందుకంటే ఇక్కడ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఏపీ అంతా చంద్రబాబు నారా లోకేష్ చుట్టేస్తున్నారు. అచ్చెన్న వరకూ శ్రీకాకుళం జిల్లా బాధ్యతలను అప్పగించారని అంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పదికి పది సీట్లను గెలిపించి క్లీన్ స్వీప్ చేయలని అచ్చెన్నకు పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు.

దాంతో అచ్చెన్న అదే పని మీద ఉన్నారు. ఇక శ్రీకాకుళం ఎంపీ సీటు ఒకటి టీడీపీకి ఈసారి టెస్ట్ పెట్టేలా ఉంది అని అంటున్నారు. ఎందువల్ల అంటే 2014, 2019లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు పోటీ చేసి పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఈసారి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తాను అని అంటున్నారు.

చంద్రబాబు సైతం ఆయన కోరికకు సరేనని అన్నారని అంటున్నారు. లోకేష్ టీం లో రామ్మోహన్ ఉన్నారు. ఈ దఫా అసెంబ్లీకి నెగ్గి జిల్లా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుకుంటే వచ్చే ఎన్నికల నాటికి అచ్చెన్న ప్లేస్ లోకి రామ్మోహన్ చాలా ఈజీగా షిఫ్ట్ అవుతారు అని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. దాంతో ఆయనను అసెంబ్లీకే దించడానికి ఓకే చెబుతోంది అని అంటున్నారు.

ఆ విషయం సరే అనుకున్నా శ్రీకాకుళం ఎంపీ సీటుకు ఎవరు గట్టి అభ్యర్ధి అన్నది మాత్రం తేలడంలేదు. పార్టీలో చాలా మంది నేతలు ఉన్నా ఎవరూ ఎంపీ పదవికి పోటీకి నో చెప్పేస్తున్నారు. దాంతో కొత్త ముఖాన్ని అయినా లేదా ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్ధిని తెచ్చి అయినా పోటీకి పెట్టి గెలిపించుకోవాలన్నది టీడీపీ స్ట్రాటజీగా ఉంది.

దాంతో వైసీపీ వైపే టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. ముందుగా చూసుకుంటే తాజా ముఖంగా జిల్లాలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆనే దానేటి శ్రీధర్. ఆయన వైసీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం ఆయనను ఆముదాలవలస నుంచి పోటీకి దిగమని చెబుతోంది అని అంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం అది కావడంతో అక్కడ నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని లెక్క కడుతోంది.

పైగా ఆముదాలవలసకు వైసీపీకి గట్టి అభ్యర్ధి లేరు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉనన్ స్పీకర్ తమ్మినేని సీతారాం ని ఎంపీగా పోటీ చేయించాలన్నది పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. అలా రెండు సీట్లను గెలుచుకోవచ్చు అన్నది పార్టీ వ్యూహంగా ఉంది. అయితే దానేటి శ్రీధర్ మాత్రం ఎంపీ సీటు మీదనే ఆశలు పెట్టుకున్నారు. దాంతో ఆయన ఎటూ తేల్చడం లేదని అంటున్నారు.

సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే టీడీపీ ఆయన మీద గురి పెట్టింది అని అంటున్నారు. ఆయన్ని టీడీపీలోకి తీసుకుని వచ్చి ఎంపీ సీటు ఏదో తామే ఇస్తామని రాయబారాలు నడుపుతోంది అని అంటున్నారు. బలమైన సామాజికవర్గానికి చెందిన దానేటి శ్రీధర్ ని ఎంపీగా దించితే పార్టీకి ఉన్న బలం, అనుకూల వాతావరణం కలసి కచ్చితంగా గెలుపు సాధ్యపడుతుందని పార్టీ భావిస్తోందిట.

దాంతో దానేటి శ్రీధర్ సైకిలెక్కబోతున్నారు అన్న ప్రచారం అయితే జిల్లాలో ఊపందుకుంది. ఆయన కనుక టీడీపీ వైపు మొగ్గితే శ్రీకాకుళం ఎంపీ సీటుకు వైసీపీకి మరో ఆప్షన్ కూడా చూసుకోవాలని అంటున్నారు. ఇక మరో వైపు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణిని కూడా టీడీపీ ఆహ్వానించింది అని అంటున్నారు.

ఇలా ఒకేసారి ఇద్దరు డాక్టర్లను గేలం వేస్తూ ఆపరేషన్ ఆకర్ష్ ని టీడీపీ షురూ చేయడంతో వైసీపీ కౌంటర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతోంది అన్నది చర్చగా ఉంది. మొత్తానికి డాక్టర్లు ఇద్దరినీ తన గూటికి టీడీపీ చేర్చుకుంటే వైసీపీకి అది బిగ్ ట్రబుల్ గానే అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.