Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ పోటీకి నో...తెనాలి సీటుతో పితలాటకం

తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఎంపీ సీట్ల కంటే ఎమ్మెల్యే సీట్ల విషయంలోనే పోటీ ఉంది.

By:  Tupaki Desk   |   7 Sep 2023 9:17 AM GMT
టీడీపీ ఎంపీ పోటీకి నో...తెనాలి సీటుతో పితలాటకం
X

తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఎంపీ సీట్ల కంటే ఎమ్మెల్యే సీట్ల విషయంలోనే పోటీ ఉంది. ఆ మాటకు వస్తే వైసీపీలో అదే పరిస్థితి ఉంది. ఢిల్లీ వెళ్ళి చేసేది ఏదీ లేదని అందువల్ల ఎమ్మెల్యేగా ఉంటే హ్యాపీగా ఏపీలో ఉంటూ తమ పని తాము చేసుకోవచ్చు అని చాలా మంది నేతలు భావిస్తున్నారు. పై పెచ్చు ఎంపీ అంటే ఏడు అసెంబ్లీ సీట్ల విషయంలోనూ ఖర్చు భారీగా పెట్టుకోవాలి.

అదే ఎమ్మెల్యే అయితే జస్ట్ తన నియోజకవర్గం నుంచి చూసుకుంటే సరిపోతుంది. ఈ లెక్కలతో కూడా చాలా మంది ఎమ్మెల్యే బెటర్ అంటున్నారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడంటే మూడు ఎంపీ సీట్లు గెలిచింది. అవి ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం ఎమెపె, విజయవాడ, గుంటూరు ఎంపీ సీట్లను గెలుచుకుంది.

ఇందులో గుంటూర్ ఎంపీ గల్లా జయదేవ్ పోటీకి ఈసారి నో చెబుతున్నారు అని అంటున్నారు. ఆయన చాలా కాలంగా టీడీపీ రాజకీయాలలో సైతం కనిపించడంలేదు. ఆయనకు పాలిటిక్స్ పట్ల అయిష్టత వల్లనే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. గల్ల ఫ్యామిలీ తొలి నుంచి కాంగ్రెస్ తోనే ఉంది. అయితే విభజన తరువాత మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి టీడీపీకి షిఫ్ట్ అయ్యారు.

అలా ఆమెకు కొడుకు గల్లా జయదేవ్ కి చంద్రబబు 2014లో టికెట్లు ఇచ్చారు. గల్లా జయదేవ్ గుంటూర్ ఎంపీగా పోటీ చేస్తే దాదాపు 70 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. అదే 2019లో పోటీ చేస్తే జగన్ వేవ్ లో గెలిచారు కానీ కేవలం నాలుగు వేల మెజారిటీ మాత్రమే దక్కింది. ఇక గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా చురుకుగా గతంలో ఉండేవారు. దాంతో టీడీపీకి ఆయన ఆర్ధికంగా అండదండలు అందిస్తున్నారు అన్న కారణంతో ఆయనకు ఉన్న అమర రాజా బ్యాటరీస్ మీద కాలుష్యం పేరుతో వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీని మీద న్యాయ పోరాటం చేసిన ఆయన ఆ మీదట రాజకీయ దూకుడు తగ్గించారు.

తనకు ఉన్న కొత్త ప్లాంట్లను కూడా తెలంగాణా తమిళనాడు తదితర రాష్ట్రాలలో పెట్టుకున్నారు. ఇక రాజకీయాలకూ వ్యాపారానికి ముడిపెడుతూండడం వల్ల ఆయన బిజినెస్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారని అంటున్నారు. దాంతో రాజకీయాలకు గుడ్ బై అనేశారని తెలుస్తోంది. ఆయన ఈ విషయాన్ని టీడీపీ అధినాయకత్వానికి కూడా చెప్పారని అంటున్నారు.

దాంతో గుంటూరు ఎంపీ సీటులో టీడీపీ అభ్యర్ధి అర్జంటుగా వెతుక్కోవాల్సి వస్తఒంది. అయితే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఆయనను గుంటూరు నుంచి 2024 ఎన్నికల్లో పోటీకి దించాలని టీడీపీ భావిస్తోంది అని అంటున్నారు. అలా చేయడం వల్ల తెనాలి సీటుని కోరుతున్న జనసేనకు ఇచ్చినట్లు అవుతుంది బలమైన క్యాండిడేట్ గా ఆలపాటిని ఎంపీగా దించి గెలిపించుకోవచ్చు అని అంటున్నారు.

అయితే ఆలపాటి రాజా మాత్రం తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను అని అంటున్నట్లుగా తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మరోమారు మంత్రి కావాలని ఆయన ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే తెనాలి సీటు మీద జనసేన కర్చీఫ్ వేయడమే కాదు పవన్ ప్రకటించిన తొలి సీటు అదే కావడంతో అంత పట్టుదలగా ఆ పార్టీ ఉందని తెలిసి ఆలపాటికి అక్కడ చాన్స్ ఇవ్వలేమని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది.

ఒకవేళ ఆలపాటి నో చెబితే బలమైన మరో క్యాండిడేట్ ని గుంటూరు ఎంపీ సీటుకు వెతుక్కోవాల్సిందే అంటున్నారు. మొత్తానికి గల్లా జయదేవ్ నో చెప్పడం వల్ల ఆలపాటికి ఢిల్లీ దారి చూపుతున్నారని అంటున్నారు. తెనాలిలో తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన చెబుతున్నా హై కమాండ్ మాత్రం జనసేన కోసం ఆలపాటికి కదిపేలా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.