Begin typing your search above and press return to search.

కర్నూల్ టీడీపీలో సీట్ల సిగ పట్లు...?

ఇక చూసుకుంటే చాలా సీట్లలో తమ్ముళ్ళు కర్చీఫ్ వేసేసి సీట్ల కోసం పోరాటమే చేస్తున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 Aug 2023 12:30 PM GMT
కర్నూల్ టీడీపీలో సీట్ల సిగ పట్లు...?
X

కర్నూల్ జిల్లా వైసీపీకి కంచుకోట. ఈ జిల్లాలో 2014లో మెజారిటీ సీట్లు వైసీపీ గెలుచుకుంటే 2019లో ఏకంగా 14కి 14 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. అయితే ఈసారి వైసీపీ అన్ని సీట్లు గెలుచుకుంటుందని టీడీపీ భావించడంలేదు. వైసీపీకి తీవ్రంగా వ్యతిరేకత పెరిగింది అని భావిస్తోంది. దాంతో కచ్చితంగా సగానికి సగం సీట్లు గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది.

అదే టైం లో మొత్తం 14 సీట్లకు గానూ తొమ్మిదింటిలో అభ్యర్ధులు కూడా ఖరారు అయిపోయారని ప్రచారం సాగుతోంది. ఇక రెడ్ల ప్రాబల్యం ఉన్న కర్నూల్ జిల్లాలో టీడీపీ కూడా అదే సామాజికవర్గం నుంచి అభ్యర్ధులను ఖరారు చేయడం ద్వారా తనదైన సోషల్ ఇంజనీరింగ్ ని అమలు చేస్తోందని అంటున్నారు.

ఇక చూసుకుంటే చాలా సీట్లలో తమ్ముళ్ళు కర్చీఫ్ వేసేసి సీట్ల కోసం పోరాటమే చేస్తున్నారు అని అంటున్నారు. ముందుగా తీసుకుంటే ఆళ్ళగడ్డ నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మిగనూరు నుంచి జయ నాగేశ్వరరెడ్డి, శ్రీశైలం నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, డోన్ నుంచి సుబ్బారెడ్డి, బననాగపల్లె నుంచి బీసీ జనార్ధనరెడ్డి, పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి, మంత్రాలయంలో తిక్కారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పోటీకి రెడీ అవుతున్నట్లుగా చెబుతున్నారు.

అయితే ఈ సీట్లలో ఇతర నేతలు కూడా తమకు చాన్స్ ఉంటుందని పోటీకి రావడంతో తమ్ముళ్ళ మధ్య రచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయని అంతున్నారు. మరో వైపు చూసుకుంటే కర్నూల్ సిటీ నుంచి మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ పోటీ చేస్తారు అని తెలుస్తోంది. అలాగే అదోని నుంచి మీనాక్షీ నాయుడు పోటీకి తయారుగా ఉన్నారని అంటున్నారు.

ఈ నేపధ్యంలో వైసీపీ కంచుకోటలో టీడెపీ గెలవలాని చూడడం ఒక ఎత్తు అయితే రెడ్డి సామాజికవర్గం నేతలు పెద్ద ఎత్తున సీట్ల కోసం పోటీ పడడం మరో ఎత్తు. టీడీపీ సైతం రెడ్లను తన వైపునకు తిప్పుకునేందుకు వారికే టికెట్లు ఎక్కువ ఇస్తుందని ప్రచారంలో ఉంది. అయితే ఎన్ని చేసినా కూడా కర్నూల్ లో మాత్రం వైసీపీ మరోసారి మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని అంటున్నారు. అయితే ఈసారి టీడీపీకి నాలుగైదు సీట్లు దక్కే చాన్స్ ఉందని అంటున్నారు.

అవి కనుక చూసుకుంటే పత్తికొండ, బనగానపల్లె, ఆలూరు, కర్నూలు అర్బన్ అని చెబుతున్నారు. అదే సమయంలో మరో రెండు సీట్లు అయిన ఆదోని, మంత్రాలయంలో టీడీపీ గట్టి పోటీ ఇవ్వగలదని అంటుననరు. ఇలా కర్నూల్ లో ఈసారి గెలిచేందుకు టీడీపీ చూస్తూంటే తమ్ముళ్ళు మాత్రం సీట్ల పేచీతో అధినాయకత్వానికి సవాల్ గా చాలా చోట్ల మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.