Begin typing your search above and press return to search.

1+1+1 = 0 లేదా 3...!?

ఇక ఈ గణితం లెక్క ముచ్చట ఎందుకు అంటే ఏపీలో టీడీపీ ప్లస్ జనసేన కూటమి కట్టాయి. అందులోకి కొత్తగా బీజేపీ వచ్చి చేరింది.

By:  Tupaki Desk   |   11 March 2024 8:59 AM GMT
1+1+1 = 0 లేదా 3...!?
X

గణిత శాస్త్రంలో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఎంత అంటే ఎల్కేజీ స్టూడెంట్ కూడా ఠక్కున మూడు అని జవాబు చెబుతారు. మరి రాజకీయ గణితంలో అది వీలు అవుతుందా. ముగ్గురు కలిస్తే ప్లస్ అవుతుందా ఇది అతి పెద్ద చర్చ. రాజకీయ గణితం అన్నది ఎవరికీ అర్థం కాదు. ఒక సందర్భంగా అంతా కలిస్తే అది మహా బలం అవుతుంది. మరో సందర్భంలో అంతా కలిసి కట్టుగా వస్తే వారికే మైనస్ అవుతుంది. ఇలాంటి ఉదాహరణలు భారతీయ రాజకీయాల్లో ఎన్నో ఉన్నాయి.

ఇక ఈ గణితం లెక్క ముచ్చట ఎందుకు అంటే ఏపీలో టీడీపీ ప్లస్ జనసేన కూటమి కట్టాయి. అందులోకి కొత్తగా బీజేపీ వచ్చి చేరింది. బీజేపీ చేరికతో వేయి ఏనుగుల బలం వచ్చినట్లుగా కూటమి పెద్దలు అయితే భావిస్తున్నారు. కానీ కామన్ పబ్లిక్ లో మాత్రం ఆ ఫీల్ ఎక్కడా కనిపించడంలేదు. అందుకే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే మూడు అవుతుందా లేదా అన్న చర్చ ఇపుడు జోరుగా రాజకీయ వర్గాలలో సాగుతోంది.

ఏపీలో చూస్తే 2014లో ఈ మూడు పార్టీలు కలిసాయి. అచ్చంగా గణిత శాస్త్రంలో చెప్పినట్లుగానే మూడు అయింది. జనాల్లో కూడా పాజిటివ్ మూడ్ వచ్చి అధికారం కూటమికి దక్కింది. కానీ ఈసారి ఏమి అవుతుంది మూడు అవుతుందా జీరో అవుతుందా ఇది ఎడతెగని చర్చగా ఉంది.

ఇక లెక్కలు చూస్తే కనుక బీజేపీని కొన్ని వర్గాలు దూరం పెడతాయి. బీజేపీ వల్ల ముస్లిం, క్రిస్టియన్, ఇతర సామాజిక వర్గాలు దూరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఆ ఓటు బ్యాంక్ కచ్చితంగా ఒకటి నుంచి రెండు శాతం కూటమికి తగ్గిపోతుంది అని కూడా అంటున్నారు. దాంతో ఒక విధంగా చెప్పాలంటే మైనస్ అన్న మాట.

మరి బీజేపీ వల్ల ప్లస్ ఉందా అంటే ఉంది. మోడీకి పెరిగిన ఇమేజ్, రామాలయం నిర్మాణం, హిందూత్వ అనుకూల పవనాలు. మరోసారి దేశంలో బీజేపీనే అధికారంలోకి వస్తుంది అన్న అంచనాలు ఇవన్నీ చూసుకుంటే ఆ విధంగా ప్లస్ అవుతుంది. మరి ప్లస్ అయ్యే ఓటింగ్ ఎంత అన్నది చూడాల్సి ఉంటుంది.

ఏపీలో చూసుకుంటే కనుక బీజేపీని అంతా అర శాతం ఓటింగ్ కలిగిన పార్టీ అంటారు కానీ ఆ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న ఓటింగ్ అయిదు శాతం అని చెబుతున్నారు. ఈ ఓట్లు 2014లో పడ్డాయి, అంతకు ముందు కొన్ని సార్లు పడ్డాయి. గెలుస్తుంది అనుకుంటే ఈ ఓట్లు అన్నీ కూడా బీజేపీకి దానితో ఉన్న కూటమికే పడతాయన్న మాట.

అలా 2014లో కూటమికి బీజేపీ ఓటింగ్ ప్లస్ అయింది. అదే 2019లో చంద్రబాబు మీద కోపం తో బీజేపీ మీద అభిమానం ఉన్న వారు కూడా వైసీపీకి ఓటు వేశారు అని అంటున్నారు. దాంతో ఆ ఓట్లు ఇపుడు వెనక్కి వస్తాయని అలా బీజేపీకి అయిదు శాతం తగ్గకుండా ఓట్లు ఉంటాయని లెక్క వేస్తున్నారు. అందులో నుంచి రెండు మూడు శాతం మైనస్ అయినా బీజేపీ వల్ల ఎలా చూసుకున్నా కూటమికి కచ్చితంగా రెండు శాతం ఓటింగ్ కలుస్తుంది అని మరో లెక్క ఉంది.

ఇంకో వైపు చూస్తే జనసేనకు గత ఎన్నికల్లో ఆరు శాతం ఓటింగ్ వచ్చింది. ఈసారి అది ఎనిమిది శాతం అయినా ఆవుతుందని, అలా బీజేపీ జనసేన ఓటింగ్ పది శాతం టీడీపీకి జతపడితే టీడీపీకి ఉన్న 40 శాతం ఓటింగ్ కి ఇవి ప్లస్ అయితే కూటమికి టోటల్ గా యాభై శాతం ఓటింగ్ వస్తుందని కూడా లెక్క వేస్తున్న వారు ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అన్నది మూడు తప్ప జీరో కానే కాదు అని కూటమి పెద్దలు ఆశాభావంతో ఉన్నారు.

అయితే కూటమి కట్టిన తరువాత బలాబలాలు మారుతాయని కూడా మరో లెక్క వినిపిస్తున్నారు. జనసేన 137 సీట్లలో 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఆరు శాతం ఓటు షేర్ వచ్చిందని ఇపుడు 24 సీట్లకే పరిమితం అయితే అంత ఓటు షేర్ ఎలా వస్తుందని మరో లెక్క కూడా ఉంది. బీజేపీ విషయమే తీసుకుంటే దేశమంతా మోడీ వేవ్ వేరు ఏపీలో వేరు అన్నది కూడా చెబుతున్న మాట. 2014లో మోడీ ఎవరో ఏపీ జనాలకు తెలియదు అని అందుకే నమ్మారు అని 2024 నాటికి మోడీ ఏపీకి ఏమీ చేయలేదు అని తెలిశాక ఇక ఓట్లు ఎందుకు వేస్తారు అన్నది కూడా కీలకమైన ప్రశ్నగానే చూడాలి.

ఏది ఏమైనా జీరో అవుతుంది కూటమి అని కొన్ని విశ్లేషణలు ఉంటే అలా కాదు కూటమి గెలుస్తుంది అని మరి కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. సో టోటల్ గా ఈ పొత్తు ఫలిస్తుందా లేదా అంటే ఎన్నికల ఫలితాలే చెప్పాల్సి ఉంటుంది.