బాబుకు బీజేపీ గుడ్ న్యూస్ చెప్పబోతోందా...!?
ఏపీలో టీడీపీని తిరిగి ఎన్డీయేలోకి ఆహ్వానించాలని బీజేపీ పెద్దలు సూత్రప్రాయాంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 30 Jan 2024 9:22 AM ISTవచ్చే ఎన్నికలకు సంబంధించి ఏపీలో టీడీపీతో కలసి పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించిందా అంటే ఢిల్లీలో సాగుతున్న పరిణామలు చూస్తే అవును అనే జవాబు వస్తోందిట. బీజేపీ పెద్దలు ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఏపీలో ఎవరితో వెళ్తే రాజకీయ లాభం అన్నది కూడా వారు అన్నీ ఆలోచించుకున్న మీదటనే కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.
ఏపీలో టీడీపీని తిరిగి ఎన్డీయేలోకి ఆహ్వానించాలని బీజేపీ పెద్దలు సూత్రప్రాయాంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దానికి కారణం ఏపీ నుంచి ఎక్కువ సంఖ్యలో ఎంపీలు బీజేపీకి కావాలి. పొత్తు పార్టీగా టీడీపీ కూడా బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వడానికి రెడీ అయినట్లుగా చెబుతున్నారు. అదే విధంగా బీజేపీకి టీడీపీ ఎంపీలు కూడా మద్దతుగా ఉంటారు.
ఇలా హ్యాట్రిక్ విజయాన్ని కేంద్రంలో నమోదు చేసుకోవడానికి బీజేపీ అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంది అని అంటున్నారు. నిన్నటిదాకా భయపెట్టిన ఇండియా కూటమి ఇపుడు బీటలు వారుతోంది. దాంతో పాటుగా అందులో ఉన్న కీలక నేతలను కూడా బీజేపీ తమ వైపునకు తిప్పుకుంటోంది.
ఇది బీహార్ లో నితీష్ కుమార్ తో మొదలైంది. ఆ తరువాత శివసేనకు చెందిన ఉద్ధవ్ థాక్రేని కూడా బీజేపీలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. తొందరలో ఆయన కూడా బీజేపీ కూటమిలోకి రానున్నారు అని అంటున్నారు. పంజాబ్ లో అకాళీ దళ్ కూడా ఎన్డీయేలో చేరనుంది అని తెలుస్తోంది.
ఈ వరసలోనే పాత మిత్రుడు చంద్రబాబుని కూడా ఎన్డీయేలోకి తీసుకోవాలని చూస్తున్నారుట. బాబు వల్ల జాతీయ స్థాయిలో బీజేపీకి లాభమే తప్ప ఇబ్బంది ఉండదు అన్నది ఒక కచ్చితమైన నిర్ధారణ చేసుకుంటున్నారు. దానితో పాటుగా ఆయన్ని ఇండియా కూటమికి దూరంగా ఉంచాలన్న ఎత్తుగడ కూడా ఉంది. ఇండియా కూటమిని కకావికలు చేసి దాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగడలలో భాగనే విపక్షంలో ఉన్న సీనియర్ నేతలను పార్టీలను తిరిగి ఎండీయే గొడుకు కిందకు తేవడం అని అంటున్నారు.
వచ్చే ఎన్నికలలో బీజేపీ రికార్డు మెజారిటీని సాధించాలని చూస్తోంది. ఎంపీల గెలుపు ఏకంగా నాలుగు వందల పై చిలుకు ఉండాలని తాపత్రయపడుతోంది. అంటే ఎన్డీయే కూటమి గెలిచేది అచ్చంగా 400 ఎంపీల పై మాట అన్న మాట. ఈ రికార్డు 1984లో రాజీవ్ గాంధీకి ఉంది. దాన్ని తిరగరాయాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. అందుకే చాలామందికి బీజేపీ ఇన్విటేషన్లు వెళ్తున్నాయి. చంద్రబాబునూ పిలుస్తున్నారు.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం తొందర్లోనే బీజేపీ ఏపీకి సంబంధించి పొత్తుల విషయంలో సంచలన ప్రకటన చేయడం ఖాయమని అంటున్నారు. సో బాబుకు వెరీ గుడ్ న్యూస్ ఢిల్లీ వినిపించబోతోంది అన్న మాట. వెయిట్ అండ్ సీ.
