Begin typing your search above and press return to search.

టీడీపీకి బిగ్ చాలెంజ్ గా గుడివాడ...గన్నవరం...?

అయిదవసారిగా 2024లో నాని పోటీకి రెడీ అయ్యారు. ఆయనకు సరైన అభ్యర్ధిని నిలబెట్టడం అంటే టీడీపీకి బిగ్ చాలెంజి అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 3:03 PM GMT
టీడీపీకి  బిగ్  చాలెంజ్ గా గుడివాడ...గన్నవరం...?
X

తెలుగుదేశం పార్టీకి ఏపీలో మొత్తం 173 సీట్లూ ఒక ఎత్తు. ఆ రెండు సీట్లూ మరో ఎత్తు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఆ రెండు సీట్లు వైసీపీతో రాజకీయ వైరం మాత్రమే కాదు, టీడీపీ అధినాయకత్వానికి వ్యక్తిగత ప్రతిష్టగా మారాయి. చిత్రమేంటి అంటే టీడీపీకి హార్డ్ కోర్ జిల్లాగా ఉన్న క్రిష్ణా నుంచే ఆ రెండు సీట్లూ గట్టి సవాల్ విసురుతున్నాయి.

అవి ఒకటి మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ అయితే రెండవది గన్నవరం సీటు. ఈ రెండు సీట్లలో ఇద్దరు నేతలూ ఒకనాడు టీడీపీలో కీలక నేతలు, ఈ ఇద్దరూ అప్పట్లో అధినాయకత్వానికి సన్నిహితులు. ఇపుడు వారే అసలైన రెబెల్స్ గా మారిపోయారు.

బలామైన సామాజికవర్గానికి చెందిన నాని, వంశీలకు తమ సొంత సీట్లలో పట్టుంది. వారిని అక్కడ ఓడించడం చాలా కష్టం. ముందుగా కొడాలి నాని గురించి చెప్పుకుంటే ఆయన 2004, 2009లలో తెలుగుదేశం నుంచి గెలిచారు. 2014, 2019లలో వైసీపీ నుంచి గెలిచారు. ఇలా పార్టీలు వేరు అయినా గెలిచి తన సొంత ఇమేజ్ ఏంటో చూపించారు.

అయిదవసారిగా 2024లో నాని పోటీకి రెడీ అయ్యారు. ఆయనకు సరైన అభ్యర్ధిని నిలబెట్టడం అంటే టీడీపీకి బిగ్ చాలెంజి అని అంటున్నారు. మాటలు చెప్పడం వేరు పోటీకి దిగి ఓడించడం వేరు నాని గుడివాడలో అంతలా పాతుకుపోయారు ఆయన మీద గతంలో పోటీ చేసిన వారు అంతా ఓటమి బాటన పట్టిన వారే. ఇపుడు గుడివాడ టీడీపీ ఇంచార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావుని నిలబెట్టాలా లేక ఎన్నారై గా ఉన్న వెనిగండ్ల రాముని నిలబెట్టాలా అన్నది టీడీపీకి అర్ధం కాకుండా ఉంది.

ఈ ఇద్దరిలో ఎవరిని నిలబెట్టినా నానిని ఢీ కొట్టి విజయం సాధించగలరా అన్నది మరో వైపు పార్టీలో చర్చగా ఉంది. ఇక ఇదే రకమైన పరిస్థితి గన్నవరంలో ఉంది. ఇక్కడ బలమైన నేతగా వల్లభనేని వంశీ అవతరించారు. ఆయన 2014, 2019లలో రెండు సార్లు గెలిచి తన సత్తా చాటారు.

ఆయన 2024లో మరోసారి వైసీపీ నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇక గన్నవరం ఇంచార్జిగా యార్లగడ్డ వెంకటరావుని పార్టీ నియమించింది. ఆయనకు టికెట్ ఇస్తారా అన్నది మాత్రం తెలియదు. ఎందుకంటే ఆయన 2019లో వంశీ మీద జగన్ వేవ్ లో సైతం ఓడిపోయారు. ఇపుడు టీడీపీకి అంత వేవ్ ఉందా అన్నది ఒక చర్చ అయితే యార్లగడ్డ అటు నుంచి ఇటు వచ్చినా అక్కడ ఉన్నది వంశీ అని అంటున్నారు.

గన్నవరంలో మీటింగ్ భారీ ఎత్తున పెట్టి నారా లోకేష్ మాస్ డైలాగులు అయితే కొట్టారు. కానీ ఆచరణలో వంశీని కానీ కొడాలి నానిని కానీ ఓడించడం అంటే కష్టమే అన్న మాట ఉంది. ఎన్నికలకు వ్యవధి చూస్తే పట్టుమంది తొమ్మిది నెలలు కూడా లేవు. ఇంకా ఒక డెసిషన్ కి రాకపోతే అది నానికి, వంశీకి ప్లస్ అవుతుంది అని అంటున్నారు.

ఎన్నికల వేళ హడావుడి ఎంత చేసినా కూడా అపుడు అసలు కుదిరే వ్యవహారం కాదని అంటున్నారు. ఇక యార్లగడ్డ టీడీపీలో చేరినా తనకు ఎక్కడ సీటు ఇచ్చినా పోటీకి రెడీ అంటున్నారు. అంటే ఆయనకు గన్నవరం గ్యారంటీ కాదా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. మరో వైపు చూస్తే టీడీపీలో ఈ అయోమయమే నాని వంశీలకు రాజకీయ లాభాన్ని తెస్తోంది అని అంటున్నారు.

ఈ పరిణామాలను చూస్తే కనుక ఈ రెండు సెట్లూ టీడీపీ అధినాయకత్వానికి బిగ్ సవాల్ గా మారాయని అంటున్నారు. ఇక్కడ ఒక్క మాట ఉంది. ఏపీలో రేపటి రోజున కష్టాలు అన్నీ ఫలించి టీడీపీ అధికారంలోకి వచ్చినా ఈ రెండు సీట్లలో ఓడితే మాత్రం అది సంపూర్ణ ఆనందం ఇవ్వదని అంటున్నారు. మరి ఈ రెండు సీట్లూ మొత్తం టీడీపీ గెలుపుతో సమానం అంతకంటే ఎక్కువ అయినపుడు ఎలాంటి క్యాండిడేట్లు ఇక్కడ నుంచి పోటీకి దిగుతారో అన్నది ఇపుడు ఉత్కంఠగా మారింది.