Begin typing your search above and press return to search.

కేశినేని నానికి చెక్ తో విజయవాడలో టీడీపీ కొంప కొల్లేరేనా...!?

ఆయనకు చెక్ పెడుతూ టీడీపీ తన గొయ్యి తానే తవ్వుకుందని కామెంట్స్ వినవస్తున్నాయి. కేశినేని నానిని పొమ్మనకుండా పొగబెట్టి బయటకు సాగనంపారు అని టాక్ అయితే వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Jan 2024 1:41 PM GMT
కేశినేని నానికి  చెక్ తో విజయవాడలో టీడీపీ కొంప కొల్లేరేనా...!?
X

ఆయన సీనియర్ నేత. రెండు సార్లు ఎంపీ అయిన వారు. నిబద్ధతతో పనిచేసే నైజం కలిగిన నాయకుడు. ఆయనే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఆయనకు చెక్ పెడుతూ టీడీపీ తన గొయ్యి తానే తవ్వుకుందని కామెంట్స్ వినవస్తున్నాయి. కేశినేని నానిని పొమ్మనకుండా పొగబెట్టి బయటకు సాగనంపారు అని టాక్ అయితే వినిపిస్తోంది.

ఇంతకీ నాని మీద టీడీపీ అధినాయకత్వానికి ఎందుకు అంత కోపం అంటే చాలానే మ్యాటర్ ఉంది అంటున్నారు. ఆయన ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు తరఫున రాయబారాలు నడపరు, చీకటి వ్యవహారాలు లాంటి పనులు చేయరు. అందుకే ఆయన మీద వేటు వేశారు అని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేశినేని నానిని బయటకు సాగనంపాలన్న నిర్ణయం చాలా కాలం క్రితమే తీసుకున్నారని, అయితే కేవలం టైం కోసమే చూశారని అంటున్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు లోపలి మనిషి బయటకు వచ్చారని అందుకే తన తరఫున ఢిల్లీలో ఎలాంటి లాబీయింగ్ చేయని వారిని ఉపేక్షించను అంటూ వేటు వేశారని ప్రచారం సాగుతోంది.

కేశినేని నానికి పొగ పెట్టడం కూడా వింతగా ఉంది. పార్టీ వ్యవహారాల్లో జోక్యం వద్దు ఉన్నా లేనట్లుగా ఉండండి అంటూ రాయబారం పంపడం వెనక ఉద్దేశ్యాలు ఏంటో రాజకీయం తెలియని వారికి కూడా అర్ధం అవుతాయి. అందుకే కేశినేని నాని కూడా వెంటనే రియాక్ట్ కావాల్సి వచ్చింది అంటున్నారు.

నిజానికి చూస్తే ఈ నెల ఈనెల ఏడోతేదీన తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు విజయవాడ నుంచి ఎంపీగా పార్టీ తరఫున ఉన్న కేశినేని నానికి బదులుగా ఆయన తమ్ముడు చిన్నిని ఇంచార్జిగా నియమించారు. ఇదే వింత అనుకుంటే అంతేకాకుండా తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని నానిని పార్టీ ఆదేశించింది

ఇక తిరువూరులో చంద్రబాబు సభ ఏర్పాటు గురించిన సన్నాహక వ్యవహారాలు చూసేందుకు ఏర్పాటు చేసిన సమావేశం సైతం చిన్ని, నాని వర్గీయుల మధ్య వివాదంగా మారింది. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో ఇరువర్గాల వారు కొట్టుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దేవదత్‌ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇది కాస్తా చినికిచినికి గాలివానలా మారింది. తమను అవమానించేందుకే సిట్టింగ్ ఎంపీ నాని ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ నాని వర్గం ఆందోళన చేసింది.

ఆ తరువాత అక్కడికి వచ్చిన చిన్నిని సైతం నాని వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల కార్యకర్తలు కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. ఇదంతా జరిగిన నేపధ్యంలో అదను చూసి మరీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్‌ చెక్‌ పెట్టింది. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇంఛార్జ్‌ను హైకమాండ్‌ నియమించింది. అలాగే, కేశినాని తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ ఆదేశించడం చర్చనీయాంశం అయింది.

ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందుకే ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇలా నాని విషయంలో మొదటి నుంచి ఒక వైఖరితో టీడీపీ పెద్దలు వ్యవహరిస్తూ చివరికి ఆయనకు పార్టీ పరంగా ఏమీ లేదని తేల్చేశారు. పార్టీ నుంచి బయటకు పంపించేలా చేశారు

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పట్ల ఎంపీ కేశినేని నాని కూడా స్ట్రాంగ్ గా స్పందించారు. తాను ఎవరికీ గులాంగిరీ చేసేది లేదని పేర్కొంటూనే ఇండిపెండెంటుగా గెలవగలను అని ప్రతిజ్ఞ చేశారు. ఇదే విషయాన్నీ అయన ఫేస్ బుక్ లో సైతం స్పష్టం చేసారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు రావని అవి కనుక తనకే వస్తే ఇంకా పెద్ద పదవులలలో తాను ఉండేవాణ్ణని అంటూ అయన చంద్రబాబుకే కెలికి వదిలిపెట్టారు.

అంతే కాదు ఇక నేడో రేపో ఎంపీగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తరువాత తన రాజకీయ గమనం ఎటు ఉంటుందో తెలుస్తుంది అని కూడా ఒక వార్నింగ్ లాంటిదే ఇచ్చేశారు. ఇదిలా ఉంటే కేశినేని నాని విషయంలో మొదటి నుంచి టీడీపీ హై కమాండ్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది అని అంటున్నారు. ఆయన పట్ల ఉదాశీనంగా ఉంటూ చంద్రబాబుకు అనుంగు నేతలుగా ఉన్న బోండా ఉమా వంటివాళ్ళను ప్రోత్సహిస్తోంది. ఇదంతా ఒక పధకం ప్రకారమే సాగుతోంది అని అంటున్నారు.

అంతే కాదు కేశినేని నానిని పనిగట్టుకుని మరీ విమర్శించే వారిని ఏమీ అనకుండా చోద్యం చూడడం వెనక ఉద్దేశ్యాలే వేరు అని అంటున్నారు. అలా విజయవాడలోని కొందరు టీడీపీ కీలక నేతలు నానిని తరచూ విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబు పంపగా వచ్చిన ఒక ప్రతినిధి బృందం నానిని కలిసి పార్టీ పనుల్లో జోక్యం వద్దని సూచించి వెళ్ళింది.

దీంతో టీడీపీతో నానికి బంధాలు తెగినట్లు అయింది. అయితే ఇపుడు కేశినేని నాని ఏమి చేయబోతారు అన్నదే పెద్ద ప్రశ్న. ఆయనకంటూ సొంత ఇమేజ్ ఉంది. బలం ఉంది. మరి ఆయన తన సత్తా చాటాలని చూస్తున్నారు. నాని వంటి బలమైన నేతకు చెక్ పెట్టడం ద్వారా విజయవాడ రాజకీయాల్లో టీడీపీ బిగ్ ట్రబుల్స్ నే తెచ్చుకుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.