Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై జగన్‌ కామెంట్లు.. టీడీపీ ఘాటు కౌంటర్‌!

జగన్‌ చేసిన కామెంట్లకు టీడీపీ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఈ మేరకు సోషల్‌ మీడియా ప్లాట్‌పాం ఎక్స్‌ లో ఈ మేరకు ఘాటుగా స్పందించింది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 4:00 AM GMT
చంద్రబాబుపై జగన్‌ కామెంట్లు.. టీడీపీ ఘాటు కౌంటర్‌!
X

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టు అయి 50 రోజులకుపైగా జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యం దృష్ట్యా బెయిల్‌ ఇస్తున్నామని.. 28 రోజుల తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో లొంగిపోవాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే ఎల్వీ ప్రసాద్‌ ఐ ఆస్పత్రిలో తన కంటికి కాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు ఇంకా మరికొన్ని వైద్య పరీక్షలు జరగాల్సి ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నారని ఆయన తరఫు లాయర్లు తాజాగా ఏపీ హైకోర్టుకు నివేదించారు.

మరోవైపు వైసీపీ నేతలు చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అనారోగ్యం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పై చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా హైదరాబాద్‌ కు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చిన్న అనారోగ్య సమస్య వచ్చిన హడావిడిగా హైదరాబాద్‌ వెళ్లి వైద్యం పొందుతున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తి రాష్ట్రంలో పేదల వైద్యంపై శ్రద్ధ చూపిస్తారా అని జగన్‌ నిలదీశారు.

జగన్‌ చేసిన కామెంట్లకు టీడీపీ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఈ మేరకు సోషల్‌ మీడియా ప్లాట్‌పాం ఎక్స్‌ లో ఈ మేరకు ఘాటుగా స్పందించింది. గత సార్వత్రిక ఎన్నికల ముందు విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌ పై కోడికత్తితో దాడి చేసినప్పుడు జగన్‌ వైద్యానికి హుటాహుటిన హైదరాబాద్‌ కు వెళ్లిన సంగతి తెలిసిందే

ఈ నేపథ్యంలో జగన్‌ భుజానికి అయిన గాయం చిత్రాన్ని పోస్టు చేసిన టీడీపీ.. "హే ఫేక్‌ బ్రో.. ఈ కోడికత్తి యాక్టింగ్‌ చేస్తున్నప్పుడు నువ్వు వైజాగ్‌ నుంచి ఎక్కడికి జంప్‌ కొట్టావు" అని నిలదీసింది. కోడికత్తి ఘటనకు సంబంధించిన ఫొటోను కూడా టీడీపీ పోస్టు చేసింది. 'జగన్‌ కోడికత్తి డ్రామా' అనే హ్యాష్‌ ట్యాగును కూడా ఇందుకు జత చేసింది.

అంతేకాకుండా ఇటీవల మంత్రులు రోజా, విశ్వరూప్, బొత్స సత్యనారాయణ, అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి కొడాలి నాని ఎక్కడ వైద్యం తీసుకున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో జగన్‌ చెబుతున్నట్టు అద్భుతమైన వైద్యం అందుతుంటే వీరంతా చెన్నై, హైదరాబాద్, ముంబైలకు వెళ్లి ఎందుకు చికిత్సలు చేయించుకున్నారని నిలదీస్తున్నారు.