Begin typing your search above and press return to search.

వీడియో ఆంధ్రాలో కాదు.. అమెరికాలో.. ఎక్కడంటే?

ఎందుకుంటే.. ఫలితాలు ఈ ఉదయం నుంచి వెలువడితే.. రాత్రి వేళ సంబరాలు చేసుకోవటం ఏమిటి?

By:  Tupaki Desk   |   4 Jun 2024 7:28 AM GMT
వీడియో ఆంధ్రాలో కాదు.. అమెరికాలో.. ఎక్కడంటే?
X

సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ చిట్టి వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసినంతనే షాక్ తినాల్సిందే. ఎందుకుంటే.. ఫలితాలు ఈ ఉదయం నుంచి వెలువడితే.. రాత్రి వేళ సంబరాలు చేసుకోవటం ఏమిటి? అంటే.. ముందు రోజు రాత్రి నుంచే తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారా? అయినా.. ఆంధ్రాలో సంబరాల మీద పెద్ద ఎత్తున ఆంక్షలు ఉన్నప్పుడు.. అంత జోష్ లో ఎలా సంబరాలు చేసుకుంటున్నారు? అన్న సందేహాలు మనసును ఉక్కిరిబిక్కిరి పెట్టేయటం ఖాయం.

కానీ.. ఈ వీడియో ఏపీకి చెందింది కాదు. మన దేశానికి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలోని డల్లాస్ లో తెలుగు తమ్ముళ్లు ఏపీలో టీడీపీ కూటమి సాధిస్తున్న ఘన విజయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో.. పట్టలేనంత ఆనందంతో వారు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆ మాటకు వస్తే ఒక్క డల్లాస్ లోనే కాదు.. ఎక్కడైతే తెలుగు వారు అధికంగా ఉంటారో.. ఆయా ప్రాంతాల్లోని తెలుగు తమ్ముళ్లు తమ హర్షాతిరేకాల్ని వీధుల్లోకి వచ్చి చాటుతున్నారు. దేశం కాని దేశంలో ఉన్నప్పటికి ఏపీలో ఈసారి నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎలక్షన్ కీలకంగా మారటం తెలిసిందే. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే.. తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధిస్తున్నట్లుగా ఓటింగ్ సరళి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో సంబరాలు మొదలు పెట్టేశారు అమెరికాలోని తెలుగు తమ్ముళ్లు.