Begin typing your search above and press return to search.

పీకే ఎంట్రీ : వైసీపీ టీడీపీ లిస్ట్ లేట్ అవుతుందా....!?

ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సడెన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన గిర్రున అయిదేళ్లు తిరిగేసరికి వైసీపీ గూటి నుంచి టీడీపీ శిబిరంలో మెరిసారు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 9:36 AM GMT
పీకే ఎంట్రీ : వైసీపీ టీడీపీ లిస్ట్ లేట్ అవుతుందా....!?
X

ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సడెన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన గిర్రున అయిదేళ్లు తిరిగేసరికి వైసీపీ గూటి నుంచి టీడీపీ శిబిరంలో మెరిసారు. ఆయన ఎన్నికల వ్యూహకర్త ఎవరు డబ్బులు ఇస్తే వారికి పనిచేస్తారు అని అనుకోవచ్చు. అలా అని ఆయన్ని లైట్ తీసుకునే సీన్ అయితే లేదు అని అంటున్నారు. ఏపీలో నువ్వా నేనా అని ఢీ కొంటున్న రెండు అగ్ర పార్టీలకు ఒకరే అటూ ఇటూ మారడం మాత్రం అతి పెద్ద రాజకీయ విచిత్రంగానే చూస్తున్నారు.

ఇంతకీ పీకే ఏమి చేస్తారు టీడీపీని ఎలా పైకి లేపుతారు అన్నది ఒక ఆసక్తిగా మారింది. అయితే పీకే సడెన్ ఎంట్రీతో ఏపీ రాజకీయాలలో సమీకరణలు మారబోతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. దాని కంటే ముందు చూస్తే మాత్రం అటు అధికార వైసీపీ ఇటు ప్రతిపక్ష టీడీపీ తమ అభ్యర్ధుల జాబితా ప్రకటనను కొన్ని రోజులు వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నాయా అంటే పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తోంది అని అంటున్నారు.

ఇక ముందుగా మాట్లాడుకుంటే అధికార వైసీపీ తన అభ్యర్ధుల జాబితాను జనవరి 10లోగా మూడు విడతలుగా ప్రకటిస్తుంది అని ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. అయితే ఇపుడు మాత్రం ఇంకా లేట్ అయ్యే సూచనలు ఉన్నాయని అంటున్నారు. అంటే వైసీపీలో మరిన్ని డిస్కషన్స్, మరింత వడపోత అయితే ఉండవచ్చు అని అంటున్నారు.

ఇక టీడీపీ విషయం చూస్తే ఆ పార్టీ కూడా తన జాబితాను సంక్రాంతి లోగా ప్రకటిస్తుంది అని ప్రచారం సాగిది. అయితే ఇపుడు అక్కడ పీకే చేరడంతో ఆయన సలహా సూచనలు ఆయన శైలిలో చేసే సర్వేలు ఇంకా జాబితా విషయంలో ఇంప్రూవ్మెంట్స్ ఇలాంటివి చాలా జరుగుతాయి కాబట్టి టీడీపీ జాబితా కూడా లేట్ అయ్యేలా ఉందని అంటున్నారు.

ఇక టీడీపీకి లేట్ గా అయినా లేటెస్ట్ గా పీకే ఎంట్రీ ఇచ్చారని అంటున్నారు. దాంతో ప్రస్తుతం టీడీపీ జాబితా చూసి ఆ మీదట తన డెసిషన్స్ పీకే చెప్పాల్సి ఉంది అంటున్నారు అలాగే పీకే మార్క్ సోషల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుందని అంటున్నారు. దాంతో టీడీపీలో ఇప్పటిదాక అనుకున్న సీట్లు అభ్యర్ధుల విషయంలో మరింత లోతైన పరిశీలన జరుగుతుందని అంటున్నారు.

ఇవన్నీ అయ్యేసరికి ఇంకా చాలా సమయం పడుతుంది అని కూడా అంటున్నారు. ఇక వైసీపీ కూడా ఇపుడు తొందర పడడం లేదు అంటున్నారు. పీకే అంటే ఏంటో పూర్తిగా వైసీపీకి తెలుసు కాబట్టి ఆయన సోషల్ ఇంజనీరింగ్ ఆయన సెలెక్షన్ అన్నీ చూసుకుని ఆ మీదటనే అభ్యర్ధుల ప్రకటన చేయడం మంచింది అన్నదే వైసీపీ లో ఉన్న ఆలోచన అని చెబుతున్నారు.

పీకే వ్యూహాలు అన్నీ వైసీపీకి అలవాటు అయినవే అందుకే ఆయన విషయంలో తక్కువ అంచనా వేయడం లేదు అని అంటున్నారు. దాంతో ఇప్పటిదాకా అనుకున్న సీట్లు క్యాండిడేట్ల విషయంలో మరింత లోతైన అధ్యయనం చేయాలని వైసీపీ డిసైడ్ అయింది అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఒక్క పీకే ఎంట్రీతో అటు టీడీపీలో ఇటు వైసీపీలో కూడా జాబితాలు అలా ఆగిపోయాయని అంటున్నారు.

ఇపుడు పీకే ఏ రకమైన వ్యూహాలు రచిస్తారో ఎవరిని అభ్యర్ధిగా ప్రకటించేలా టీడీపీకి సలహా ఇస్తారో చూడాలి దాన్ని బట్టి వైసీపీ తన ఆలోచనలు మార్చుకుని కొత్త వారిని ఆయా చోట్ల బరిలోకి దించుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే పీకే మాత్రం రెండు ప్రధాన పార్టీల లిస్ట్ లకు టెంపరరీగా బ్రేక్ వేశారని ప్రచారం అయితే సాగుతోంది.