Begin typing your search above and press return to search.

టీడీపీ కూటమి....మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసినట్లేనా...!?

ఇక ఏపీ ఎన్నికలకు సంబంధించి రకరకాలైన సర్వేలు వచ్చాయి. డజన్లకు పై బడి చేసిన జాతీయ ప్రాంతీయ సర్వేలలో అత్యధిక శాతం మరోసారి వైసీపీకే అధికారం అని చెబుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 March 2024 1:30 AM GMT
టీడీపీ కూటమి....మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసినట్లేనా...!?
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు చూస్తే గట్టిగా నలభై రోజులు కూడా లేవు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజా తీర్పునకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. ఈ టైం చాలా కీలకం. ఇపుడు జనంలో ఏర్పడిన అభిప్రాయం మార్చడం దాదాపుగా అసాధ్యం. ఏ భారీ సంఘటనో ఏ ఎమోషనల్ ఫీల్ ని ఇచ్చే అంశం ఈ నలభై రోజుల మధ్యలో చోటు చేసుకుంటే తప్ప పెద్దగా మార్పు చేర్పులు అయితే ఓటరు తీర్పులో ఉండవు అనే అంటున్నారు.

ఇక ఏపీ ఎన్నికలకు సంబంధించి రకరకాలైన సర్వేలు వచ్చాయి. డజన్లకు పై బడి చేసిన జాతీయ ప్రాంతీయ సర్వేలలో అత్యధిక శాతం మరోసారి వైసీపీకే అధికారం అని చెబుతున్నాయి. అదే సమయంలో ఆ పార్టీకి 2019లో వచ్చిన 151 సీట్లలో భారీ కోత పడుతుందని కూడా విశ్లేషిస్తున్నాయి.

ఇక టీడీపీకి వచ్చిన 23 సీట్ల స్థానంలో డబులు త్రిబుల్ అయ్యే చాన్స్ ఉందని కూడా వెల్లడిస్తున్నాయి. జనసేనకు నాడు ఒకటి వస్తే ఇపుడు అది కాస్తా బాగానే పెరగవచ్చు అన్నది కూడా సర్వేల అంచనాలను బట్టి తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సర్వేలు వాటి సాధికారత విశ్వసనీయత వారు తీసుకునే శాంపిల్స్ ఇవన్నీ ఒక పక్కకు పెడితే అనేక ఎన్నికలను చూసిన వారు అలాగే ఓటర్ల మూడ్ ని గమనిస్తున్న వారు, ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతవరణాన్ని గమనిస్తున్న వారు అంతా చెప్పేది ఒక్కటే వైసీపీ ఓడిపోదు అని.

అదెలా అంటే వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. ఇపుడు ఎంత వ్యతిరేకత ఉన్నా అందులో సగానికి పైగా సీట్లు వస్తే అధికారం మళ్లీ ఆ పార్టీదే కదా అన్నది సింపుల్ లాజిక్ తో చెప్పే మాట. ఇక ఏపీలో వైసీపీ ఏమీ చేయలేదు అన్నది అభివృద్ధిలో, చేసింది అన్నది సంక్షేమంలో. అదే ఈ రోజున శ్రీరామ రక్షగా ఆ పార్టీని నిలబడి కాస్తోంది.

అందుకే వైసీపీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా పాస్ మార్కులతో ఒడ్డున పడుతుంది అన్నది రొడ్డకొట్టుడు వాదన. ఇక విపక్షం చూస్తే ఈ అయిదేళ్ళలో తన బలం ఎంతో కొంత పెంచుకుంది కానీ అధికారాన్ని దక్కించుకునే స్థాయిలో అది లేదనే సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ ఒక లెక్క చెప్పుకుంటే టీడీపీ ఎక్కడ ఏ నంబర్ వద్ద ఆగిపోతోందో అర్ధం అవుతుంది.

టీడీపీకి 2019లో 23 సీట్లు వచ్చాయి. ఆ పార్టీకి మరో నలభై సీట్లలో గెలుపు లేకుండా చేసినది జనసేన చీలిక ఓట్లు. ఇపుడు ఈ రెండు పార్టీలు కలసిపోయాయి. అంటే 23 ప్లస్ 43 టోటల్ నంబర్ 66 అవుతుంది. కాస్తా అటూ ఇటుగా సర్వేలూ అదే చెబుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ చేసిన సర్వే చూస్తే మరోసారి వైసీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చింది.

ఇంతకు ముందు వచ్చిన పలు సర్వేలు కూడా ఇదే చెప్పాయి. ఇక ఈ తాజా సర్వే ప్రకారం చూస్తే కనుక 2024 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 15 సీట్లు, తెలుగుదేశం పార్టీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది. అంటే 2019 కంటే ఏకంగా ఏడు ఎంపీ సీట్లను వైసీపీ కోల్పోతుంది అన్న మాట. అదే విధంగా ఆ ఏడూ టీడీపీ కూటమికి ప్లస్ అయి టోటల్ గా వారు పది సీట్లు తెచ్చుకుంటారు అన్న మాట.

దీన్ని కనుక అసెంబ్లీ సీట్లకు కన్ వర్ట్ చేసి చూస్తే వైసీపీకి 105 సీట్లతో కంఫర్టబుల్ మెజారిటీ వస్తుంది. మరోసారి అధికారం దక్కుతుంది. అలాగే 70 సీట్లతో టీడీపీ జనసేన కూటమి నిలుస్తుంది. దీని చూస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 88 కంటే 17 సీట్లు ఎక్కువగా వైసీపీ సాధిస్తుంది అన్న మాట.

అలాగే మ్యాజిక్ ఫిగర్ కి 18 సీట్ల దూరంలో టీడీపీ జనసేన కూటమి ఉండిపోతుంది అన్న మాట. ఇది చాలా దగ్గరగా ఓటర్ల నాడిని పట్టి వేసిన సర్వేగానే చెబుతున్నారు. ఏపీలో హోరా హోరీ పోరు అంటే ఇదే. ఈ పోరులో టీడీపీ జనసేన భారీగా పుంజుకుంటాయి కానీ అధికారానికి దూరంగానే ఉంటాయి. వైసీపీ గెలుస్తుంది కానీ బంపర్ మెజారిటీ దక్కదు. రేపటి ఎన్నికల్లో జనం ఇచ్చే తీర్పు ఇలాగే ఉంటుందా అంటే వేచి చూడాల్సిదే.