ఏపీలో మహిళలకు.. ఉందిలే మంచికాలం.. !
టీడీపీ అంటేనే మహిళా పక్షపాత పార్టీ. పదవుల నుంచి ప్రాధాన్యం వరకు మహిళలను పార్టీ అందలం ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 26 Jun 2025 3:54 PM ISTటీడీపీ అంటేనే మహిళా పక్షపాత పార్టీ. పదవుల నుంచి ప్రాధాన్యం వరకు మహిళలను పార్టీ అందలం ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు. ఇటు మంత్రివర్గంలోనూ.. అటు ఇతర కార్పొరేషన్ పదవుల్లోనూ.. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇక, సాధారణ మహిళల విషయానికి వస్తే.. గత ఎన్నికల సమయంలో వారిని టార్గెట్ చేసుకుని పలు పథకాలను ప్రకటించారు. తద్వారా మహిళలకు మరింత సేవలు చేస్తామని హామీలు గుప్పించారు.
వీటిలో ప్రధానంగా తల్లికి వందనం పథకం.. ఉచిత గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆడబిడ్డ నిధి.. పేరుతో సూపర్ సిక్స్‌లో సింహ భాగం వారికే ఇచ్చారు. అయితే.. ఏడాది కాలంలో అస్సలు ఏమీ చేయలేదని వైసీపీ చెబుతున్న నేపథ్యంలో మహిళలను సెంట్రిక్‌గా తీసుకున్నప్పుడు.. సర్కారు వారికి ఏం చేసిందన్నది ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం పథకాలను అమలు చేశారు.
ఇక, మిగిలిన వాటి విషయానికి వస్తే.. ఆగస్టు 15 నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కూటమి శ్రీకారం చుడుతోంది. తద్వారా రాష్ట్రంలోని మహిళలు ఉచితంగా ఎక్కడనుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం లభిం చనుంది. ఇది సర్కారుపై నెలకు 350 కోట్ల వరకు భారం పడేలా చేస్తుందని ఒక అంచనా ఉంది. అయినప్పటికీ.. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు సర్కారు దీనిని అమలు చేసేందుకు ముందుకు వస్తోంది. ఇక, మరో కీలక పథకం.. ఆడబిడ్డ నిధి.
ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.1500 చొప్పున నెలనెలా ఇవ్వనున్నారు. ఇది కూడా కీలక కార్యక్రమం. అయితే.. దీనిని పీ-4కు అనుసంధానం చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉంది. తద్వారా.. పేదలను గుర్తించి.. ఆయా కుటుంబాలలోని మహిళలకు దీనిని వర్తింప చేయనున్నా రు. అంటే.. మొత్తంగా ఇప్పటి వరకు జరిగింది .. ఒక ఎత్తయితే.. ఇకముందు జరిగేది మరో ఎత్తు. ఇక, చెప్పిన వాటిని పక్కన పెడితే.. చెప్పనివి కూడా చాలానే ఉన్నాయి.
మహిళలకు డ్రోన్లు ఇస్తున్నారు. తద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నారు. అదేవిధంగా స్వల్ప వడ్డీతో రుణాలు ఇవ్వడం ద్వారా వారిని కుబేరులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అలానే.. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించనున్నారు. ఇలా.. భవిష్యత్తు అంతా మహిళల చుట్టూనే తిరిగేలా కూటమి సర్కారు ప్రయత్నాలు చేస్తోంది.
