Begin typing your search above and press return to search.

ప్రతీ ఇంటికీ వెళ్ళి తీరాల్సిందే...బాబు స్ట్రాంగ్ డోస్ !

టీడీపీ మరింతగా పటిష్టం అవడమే కాదు ప్రజలతో కనెక్షన్ ఇంకా ఉండేందుకు ఈ తరహా కార్యక్రమం డిజైన్ చేశామని అధినాయకత్వం చెబుతోంది.

By:  Satya P   |   3 Aug 2026 2:03 PM IST
ప్రతీ ఇంటికీ వెళ్ళి తీరాల్సిందే...బాబు స్ట్రాంగ్ డోస్ !
X

తెలుగుదేశం పార్టీ తన రెండేళ్ళ పాలన మీద జనం వద్దకు వెళ్ళాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి ఇంటింటికీ టీడీపీ అన్న పేరు పెట్టింది. ఈ కార్యక్రమాన్ని ఏంతో ప్రతిష్టాత్మకంగా పార్టీ భావిస్తోంది. ఇప్పటికి ఈ కార్యక్రమం చేపట్టి వారం పైగా అవుతోంది. అయితే ఈ కార్యక్రమం ఎలా సాగుతోంది అన్న దాని మీద ఫీడ్ బ్యాక్ తీసుకున్న బాబు పార్టీ క్యాడర్ కి స్ట్రాంగ్ గానే డోస్ ఇచ్చారని అంటున్నారు. ప్రతీ ఇంటికీ నాయకులు క్యాడర్ అంతా వెళ్ళి తీరాల్సిందే అని ఆయన స్పష్టం చేసారని అంటున్నారు.

చేసిన మంచి చెప్పాలి :

గడచిన రెండేళ్ళ కాలంలో టీడీపీ ఎన్నో మంచి పనులు చేసింది అని ఆయన పార్టీ నేతలతో అన్నట్లుగా చెబుతున్నారు. ఆ మంచిని జనాలకు చెప్పుకోకపోతే లాభమేంటి అని అంటూ ఇంటింటికీ వెళ్ళి వివరించాలని ఆదేశించారని అంటున్నారు. పార్టీ నిర్దేశించిన గడువులోగా ప్రతీ నియోజకవర్గంలో నేతలు అంతా అన్ని ఇళ్ళూ తిరగాలని ఆయన కోరారని భోగట్టా. ఇది చాలా మంచి అవకాశంగా పార్టీ నేతలు బాబు వివరించారని అంటున్నారు.

వెళ్ళి తీరాల్సిందే :

ఎవరైనా జనం వద్దకు వెళ్ళి తీరాల్సిందే బాబు స్పష్టం చేశారు. ఇంటింటికీ తిరగకపోతే ఆయా నాయకులు ఇంటికే అని బాబు హెచ్చరించినట్లుగా చెబుతున్నారు. ఏపీలో చాలా చోట్ల ఈ కార్యక్రమం బాగానే సాగుతున్నా కొన్ని చోట్ల మాత్రం నేతలు తేలికగా తీసుకుంటున్నారని ఆరోపణలు రావడంతో బాబు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని సమీక్షించారని అంటున్నారు. లైట్ తీసుకుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఇక మై టీడీపీ యాప్ లో కూడా నేతలు తాము చేసిన కార్యక్రమాలు ఇళ్ళకు వెళ్ళిన విషయాలు అన్నీ ఫోటోలు వీడియోలు అప్ లోడ్ చేయాలని అధినేత సూచించారు అని అంటున్నారు.

పటిష్టత కోసమే :

టీడీపీ మరింతగా పటిష్టం అవడమే కాదు ప్రజలతో కనెక్షన్ ఇంకా ఉండేందుకు ఈ తరహా కార్యక్రమం డిజైన్ చేశామని అధినాయకత్వం చెబుతోంది. దీని వల్ల ఆయా స్థానిక నాయకత్వాలకు పార్టీకి కూడా మేలు జరుగుతుందని కూడా దిశా నిర్దేశం చేస్తోంది. అయితే కొన్ని చోట్ల పార్టీ పెద్ద నాయకులు వెళ్ళకుండా చిన్న నాయకులతో మమ అనిపించడం పట్ల కూడా ఫిర్యాదులు రావడంతో అధినాయకత్వం నేరుగా రంగంలోకి దిగింది అని అంటున్నారు. ఎవరైనా పార్టీకి ఒక్కటే అని పార్టీ చెప్పిన కార్యక్రమం సక్రమంగా అమలు చేయకపోతే అటు నుంచి అటే ఇంటికే వెళ్తారని కూడా గట్టిగా అధినాయకత్వం హెచ్చరిస్తున్నట్లుగా చెబుతున్నారు.

కోస్తాలో హిట్ :

ఇక ఇంటింటికీ టీడీపీ పేరుతో పార్టీ చేపట్టిన కార్యక్రమం కోస్తా జిల్లాలలో హిట్ అయినట్లుగా పార్టీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఉభయ గోదావరి జిల్లాలలో కూడా బాగా సాగుతోంది. ఇక ఉత్తరాంధ్రా జిల్లాలలో భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ నేపథ్యంలో కొంత గడువు ఇచ్చారు. దాంతో వారు ఇపుడు ఇంటింటికీ పేరుతో జనంలోకి వెళ్తున్నారు. రాయలసీమలో చూస్తే చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతోంది అని అంటున్నారు. తాజాగా బాబు తన వద్ద ఉన్న నివేదికలను సరి చూసుకుంటూ పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో మరింతగా పుంజుకుంటుందని భావిస్తున్నారు. మొత్తానికి టీడీపీని చూసి మిగిలిన పార్టీలు నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ఒక కార్యక్రమం ఇచ్చి ఊరుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం ద్వారా మొత్తం అందరూ యాక్టివ్ అయ్యేలా చూసుకోవడం టీడీపీకే చెల్లు అని అంటున్నారు.