టీడీపీ హిస్టరీలోనే అతి పెద్ద సంక్షేమం !
తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమానికి మారు పేరు అన్నది ఒక మాట ఉంది. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తూనే కూడూ గుడ్డ, గూడు అన్న నినాదాన్ని అందుకున్నారు.
By: Tupaki Desk | 16 Jun 2025 8:30 AM ISTతెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమానికి మారు పేరు అన్నది ఒక మాట ఉంది. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తూనే కూడూ గుడ్డ, గూడు అన్న నినాదాన్ని అందుకున్నారు. అయితే అప్పటికే కాంగ్రెస్ ఇందులో గూడు అన్న దానిని కొంత చేసింది. ఐతే పక్కా ఇళ్ళు మాత్రం టీడీపీ హయాంలోనే వచ్చాయి. అలాగే రేషన్ ద్వారా చౌక బియ్యం ఇవ్వడం కూడా అన్న గారే మొదలెట్టారు. ఇక పెన్షన్ వృద్ధులకు ఇవ్వాలన్న ఆలోచన ఆయనకే వచ్చిందని సీనియర్ నేత కళా వెంకటరావు కడపలో జరిగిన మహానాడులో చెప్పారు.
మొదట్లో నెలకు 35 రూపాయలు పెన్షన్ ఇచ్చెదిగా మొదలైన ఈ పెన్షన్ తరువాత 75 కి పెరిగింది. ఇదంతా టీడీపీలోనే జరిగింది. ఇక వైఎస్సార్ హయాంలో 200 గా దానిని చేశారు. 2014లో చంద్రబాబు సీఎం కాగానే అయిదింతలు పెంచి వేయి చేశారు. ఆ తరువాత ఆయనే 2019లో దిగిపోతూ ఏకంగా రెండు వేలు చేశారు. జగన్ దానిని అయిదేళ్ళు గడిచాక మూడు వేలు చేస్తే బాబు 2024లో వస్తూనే ఏకంగా నాలుగు వేలకు పెంచేశారు.
ఇలా సామాజిక పెన్షనల్లో టీడీపీ టాప్ గా ఉన్నా కూడా దాని కంటే ఎక్కువ పేరు తల్లికి వందనం పధకంలో వచ్చింది ఎందుకంటే పెన్షన్లు అన్నది దేశంలో అంతా ఇస్తున్నదే. ఇక తల్లికి వందనం అన్నది అమ్మ ఒడి అన్న వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన పధకమే. అయితే వైసీపీ కుటుంబంలో ఒకరిని మాత్రమే ఈ పధకం వర్తింప చేస్తే చంద్రబాబు దానిని ఎంతమంది ఉంటే అందరికీ అన్నారు.
అలా ఇపుడు తల్లికి వందనం పేరుతో లక్షలు ఇంట్లోకి వస్తున్నాయి. కనీసంగా ప్రతీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అలాగే కొందరికి ముగ్గురు ఉంటారు. వీరికి తక్కువలో తక్కువ ముప్పై నలభై వేల దాకా ఒకేసారి డబ్బు వస్తోంది. దాంతో జనాలు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ హిస్టరీలోనే సంక్షేమంలో అతి పెద్ద రికార్డుగా చెప్పుకుంటున్నారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు చేసి చూపించింది దాంతో ఈ పధకం కింద తల్లుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 8వేల 745 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థులకు పథకం వర్తింపచేశారు. అంతే కాదు ఈ పధకం కింద అనర్హులు ఎవరైనా ఉంటే వారు ఈ నెల 20వ తేదీలోగా తమ దరఖాస్తులు మళ్ళీ పెట్టుకుంటే తప్పులు ఉంటే పరిశీలించి వారికి పధకం అందిస్తామని ప్రభుత్వం చెప్పడం ఊరట కలిగించే విషయమే.
మొత్తంగా చూస్తే సంక్షేమ పధకాలను చంద్రబాబు అమలు చేయరు, ఆయనకు ఆ ట్రాక్ రికార్డు అన్నది లేదు అని విపక్ష వైసీపీ పదే పదే చేసిన విమర్శలకు సరైన బదులునే చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు. అంతే కాదు దేశంలోనే ఎక్కడా ఎవరూ చేయని విధంగా ఆ మాటకు వస్తే టీడీపీ పుట్టాక ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ చేయని విధంగా చేసి చూపించారు అని అంటున్నారు.
దీంతో అభివృద్ధికే బాబు అంబాసిడార్ అని అంతా అనుకునే వారికి సంక్షేమానికి కూడా ఆయన అసలైన చిరునామా అని అనిపించుకున్నారు అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీకి నోరెత్తకుండా చేయడమే కాదు సమీప భవిష్యత్తులో ఎవరూ కూడా టీడీపీ తరహాలో సంక్షేమ అమలు చేయలేరన్న పేరుని ఒక్క తల్లికి పధకం అమలు ద్వారానే బాబు సాధించారు అని అంటున్నారు. దటీజ్ బాబు అనిపించుకున్నారు.
