ఇంటింటికీ 'సుపరిపాలనలో తొలి అడుగు'పై ప్రజల రియాక్షన్ ఇదే!
అవును... ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మొదలై సందడిగా సాగుతుంది.
By: Tupaki Desk | 2 July 2025 12:31 PMఏపీ ప్రభుత్వం చేపట్టిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం పండగ వాతావరణంలో మొదలై, రాష్ట్ర వ్యాప్తంగా సందడిగా సాగుతోంది. ఈ సమయంలో... టీడీపీ ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరుగుతూ.. కూటమి ఏడాది చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల నుంచి ఆసక్తికర రియాక్షన్ వస్తోంది.
అవును... ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మొదలై సందడిగా సాగుతుంది. ఈ క్రమంలో... పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికీ తిరుగుతూ.. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అది ఫుల్ పాజిటివ్ గా వస్తోంది!
చంద్రబాబు ప్రభుత్వం తమ పాలనను ప్రజలకు ప్రత్యక్షంగా వివరించే దిశగా మొదలుపెట్టిన "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమం ద్వారా.. ప్రజాప్రతినిధులను నేరుగా కలుసుకునే అవకాశం ప్రజలకు లభిస్తోంది. ఇదే సమయంలో... ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం చూపించిన చొరవను ప్రజలకు వివరించే అవకాశం నేతలకూ దక్కుతోంది.
ప్రధానంగా కూటమి ప్రభుత్వ ఇచ్చిన 'సూపర్ - 6' హామీల అమలు, కీలక పథకాలు, ప్రాజెక్టుల పురోగతి, చేసిన అభివృద్ధి గురించి చెబుతూ.. చేయబోయే పనుల గురించి ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ.. ప్రస్తుతం పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ హామీల అమలులో చంద్రబాబు చూపిస్తున్న కమిట్ మెంట్ గురించి వివరిస్తూ, వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
ఈ సందర్భంగా స్పందిస్తున్న ప్రజలు... టీడీపీ నేతలకు తమ తమ ఇళ్ల వద్ద స్వాగతం పలుకుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పథకాల అమలుపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధను అభినందిస్తున్నారు. ఇదే సమయంలో... గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎదుర్కొన్న వివక్షతను వివరిస్తున్నారు.. బాబును అభినందిస్తున్నారు.
ఇదే సమయంలో... ‘తల్లికి వందనం’ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ అందిస్తుండటంపై మహిళల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా... సామాజిక పెన్షన్స్ పెంపుపై వృద్ధులు, వికలాంగులు చంద్రబాబు సర్కార్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నామని అంటున్నారు.
ఇలా తమ ఏడాది పాలన గురించి.. అందులో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం గురించి వివరించడాని వెళ్లిన టీడీపీ ప్రజాప్రతినిధులకు.. ప్రజల నుంచి ఈ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. వారంతా సంతృప్తిగా వెనుదిరుగుతున్నారని తెలుస్తోంది. ఏడాది పాలనలోనే ప్రజలకు ఇంత సంతృప్తిని, సంతోషాన్ని కలిగించినందుకు గర్వంగా ఉందనే కామెంట్లు వారి నుంచి వినిపిస్తున్నాయి.