Begin typing your search above and press return to search.

టీడీపీ సీనియర్లకు అక్కడ చోటు ?

తెలుగుదేశం పార్టీలో ఇపుడు యువ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతీ మహనాడుకూ ఈసారి మహానాడుకు మధ్య తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

By:  Satya P   |   30 May 2026 9:24 AM IST
టీడీపీ సీనియర్లకు అక్కడ చోటు ?
X

తెలుగుదేశం పార్టీలో ఇపుడు యువ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతీ మహనాడుకూ ఈసారి మహానాడుకు మధ్య తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఎక్కువగా కొత్త వారితో యువతతో మాట్లాడించారు. వారికే వేదికను ఇచ్చారు. అదే సమయంలో కొంతమంది సీనియర్లను కూడా పిలిచి పెద్ద పీట వేశారు. అయితే వీటిని చూస్తున్నపుడు టీడీపీలో ఒక కీలక మార్పు జరగబోతోంది అని అర్థం అవుతోంది రానున్నది జూనియర్ల యుగం అని కూడా అంతా అవగాహనకు తెచ్చుకుని ఇప్పటికే మానసికంగా కూడా సిద్ధం అయిపోయారు. అయితే టీడీపీలో సీనియర్లకు కూడా సముచిత స్థానం ఉంటుందని చెఉతున్నారు వారి అనుభవాలను సైతం పార్టీ వాడుకుంటుందని అంటున్నారు ఏళ్ళకు ఏళ్ళు ఏకంగా కొన్ని దశాబ్దాల పాటు పార్టీకి సేవ చేసిన సీనియర్ల నుంచి పార్టీ ఎపుడూ సరైన మార్గదర్శకత్వం పొందుతుందని కూడా చెబుతున్నారు.

గంపగుత్తగా వారికేనా :

ఇదిలా ఉంటే టీడీపీలో పలువురు సీనియర్లను గురించి ప్రత్యేకంగా వారి కోసమే పార్టీ పెద్దల సభలో చోటు కల్పిస్తుందని అంటున్నారు. పెద్దల సభ అంటే శాసన మండలి అన్న మాట. టీడీపీ కూటమికి నిజంగా రాజ్యసభ శాసనమండలిలో అదృష్టమే అని అంటున్నారు అక్కడ ఏ ఒక్క సీటు ఖాళీ అయినా అవి కూటమి పరమే కాబోతున్నాయి. ప్రస్తుతం రాజ్యసభ ఖాళీలు నాలుగు అవుతున్నాయి. కానీ టైట్ పొజిషన్ గానే ఉంది. దాంతో ఇక్కడ సీటు కోసం ప్రయత్నం చేసి విఫలం అయ్యే సీనియర్లు కానీ పార్టీతో తమకు సముచిత స్థానం కోరుకునే వారు కానీ ఎక్కువ మంది ఉన్నారు అలాంటి వారి అందరికీ పార్టీ ఎమ్మెల్సీ స్థానాలలో భర్తీ చేస్తుందని చెబుతున్నారు. ఈసారి పదుల సంఖ్యలోనే సీట్లు ఖాళీ అవుతాయని వాటిలో సింహ భాగం సీనియర్లకే అని ప్రచారం అయితే సాగుతోంది.

సగం మండలి ఖాళీ :

వచ్చే ఏడాది అంటే 2027 టీడీపీ కూటమికి శాసనమండలిలో చాలా కీలకమైన ఏడాదిగా చెబుతున్నారు. ఎందుకంటే మొత్తం శాసనసభలో 58 సీట్లు ఉంటే అందులో దాదాపుగా సగానికి సగం 23 సీట్లు ఒకేసారి ఖాళీ కాబోతున్నాయి. అలా ఖాళీ అయ్యే సీట్లలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్ రాజు కూడా ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి ఎంతో మంది పదవీ విరమణ చేయబోతున్నారు. అలా మండలిలో ఒకేసారి 23 ఖాళీలు అంటే మాటలు కాదు. వాటిని భర్తీ చేసే సువర్ణ అవకాశం టీడీపీ కూటమికే దక్కబోతోంది దాంతో టీడీపీ సీనియర్ నేతలకు ఇక్కడ చోటు కల్పించేందుకు రెడీ అవుతోంది అని అంటున్నారు.

పెద్దలుగా ఉంటూనే :

ఈ విధంగా ఆరేళ్ళ పాటు ఎమ్మెల్సీ పదవీ కాలం సీనియర్ల అనుభవానికి తగినట్లుగా ఇస్తారు అని అంటున్నారు దాంతో వారు విలువైన సూచనలు సలహాలు మండలిలో ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి మేలు చేసే విధంగా దోహదపడతారు అని అంటున్నారు. ఇలా సీనియర్లను మండలికి సర్దుబాటు చేయడం ద్వారా ఆయా నియోజకవర్గాలలో కొత్త ముఖాలను యువతను ప్రోత్సహించాలని టీడీపీ డిసైడ్ అయింది అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే కొత్త నీరు వచ్చి పాత నీరుని నెట్టేయడం కామన్ అయినా టీడీపీ మాత్రం సీనియర్లను గౌరవించాలనే చూస్తోంది అని అంటున్నారు అలా సీనియర్లకు భారీ ఊరట దక్కబోతోంది అని అంటున్నారు.